Hyderabad New Law: హైదరాబాద్ పాలనలో కొత్త చట్టం అక్టోబర్ 2 నుంచి క్యూర్-2026 అమలు చట్టం అమలులోకి వచ్చింది. దీంతో 70 ఏళ్ల జీహెచ్‌ఎంసీ చట్టానికి ముగింపు పడింది. దీంతో కొత్త పాలనా విధానానికి శ్రీకారం చుట్టారు. ఒక్క ఆస్తికి ఒక్క ఐడీ పన్ను, నీటి బిల్లులకు ఒకే బిల్లు ఉండేలా అధికారులు చర్యలు తీసుకున్నారు.
ఇల్లు రిజిస్ట్రేషన్ కాగానే మ్యూటేషన్ ఆఫీసుల చుట్టూ తిరిగే పని లేకుండా ఈ కొత్త చట్టం పనిచేయనుంది. ఆస్తిపన్ను పెంపుపై పరిమితి ఏడాదికి గరిష్ఠంగా 10 శాతమే ఉండనుంది. ఇక భవన అనుమతులన్నీ ఆన్‌లైన్‌లో నమోదుచేసుకునేలా చర్యలు చేపట్టారు. ఒక వేల ఆలస్యం అయితే అప్పీల్‌కు అవకాశం కల్పించనున్నారు. రోడ్లు తవ్వే ముందు శాఖల సమన్వయం అనవసర తవ్వకాలకు చెక్ పెట్టనున్నారు.
ఈ కోత్త చట్టంతో ట్రాఫిక్, రోడ్డు భద్రతకు ప్రత్యేక వ్యవస్థను స్కూల్ జోన్లపై ఫోకస్ పెట్టనున్నారు. చెరువులు, నాలాలు, పార్కుల రక్షణకు హైడ్రాకు మరిన్ని అధికారాలు చట్టబద్దతతో ఇవ్వనున్నారు. ఇకపై చెరువులు, నాలాలు, ఫుట్‌పాత్‌లపై వ్యర్థాలు వేస్తే భారీ జరిమానాలు విదించనున్నారు. వరదలు, అగ్నిప్రమాదాలపై ప్రత్యేక ప్రణాళికలతో పాటు భవనాల భద్రతకు ఫైర్ ఆడిట్ మహిళలు, వృద్ధులు, దివ్యాంగులు, గిగ్ కార్మికులకు ప్రత్యేక సదుపాయాలను ఈ కొత్త చట్టంతో కల్పించనున్నారు.
Also Read: హైదరాబాద్ క్రికెట్ అభిమానులకు షాకింగ్ న్యూస్..?