E-Paper
Advertisement

తమిళనాడు సీఎం విజయ్ ను కలిసిన విజయ్ దేవరకొండ రష్మిక దంపతులు!

తమిళనాడు సీఎం విజయ్ ను కలిసిన విజయ్ దేవరకొండ రష్మిక దంపతులు!
Advertisement

Vijay Devarakonda -Rashmika: టాలీవుడ్ సినీ నటుడు విజయ్ దేవరకొండ, నటి రష్మిక మందన్న ప్రస్తుతం రణబాలి సినిమా(Ranabaali Movie) ప్రమోషన్ కార్యక్రమాలలో ఎంతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా అక్టోబర్ 16వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్లను వేగవంతం చేస్తున్నారు.ఈ నేపథ్యంలోనే విజయ్ దేవరకొండ (Vijay Devarakonda)రష్మిక(Rashmika) ముంబై చెన్నై వంటి ప్రాంతాలలో పర్యటిస్తూ ఈ సినిమా ప్రమోషన్లను నిర్వహిస్తున్నారు. నేపథ్యంలోనే తాజాగా ఈ జంట చెన్నై వెళ్లినట్టు తెలుస్తోంది. ఇలా చెన్నై వెళ్లిన ఈ దంపతులు తమిళనాడు ముఖ్యమంత్రి, సినీ నటుడు జోసెఫ్ విజయ్(C.M.Vijay) ను కలిశారు.

సీఎం విజయ్ తో అద్భుతమైన సమయం..

ఇలా ముఖ్యమంత్రి విజయ్ తో విజయ్ దేవరకొండ రష్మిక మందన్న భేటీ కావడంతో ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇలా రష్మిక విజయ్ దేవరకొండ సీఎం బిజీతో కలిసి దిగిన ఫోటోలను విజయ్ దేవరకొండ తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ.. తళపతి విజయ్ సర్ తో ఎంతో అద్భుతమైన సమయాన్ని గడిపాము. రోజంతా బిజీగా గడిపినప్పటికీ ఆయన మమ్మల్ని చాలా ఆప్యాయంగా ఆహ్వానించారు. జీవితానికి అలాగే సినిమాలకు, ప్రపంచానికి సంబంధించి ఎన్నో వ్యక్తిగత విషయాలలో సీఎం విజయ్ గారు మాతో పంచుకున్నారు. ఒక సమావేశం తోనే విజయ్ సర్ నాకు ఎంతో ఇష్టమైన వ్యక్తిగా మారిపోయారు. మళ్లీ మిమ్మల్ని కలిసే వరకు మీపై నా ప్రేమ, గౌరవం ఎప్పటికీ ఇలాగే ఉంటాయి అంటూ విజయ్ దేవరకొండ సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.

సీఎం విజయ్ తో వారసుడు సినిమాలో రష్మిక..

Advertisement

ఈ విధంగా రష్మిక విజయ్ దేవరకొండ ఉన్నఫలంగా తమిళనాడు సీఎం విజయ్ ను కలవడంతో ఈ భేటీ వెనుక గల కారణం ఏంటి అంటూ ఎన్నో సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. అయితే రణబాలి ప్రమోషన్లలో భాగంగానే చెన్నై వెళ్లిన ఈ దంపతులు సీఎం విజయ్ ను కలిసారని తెలుస్తోంది. ఇకపోతే రష్మిక మందన్న సీఎం విజయ్ తో కలిసి వారసుడు అనే సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఇక విజయ్ దేవరకొండ రష్మిక రణబాలి సినిమా విషయానికి వస్తే ఈ సినిమా పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే.

Advertisement

సుమారు 150 సంవత్సరాల క్రితం బ్రిటిష్ పరిపాలనలో భాగంగా రాయలసీమ ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి, రాయలసీమలో ఏర్పడిన కరువు కాటకాల గురించి ఈ సినిమా ద్వారా ప్రేక్షకులకు తెలియజేయబోతున్నారు. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ పేదల పక్షాన పోరాటం చేసే ఒక యోధుడిగా సింగనమల బొబ్బి లి రణబాలి పాత్రలో కనిపించబోతున్నారు. ఇక విజయ్ జోడిగా రష్మిక మందన్న నటించిన సంగతి తెలిసిందే. ఈమె జయమ్మ పాత్రలో సందడి చేయబోతున్నారు. ఈ సినిమా విడుదలకు కేవలం నాలుగు రోజుల సమయం మాత్రమే ఉంది.ఈ సినిమా నుంచి విడుదల చేసిన అప్డేట్స్ సినిమా పట్ల మంచి అంచనాలను పెంచేశాయి.

Also Read: మోక్షజ్ఞ సినిమాలపై ఒత్తిడి.. షాకింగ్ విషయాలు బయటపెట్టిన బాలయ్య చిన్నల్లుడు!

Related News

సినిమాల్లో నల్గొండ గద్దర్ హవా.. ఒక్క పాటకు ఎంత తీసుకుంటాడంటే?

గ్లామర్‌తో అదరగొడుతోంది.. కానీ సినిమాల సంగతేంటి నభా?

మోక్షజ్ఞ సినిమాలపై ఒత్తిడి.. షాకింగ్ విషయాలు బయటపెట్టిన బాలయ్య చిన్నల్లుడు!

అనుపమకు ఆ సినిమా అంటే అంత పిచ్చా..50 సార్లు చూసానంటూ!

నానిని బావ అని ఎందుకు పిలుస్తానో తెలుసా? స్నిగ్ధ చెప్పిన అసలు విషయం ఇదే!

నితిన్ భార్యగా చేస్తున్న రుక్మిణి ఎవరో తెలుసా?

నాని ‘బ్లడీ రోమియో’ షూటింగ్ షూర్..ఫస్ట్ షెడ్యూల్ డీటెయిల్స్ ఇవే!

Big Stories

Advertisement
×