BigTV English
Advertisement

HRRL Recruitment: హెచ్ఆర్ఆర్ఎల్‌లో ఉద్యోగాలు.. రూ.2,20,000 జీతం, క్వాలిఫికేష్ ఇదే..

HRRL Recruitment: హెచ్ఆర్ఆర్ఎల్‌లో ఉద్యోగాలు.. రూ.2,20,000 జీతం, క్వాలిఫికేష్ ఇదే..

HRRL Recruitment: నిరుద్యోగ అభ్యర్థులకు ఇది మంచి అవకాశం అని చెప్పవచ్చు. హెచ్‌పీసీఎల్ రాజస్థాన్ రిఫైనరీ లిమిటెడ్ (హెచ్ఆర్ఆర్ఎల్) లో ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హత కలిగిన వారు వెంటనే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. బీటెక్, పీజీ, డిప్లొమా పాసైన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. నోటిఫికేషన్ కు సంబంధించిన ఉద్యోగ వెకెన్సీలు, విద్యార్హతలు, ముఖ్యమైన తేదీలు, జీతం, ఉద్యోగ ఎంపిక విధానం తదితర వివరాల గురించి క్లియర్ కట్‌గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.


హెచ్‌పీసీఎల్‌ రాజస్థాన్‌ రిఫైనరీ లిమిటెడ్‌ (HRRL) రాజస్థాన్‌ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఎగ్జిక్యూటివ్‌ ఖాళీల భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత ఉండి ఆసక్తి కలిగిన అభ్యర్థులు జులై 11వ తేదీ నుంచి ఆగస్టు 11 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవచ్చు.

మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 131


పలు విభాగాల్లో ఉద్యోగ వెకెన్సీలు ఉన్నాయి. సివిల్, ఫైర్‌ అండ్‌ సేఫ్టీ, ఇనుస్ట్రుమెంటేషన్‌, ఎలక్ట్రికల్, మెకానికల్, కెమికల్, లీగల్‌, ఫైనాన్స్‌, హెచ్‌ఆర్‌ విభాగాల్లో ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. జూనియర్ ఎగ్జిక్యూటివ్, అసిస్టెంట్ ఇంజినీర్, అకౌంట్స్ ఆఫీసర్, ఆఫీసర్, హెచ్ఆర్, ఆఫీసర్ వెల్ఫేర్, ఇంజినీర్, అకౌంట్స్ ఆఫీసర్, మెడికల్ ఆఫీసర్, లీగల్ ఆఫీసర్ ఉద్యోగాలు వెకెన్సీ ఉన్నాయి.

పోస్టులు – ఖాళీలు: 

జూనియర్ ఎగ్జిక్యూటివ్ : 9 పోస్టులు

అసిస్టెంట్ ఇంజినీర్‌, అకౌంట్స్‌ ఆఫీసర్‌, ఆఫీసర్‌, హెచ్‌ఆర్‌, ఆఫీసర్‌ – వెల్ఫేర్‌: 20 పోస్టులు

ఇంజినీర్‌, అకౌంట్స్‌ ఆఫీసర్‌, మెడికల్ ఆఫీసర్‌, లీగల్ ఆఫీర్‌: 53 పోస్టులు

సీనియర్‌ ఇంజినీర్‌, సీనియర్‌ ఆఫీసర్: 21 పోస్టులు

సీనియర్‌ మేనేజర్‌: 28 పోస్టులు

విద్యార్హత: ఉద్యోగాన్ని బట్టి సంబంధిత విభాగంలో పీజీ, ఎంబీబీఎస్‌, బీటెక్‌, డిప్లొమాలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

దరఖాస్తుకు ప్రారంభ తేది: జులై 11

దరఖాస్తుకు చివరి తేది: ఆగస్టు 11

వయస్సు: ఉద్యోగాన్ని బట్టి వయస్సును నిర్ధారించారు. జూనియర్ ఎగ్జిక్యూటివ్, అసిస్టెంట్ ఆఫీసర్, అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్, అసిస్టెంట్ ఇంజనీర్‌కు 25 ఏళ్ల వయస్సు ఉండాలి. సీనియర్ మేనేజర్‌కు 42 ఏళ్లు, మెడికల్ ఆఫీసర్‌, అకౌంట్స్‌ ఆఫీసర్‌, ఆఫీసర్‌, లీగల్, ఇంజినీర్‌కు 29 ఏళ్ల వయస్సు ఉండాలి.  సీనియర్‌ ఇంజినీర్‌, సీనియర్‌ ఆఫీసర్‌, కంపెనీ సెక్రటరీ 34 ఏళ్లు ఉండాలి.

జీతం: ఉద్యోగాన్ని బట్టి వేతనాన్ని నిర్ధారించారు. నెలకు జూనియర్ ఎగ్జిక్యూటివ్‌కు రూ.30,000 – రూ. 1,20,000 జీతం ఉంటుంది అసిస్టెంట్ ఇంజినీర్‌ & అసిస్టెంట్ ఆఫీసర్‌, అసిస్టెంట్ అకౌంట్స్‌ ఆఫీసర్‌కు రూ.40,000 – రూ.1,40,000, ఇంజినీర్‌ అండ్ ఆఫీసర్‌కు రూ.50,000 – రూ.1,60,000, సీనియర్‌ ఇంజినీర్‌ అండ్ సీనియర్‌ ఆఫీసర్‌కు రూ.60,000 – రూ.1,80,000, సీనియర్ మేనేజర్‌కు రూ.80,000 – రూ.2,20,000 జీతం ఉంటుంది.

ఉద్యోగ ఎంపిక ప్రక్రియ: కంప్యూటర్ బేస్ డ్ టెస్ట్, స్కిల్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ  ఆధారంగా ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.1180 ఫీజు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంటుంది.

నోటిఫికేషన్ పూర్తి సమాచారం కోసం అఫీషియల్ వెబ్ సైట్ ను సందర్శించండి.

అఫీషియల్ వెబ్ సైట్: https://hrrl.in/Hrrl/current-openings.jsp

ALSO READ: CCRAS Recruitment: పదితో భారీగా ఉద్యోగాలు.. జీతం రూ.39,100, ప్రాసెస్ ఇదే..

Related News

AP TET 2025 Exam: ఏపీ టెట్ షెడ్యూల్ విడుదల.. డిసెంబర్ 10న పరీక్ష.. నేడే నోటిఫికేషన్

APSRTC Apprenticeship: ఐటీఐ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ఏపీఎస్ఆర్టీసీలో 277 అప్రెంటీస్ పోస్టులు

RRB NTPC Graduate Notification: డిగ్రీ అర్హతతో రైల్వేలో 5,810 ఎన్‌టీపీసీ గ్రాడ్యుయేట్ పోస్టులు.. నేటి నుంచి రిజిస్ట్రేషన్ ప్రారంభం

Bank of Baroda Jobs: మేనేజర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్.. లక్షకు పైగా జీతం, ఇంకా 10 రోజులే

SEBI: రూ.1,26,000 జీతంతో సెబీలో ఉద్యోగాలు.. ఈ అర్హత ఉంటే చాలు, ఉద్యోగం మీదే బ్రో

IPPB Executive: డిగ్రీ పాసైన వారికి గోల్డెన్ ఛాన్స్.. ఐపీపీబీలో భారీగా ఉద్యోగాలు, స్టార్టింగ్ వేతనమే రూ.30వేలు

JEE Main 2026 Schedule: జేఈఈ మెయిన్ 2026 షెడ్యూల్ వచ్చేసింది.. ఎగ్జామ్స్ ఎప్పుడంటే?

RRC JOBS: ఇండియన్ రైల్వే నుంచి భారీ జాబ్ నోటిఫికేషన్.. టెన్త్, ఐటీఐ పాసైతే చాలు, డోంట్ మిస్

Big Stories

×