BigTV English

IND vs ENG : లార్డ్స్ లో పెట్టే ఫుడ్ ఇదే.. ఇంగ్లాండ్ బిర్యాని పెట్టడం లేదని అలిగిన టీమిండియా ప్లేయర్లు ?

IND vs ENG : లార్డ్స్ లో పెట్టే ఫుడ్ ఇదే.. ఇంగ్లాండ్ బిర్యాని పెట్టడం లేదని అలిగిన టీమిండియా ప్లేయర్లు ?

IND vs ENG : ప్రస్తుతం ఇంగ్లాండ్ వర్సెస్ ఇండియా మధ్య టెస్ట్ సిరీస్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఐదు టెస్ట్ సిరీస్ లో భాగంగా మూడో టెస్ట్ మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ లో తొలి ఇన్నింగ్స్ లో తొలుత ఇంగ్లాండు జట్టు బ్యాటింగ్ చేసింది. ఇంగ్లాండ్ జట్టు 387 పరుగులు చేసి ఆలౌట్ అయింది. టీమిండియా ప్రస్తుతం మూడు వికెట్లు కోల్పోయి 65.3 ఓవర్లకు 248 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో కే.ఎల్. రాహుల్ 98 పరుగులు చేసి ఉన్నాడు.  రిషబ్ పంత్ 74 పరుగులు చేసి రాహుల్ సెంచరీ కోసం రనౌట్ అయ్యాడు.  ఇదిలా ఉంటే.. లార్డ్స్ వేదికగా జరుగుతుండటంతో అక్కడ పెట్టే ఫుడ్ గురించి సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతోంది. అదేంటంటే..? ఇంగ్లాండ్ బిర్యానీ పెట్టడం లేదని టీమిండియా ప్లేయర్లు అలిగినట్టు ఓ గాసిప్ వినిపిస్తోంది.


Also Read : Gill – Sara Tendulkar : షాకింగ్.. గిల్ కంటే వయసులో సారా టెండూల్కర్ అంత పెద్దదా… ఇద్దరి మధ్య తేడా ఎంతో తెలుసా?

బిర్యానీ కోసం ఇలా చేసారా..? 


లార్డ్స్ వేదికగా బట్టర్ స్క్వాష్ సూప్, హారిసా మారింటేడ్, చికెన్, మీట్ బాల్స్, miso marinated cod loin, Chines food, లాంబ్ రైల్వే కర్రీ, బట్టర్ నట్ స్క్వాష్, పంప్కిన్ కుర్మ, పన్నీర్ టిక్కా, ఫ్రాన్స్, బాస్మతీ రైస్, క్రష్ డ్ న్యూ పొటాటో, క్యారెట్, బ్రోకలీ, ఫ్రూట్ సలాడ్, గ్రీకు యంగ్ర్త్ వంటి ఫుడ్ మెనో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ తరుణంలో సోషల్ మీడియా లో ఇంగ్లాండ్ బిర్యానీ పెట్టడం లేదని టీమిండియా ఆటగాళ్లు అలిగినట్టు సమాచారం. ఇందులో వాస్తవం ఎంత ఉందనేది మాత్రం క్లారిటీ లేదు. ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ 387 పరుగులకు ఆలౌట్ అయింది. రూట్ 104 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. క్రాలే 18, డకెట్ 23, పోప్ 44, బ్రూక్ 14, స్టోక్స్ 44, జెమీ స్మిత్ 56, జోఫ్రా ఆర్చర్ 4, బషీర్ 1, వోక్స్ డకౌట్ గా వెనుదిరిగారు. భారత బౌలర్లలో బుమ్రా 5 వికెట్లు తీయగా.. సిరాజ్ 2, నితీష్ రెడ్డి 2, రవీంద్ర జడేజా 1 వికెట్ తీశారు.

రిషబ్ రనౌట్.. 

ఇక భారత బ్యాటర్లలో ఓపెనర్ కే.ఎల్. రాహుల్ 98 పరుగులు చేసి క్రీజులో ఉన్నాడు. మరో ఓపెనర్ యవస్వి జైస్వాల్ 13 పరుగులు చేసి ఆర్చర్ బౌలింగ్ లో ఔట్ అయ్యాడు. కరుణ్ నాయర్ 40 పరుగులు చేసి స్టోక్స్ బౌలింగ్ ఔట్ అయ్యాడు. కెప్టెన్ శుబ్ మన్ గిల్ ఈ మ్యాచ్ లో కేవలం 16 పరుగులు మాత్రమే చేయగలిగాడు. వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ 74 పరుగులు చేశాడు. చేతి వేలికి గాయం అయినప్పటికీ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు పంత్. కానీ రాహుల్ సెంచరీ కోసం బంతి దగ్గర ఉన్నా రన్ తీశాడు పంత్. దీంతో స్టోక్స్ వికెట్లకు త్రో వేయడంతో రిషబ్ పంత్ ఔట్ గా వెనుదిరిగాడు. టీమిండియా బ్యాటర్లు ఇంగ్లాండ్ చేసిన 387 పరుగుల లక్ష్యాన్ని అలవకగా చేరుకుంటారని పలువురు పేర్కొంటున్నారు.

 

Related News

Dhoni on Virat : కోహ్లీ పెద్ద జోకర్.. ధోని హాట్ కామెంట్స్ వైరల్!

Night watchman : టెస్ట్ క్రికెట్ లో అసలు నైట్ వాచ్మెన్ అంటే ఎవరు.. వాళ్ల డ్యూటీ ఏంటి

Shreyas Iyer: శ్రేయస్‌కు మరోసారి నిరాశే.. ఆసియా కప్‌ జట్టులో నో ఛాన్స్ ?

BCCI : రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలకు BCCI బిగ్ షాక్…2027 వరల్డ్ కప్ కంటే ముందే కుట్రలు !

Sanju Samson – CSK : సంజూకు ఝలక్.. CSK లోకి అతను వచ్చేస్తున్నాడు!

Digvesh Rathi : దిగ్వేష్ ఒక్కడే పిచ్చోడు అనుకున్నాం.. కానీ వాడిని మించినోడు వచ్చాడు.. ఈ వీడియో చూస్తే పిచ్చెక్కి పోవాల్సిందే

Big Stories

×