Nimisha Priya: యెమెన్‌లో కేరళ నర్సు నిమిష ప్రియకు స్వల్ప ఊరట లభించింది. ఉరిశిక్ష అమలును తాత్కాలికంగా అమలు వేస్తున్నట్టు యెమెన్ ప్రభుత్వం తెలిపింది. కాగా శిక్ష నుంచి తప్పించాలని స్థానిక ప్రభుత్వంతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నట్టు భారత విదేశాంగ శాఖ పేర్కొంది. కోర్టు తీర్పు ప్రకారం ఆమెకు రేపు ఆమెకు ఉరి శిక్ష అమలు కావాల్సి ఉన్న విషయం తెలిసిందే.
2017లో యెమెన్ జాతీయుడైన తలాల్ అదిబ్ మహదీ హత్య కేసులో ఆమె దోషిగా తేలింది. యెమెన్‌లోని ట్రయల్ కోర్టు 2020లో ఆమెకు మరణశిక్ష విధించగా, 2023 నవంబర్‌లో దేశ సుప్రీం జ్యుడీషియల్ కౌన్సిల్ ఈ తీర్పును సమర్థించింది. జూలై 16, 2025న ఆమె ఉరిశిక్ష అమలు కావాల్సి ఉండగా, భారత ప్రభుత్వం, పలువురు ప్రముఖుల జోక్యంతో ఈ శిక్ష తాత్కాలికంగా యెమెన్ ప్రభుత్వం నిలిపివేసింది.
నిమిష ప్రియ ప్రాణాలతో బయట పడాలంటే ఉన్న ఒక అవకాశం ‘బ్లడ్ మనీ’. గతేడాది నిమిష తల్లి యెమెన్ వెళ్లి తనకున్న పరిచయాలతో బ్లడ్‌మనీ ఇచ్చి తన కుమార్తెను కాపాడుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేసింది. అయితే వాటికి బాధిత కుటుంబం ఒప్పుకోలేదు. ప్రియ కుటుంబం ఒక మిలియన్ డాలర్ల (రూ.8.6 కోట్లు)ను బాధిత కుటుంబానికి ఇవ్వడానికి సిద్ధంగా వాళ్లు రియాక్ట్ కాలేదు. ఇప్పటికీ బాధిత కుటుంబాన్ని ఒప్పించేందుకు నిమిష ప్రియ కుటుంబ సభ్యులు ప్రయత్నాలు చేస్తున్నారు. బ్లడ్ మనీకి బాధిత కుటుంబ సభ్యులు ఒప్పుకుంటే.. నిమిష ప్రియకు శిక్ష తప్పే అవకాశం ఉంది.
కేరళలోని పాలక్కాడ్ జిల్లాలోని కొల్లెంగోడ్‌కు చెందిన నిమిష ప్రియ (38) 2008లో కుటుంబాన్ని ఆదుకోవడానికి ఆమె యెమెన్‌కు వలస వెళ్లింది. అక్కడ నర్సుగా పనిచేసిన ఆమె, తర్వాత సొంత క్లినిక్‌ను ప్రారంభించింది. యెమెన్ చట్టం ప్రకారం, విదేశీ వైద్యులు స్థానిక భాగస్వామితో కలిసి క్లినిక్ నడపాలి. ఈ క్రమంలో తలాల్ అబిద్ మహదీతో ఆమె భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఇద్దరు కలిసి అల్‌అమన్ మెడికల్ కౌన్సిల్ సెంటర్‌ను ప్రారంభించారు. అయితే, తలాల్ అబిద్ ఆమె పాస్‌పోర్ట్‌ను గుంజుకుని, ఆమెను వేధించినట్లు ఆరోపణలు వస్తున్నాయి.
కొన్ని రోజుల తర్వాత నిమిష ప్రియ తమ ఇంట్లో ఓ వేడుక కోసం భారత్ కు వచ్చింది. అది ముగిసిన వెంటనే తిరిగి యెమన్ వెళ్లిపోయింది. ఆమె భర్త, కుమార్తె మాత్రం కేరళలోనే ఉన్నారు. తలాల్ అబిద్ దీనిని ఆసరాగా చేసుకుని ఆమె నుంచి డబ్బు లాక్కోవడంతో పాటు వేధించినట్లు నిమిష ప్రియ ఆరోపిస్తుంది. నిమిషను తన భార్యగా మహది చెప్పుకోవడం స్టార్ట్ చేశాడు. ఈ క్రమంలోనే పాస్‌పోర్ట్, ఇతర పత్రాలను లాక్కొన్నాడు. చివరికి ఆమెను కుటుంబసభ్యులతో కూడా మాట్లాడకుండా చేశాడు..
అతని వేధింపులు ఎక్కువ కావడంతో నిమిష ప్రియ 2016లో అతనిపై పోలీసులకు కూడా ఫిర్యాదు చేసింది. కానీ, వారు నిమిషను పట్టించుకోలేదు. దీంతో 2017లో మహదికి మత్తుమందు ఇచ్చి అతడి వద్ద ఉన్న తన పాస్‌పోర్టును తీసుకోవాలని ప్లాన్ వేసింది. కానీ.. ఆ మత్తు మందు డోస్ ఎక్కువవడంతో అతడు చనిపోయాడు. ఆ తర్వాత మృతదేహాన్ని ఓ వాటర్ ట్యాంక్‌లో పడేసింది. చివరికి అక్కడినుంచి సౌదీకి వెళ్తుండగా.. సరిహద్దుల్లో ఆమెను అరెస్టు చేశారు.
ALSO READ: Dheeraj Kumar: ఇండస్ట్రీలో మరో విషాదం.. ప్రముఖ నటుడు కన్నుమూత