Fake Liquor: హైదరాబాద్‌లో కల్తీ మద్యం తయారీ ముఠాను పోలీసులు పట్టుకున్నామని ఎక్సైజ్ ES విజయ్ భాస్కర్ తెలిపారు. తక్కువ ధరకు లభించే చీప్ లిక్కర్‌ను ఖరీదైన బ్రాండ్ల బాటిళ్లలో నింపి విక్రయిస్తున్నారని, జానీ వాకర్, జానీ వెల్స్, డీవార్స్, 100 పైపర్స్ బ్రాండ్ల పేరుతో కల్తీ మద్యం విక్రయాలు చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు.
శంషాబాద్ శాతంరాయిలోని ఓ ఇంట్లో కల్తీ మద్యం తయారీ కేంద్రం గుర్తించామని, గతంలో డిస్టిలరీలో పనిచేసిన అశోక్ ఈ దందాకు ప్రధాన సూత్రధారి అని పోలీసులు తెలిపారు. అశోక్‌కు సహకరిస్తున్న మరో నిందితుడు స్క్రాప్ దుకాణ యజమాని మహమ్మద్ యాకూబ్ పాషా ను పోలీసులు అరెస్ట్ చేశారు. స్క్రాప్ దుకాణాల నుంచి ఖరీదైన బ్రాండ్ల ఖాళీ బాటిళ్ల సేకరిస్తున్నారు. రూ.560 విలువ చేసే చీప్ లిక్కర్‌ను ఖరీదైన బ్రాండ్ల బాటిళ్లలో నింపి అమ్మకాలు చేస్తున్నారు.
Also Read: రెండో ప్రెగ్నెన్సీ.. నరకం చూసాను.. కన్నీళ్లు పెట్టుకున్న ఉపాసన!
ఎక్సైజ్ డీటీఎఫ్ బృందం దాడుల్లో 10 ఫుల్ బాటిళ్లు, 30కి పైగా ఖాళీ బాటిళ్లు స్వాధీన చేసుకున్నామని, స్థానికంగా సుమారు 10 మందికి కల్తీ మద్యం విక్రయించినట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో వంగలి అశోక్, మహమ్మద్ యాకూబ్ పాషా ఇద్దరినీ అరెస్ట్ చేశామని, కానిస్టేబుల్ ధనుంజయ్ ఇచ్చిన సమాచారంతో ఈ ముఠా గుట్టురట్టు చేశామని, ఎక్సైజ్ ES విజయ్ భాస్కర్ తెలిపారు. కల్తీ మద్యం కొనుగోలు చేసిన పది మందిని గుర్తించి విచారిస్తామని, ఎక్కడెక్కడ సరఫరా అయ్యిందనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు.
మూత పై ఉన్న లేబుల్..
ప్రజలు బ్రాండెడ్ బాటిళ్లను చూసి మద్యం నాణ్యతపై అంచనాకు రావద్దు.. నిందితుడు మూత పై ఉన్న లేబుల్ ని కట్ చేసి చీప్ లిక్కర్ నింపుతున్నాడని తెలిపారు. లేబుల్ కట్ చేసిన కూడా ఏ అతికించిన కస్టమర్లు వచ్చి అతని దగ్గర కొనుగోలు చేస్తున్నారని, లేబుల్ ఉంటేనే మందు ప్రియులు మద్యం కొనుగోలు చేసుకోవాలని అన్నారు. కల్తీ మద్యం విక్రయాలపై ఎక్సైజ్ శాఖ నిఘా మరింత పెంచనుంది. ఈ దందా వెనుక ఇంకా ఎవరైనా ఉన్నారా అనే కోణంలోనూ విచారణ చేస్తున్నామని హైదరాబాద్ ఎక్సైజ్ ES విజయ్ భాస్కర్ అన్నారు.
శంషాబాద్‌లో మిక్సింగ్ లిక్కర్ గ్యాంగ్ గుట్టురట్టు
క్యాబ్ డ్రైవర్ ముసుగులో చీప్ లిక్కర్‌ను ఖరీదైన మద్యం సీసాల్లో నింపి అమ్ముతున్న ముఠాను గ్రేటర్ హైదరాబాద్ డీటీఎఫ్ బృందం అరెస్ట్ చేసింది. శంషాబాద్ శాతంరాయికి చెందిన వంగలి అశోక్, స్క్రాప్ వ్యాపారి యాకూబ్ పాషా నుంచి సేకరించిన జానీ… pic.twitter.com/vhRzj8i6MX
— BIG TV Breaking News (@bigtvtelugu) November 17, 2026