PCB Corruption : పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అల్లకల్లోల్లం జరుగుతుందని సమాచారం. ముఖ్యంగా పీసీబీలో అక్రమ నియమాకాలు, కాంట్రాక్టుల ద్వారా మిలియన్ల రూపాయల వరకు అవినీతి నడిచినట్టు పాకిస్తాన్ ఆడిటర్ జనరల్ వెల్లడించాడు. తాజాగా ఓ నివేదిక బయటికి వచ్చింది. ముఖ్యంగా ఈ అక్రమాల్లో అంతర్జాతీయ మ్యాచ్ ల సమయంలో భద్రత కల్పించినందుకు పోలీసుల భోజనాల కోసం రూ.63.39 మిలియన్ల రూపాయలను పాకిస్తానీయులు చెల్లించడం గమనార్హం. అలాగే కరాచీలోని హై పెర్పార్మెన్స్ సెంటర్ లో మొత్తం 5.4 మిలియన్ రూపాయల వేతనంతో అండర్-16 ఏజ్ గ్రూపు విభాగంలో ముగ్గురు కోచ్ లను అనధికారికంగా నియమించడం వంటి ఉన్నాయి. అలాగే సరైన పోటీ లేకుండా టికెట్ల కాంట్రాక్టుల కేటాయింపు పై కూడా ధ్వజమెత్తారు.
Also Read : Jadeja – Carse : రన్ తీయకుండా ఇంగ్లాండ్ బౌలర్ కార్స్ కుట్రలు.. జడేజాను ఆపేసి మరి… ఇచ్చి పడేసిన జడ్డూ
అతనికి మంత్రి పదవీ కూడా..
పాకిస్తాన్ క్రికెట్ బోర్డు దాదాపు 3.8 మిలియన్ల రుసుములను మ్యాచ్ అధికారులకు అధికంగా చెల్లించినట్టు సమాచారం. నెలకు 900,000కి మీడియా డైరెక్టర్‌ని సక్రమంగా నియమించడం లేదని నివేదిక పేర్కొంది. జూన్ 2023 నుంచి జనవరి 2024 వరకు జకా అష్రఫ్.. ఫిబ్రవరి 2024 నుంచి ఇప్పటి వరకు మొహ్సిన్ నఖ్వీ.. ఫ్రిబ్రవరి నుంచి జూన్ 2024 వరకు యుటిలిటీ ఛార్జీలు పీవోఎల్ వసతి చెల్లింపుల రూపంలో ర4.17 మిలియన్ రూపాయలు అనధికారిక చెల్లింపులను ప్రస్తావించారు. ప్రస్తుతం మొహ్సీన్ నఖ్వీ పై ప్రత్యేక దృష్టి సారించింది. నఖ్వీ ఏకకాలంలో పాకిస్తాన్ అంతర్గత మంత్రి పదవీని కూడా ఉండటం విశేషం. ఇక అతని ప్రయోజనాలు అన్ని కూడా చట్టం పరిధిలోకి వచ్చాయి.
198 మిలియన్ల నష్టం..
ప్రధానంగా అనుమతి లేకుండా ఖర్చు చేసిన వాటి గురించి చర్చించారు. బుల్లెట్ ప్రూఫ్ వాహనాల కోసం డీజిల్ పై 19.8 మిలియన్ రూపాయల నుంచి కోస్టర్ల నియామకం పై 22.5 మిలియన్ల వరకు.. రిజర్వు ధర కంటే తక్కువ ధరకు మీడియాకు హక్కులను అందించడం వల్ల 198 మిలియన్ల నష్టం వాటిల్లింది. పారదర్శక పోటీ లేకుండా అంతర్జాతీయ ప్రసార హక్కులను సక్రమంగా ఇవ్వలేదు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు, మొహ్సీన్ నఖ్వీ కాస్త టెన్షన్ పడుతున్నట్టు సమాచారం. ముఖ్యంగా 2025 ఛాంపియన్స్ ట్రోఫీ సమయంలో పాకిస్తాన్ ICC టోర్నమెంట్ లో గ్రూపు దశకు కూడా వెళ్లలేకపోయినప్పుడు ఇది గరిష్ట స్థాయికి చేరుకుంది. నఖ్వీ హయాంలో పలువురు కోచ్ లు, కెప్టెన్లు కూడా మారారు. ప్రస్తుతం న్యూజిలాండ్ కి చెందిన మైక్ హెస్సన్ టీ-20 కెప్టెన్ సల్మాన్ అలీ అఘాతో ముందుండి నడిపిస్తున్నాడు. వచ్చే నెలలో బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లనుంది. అయితే అంతకంటే కరాచీలో క్యాపు ఏర్పాటు చేయనుంది. వచ్చే ఏడాది భారత్ లో జరుగనున్న టీ-20 ప్రపంచ కప్ సన్నాహాలను ప్రారంభించడానికి పాకిస్తాన్, బంగ్లాదేశ్ లు జులై 20 నుంచి మూడు టీ-20 మ్యాచ్ లు ఆడనున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు పాకిస్తాన్ క్రికెట్ బోర్డులో అవకతవకలపై సోషల్ మీడియాలో వైరల్ కావడం విశేషం.
🚨 PAKISTAN CRICKET IN TURMOIL 🚨
– Audit Exposes millions in Corruption and overpayments in Pakistan Cricket Board. (TOI). pic.twitter.com/6Gl4n4xVMx
— Tanuj (@ImTanujSingh) July 14, 2025