E-Paper
Advertisement

విజయవాడలో స్టార్స్ సందడి: ఘనంగా ముగిసిన విబి ఎంటర్టైన్మెంట్స్ అవార్డుల వేడుక

విజయవాడలో స్టార్స్ సందడి: ఘనంగా ముగిసిన విబి ఎంటర్టైన్మెంట్స్ అవార్డుల వేడుక
Advertisement

Vijayawada Awards: సాధారణంగా పెద్ద పెద్ద సినీ అవార్డు వేడుకలు ఎక్కువగా హైదరాబాద్ వంటి నగరాలకే పరిమితమవుతుంటాయి. అయితే ఈ సారి అందుకు వేదిక అమరావతి ప్రాంతమైన విజయవాడ కావడం విశేషం.

ఇక్కడి ప్రతిష్టాత్మక ‘ఏ ప్లస్ కన్వెన్షన్ సెంటర్’ లో ‘విబి ఎంటర్టైన్మెంట్స్’ సంస్థ అవార్డుల ప్రధానోత్సవాన్ని నిర్వహించింది. వెండితెరపై తమ నటనతో ప్రేక్షకులను అలరించే స్టార్లతో పాటు, ప్రస్తుత డిజిటల్ యుగంలో ఓటీటీల ద్వారా కోట్ల మందిని మెప్పిస్తున్న నటీనటులు, తెర వెనుక కష్టపడే ఎంతో మంది టెక్నీషియన్ లని ఒకే వేదికపైకి తీసుకొచ్చి ఘనంగా సత్కరించింది.

Advertisement

ఈకార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విజయవాడ లాంటి చారిత్రక, సాంస్కృతిక నగరంలో ఇలా భారీగా సినీ కార్యక్రమాలు జరగడం పట్ల ఆయన తన సంతోశాన్ని వ్యక్తం చేశారు. కళను, కళాకారులను ఎక్కడైతే పూజిస్తారో ఆ ప్రదేశంలోనే పరిశ్రమ నలుదిశలా వర్ధిల్లుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రతిభను సరైన సమయంలో గుర్తించి ప్రోత్సహించడం వల్ల చిత్ర పరిశ్రమకు కొత్త రక్తం, సరికొత్త ఉత్సాహం తోడవుతాయని చెప్పుకొచ్చారు. తెలుగు సినిమా అభివృద్దికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎల్లప్పుడూ పూర్తి స్థాయి సహకారం అందిస్తుందని ఈ వేదికగా స్పష్టం చేశారు.

వడ్డే నవీన్ కి  ప్రత్యేక అవార్డు

ఇక ఈ వేడుకలో వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన ప్రముఖులకు అవార్డులు ప్రధానం చేశారు. ఒకప్పటి చాక్లెట్ బోయ్, సీనియర్ కథానాయకుడు వడ్డే నవీన్ ఈ వేడుకలో ప్రత్యేక అవార్డు అందుకోవడం విశేషం. ‘పెళ్లి’, ‘చాలా బాగుంది’ వంటి ఆల్ టైమ్ క్లాసిక్ సినిమాలతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న నవీన్ ఈ మధ్య ట్రాన్స్ ఫర్ త్రిమూర్తులు అనే సినిమాతో అలరించిన సంగతి తెల్సిందే.

రాజీవ్ కనకాల కూడా

Advertisement

అలాగే ఈ కార్యక్రమంలో సీనియర్ నటుడు రాజీవ్ కనకాల కూడా పురస్కారాన్ని అందుకోవడంతో ఆడిటోరియం చప్పట్లతో మారు మ్రోగిపోయింది. సంగీత దర్శకుడిగా, గాయకుడిగా, నటుడిగా సత్తా చాటుతున్న రఘు కుంచె ఈ వేడుకలో ప్రధాన ఆకర్షణగా నిలిచారు. ‘దేవుడు చేసిన మనుషులు’, ‘పలాస 1978’ వంటి చిత్రాలతో తనదైన ప్రత్యేక ముద్ర వేసిన రఘు కుంచెకు ఈ వేదికపై ఘనంగా సన్మానం జరిగింది. బుల్లితెరతో పాటు వెండితెరపై కూడా తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి అనితా చౌదరి కూడా ఈ ప్రతిష్టాత్మక పురస్కారాన్ని అందుకున్నారు.

 మళ్ళీ ‘నంది అవార్డుల’కార్యక్రమం 

కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఫిలిం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అంబికా కృష్ణ విబి ఎంటర్టైన్మెంట్స్ నిర్వాహకులను ప్రశంసించారు. ప్రతి ఏటా క్రమం తప్పకుండా ప్రతిభావంతులైన కళాకారులను వెతికి మరీ గౌరవించడం మామూలు విషయం కాదన్నారు. ఇక ఫిల్మ్ నగర్ సాంస్కృతిక కేంద్రం (FNCC) అధ్యక్షుడు కేఎస్ రామారావు పాల్గొనడం ఈ కార్యక్రమంలో పాల్గొనడం విశేషం.
ఇక ఈ సందర్భంగా కేఎస్ రామారావు మాట్లాడుతూ రాష్ట్రంలో కళాకారులకు ఇచ్చే అత్యున్నత ‘నంది అవార్డుల’కార్యక్రమాన్ని మళ్ళీ ప్రారంభించాలని ఆయన ఏపీ ప్రభుత్వాన్ని ఈ వేదికగా కోరారు. విబి ఎంటర్టైన్మెంట్స్ అధినేత విష్ణు బొప్పనకు తన సహకారం ఎప్పుడూ ఉంటుందని తెలిపారు.

విబి ఎంటర్టైన్మెంట్స్ ని మెచ్చుకొని తీరాల్సిందే

ఇక ఈ వేడుక కేవలం అవార్డుల వరకే పరిమితం చేయకుండా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న పలువురు పేద కళాకారులకు నిర్వాహకులు నగదు సహాయం అందించి తమ సేవా గుణాన్ని చాటుకున్నారు.ఇక ఈ కార్యక్రమానికి వి వి కె హౌసింగ్ ఇండియా సంస్థ టైటిల్ స్పాన్సర్‌గా వ్యవహరించగా.. పివిఆర్ గ్రూప్, శ్రీ నిలయ ఇన్‌ఫ్రా, రైతు రాజేంద్ర అగ్రో ఫార్మ్స్, రోటరీ విజయవాడ మిడ్‌టౌన్, ఆర్ఆర్ ఇన్‌ఫ్రా, ఎల్‌ఐసీ మరియు శ్రీ గౌతమ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఈ ఈవెంట్‌ జరగడంలో తమ పాత్ర పోషించాయి.

also read :టికెట్ రేట్ల ‘జీఓ’పై ఫైర్: తెలంగాణ సర్కార్‌కు థియేటర్ ఓనర్ల డెడ్‌లైన్!

ఏది ఏమైనా సినిమాకి సంబందించిన ఏ కార్యక్రమం అయినా కేరాఫ్ హైదరాబాద్ అనుకుంటున్న ఈ సమయంలో విజయవాడలో ఇంత భారీ ఎత్తున అవార్డ్ కార్యక్రమాన్ని జరిపిన విబి ఎంటర్టైన్మెంట్స్ ని మెచ్చుకొని తీరాల్సిందే !

Tags

Related News

టికెట్ రేట్ల ‘జీఓ’పై ఫైర్: తెలంగాణ సర్కార్‌కు థియేటర్ ఓనర్ల డెడ్‌లైన్!

తేదీలు, వారాల పేర్లతో వచ్చిన బ్లాక్ బాస్టర్ మూవీస్ ఇవే.. అనిల్ ప్లాన్ అదుర్స్!

నా బెడ్ రూమ్ గురించి పగటి కలలు కనొద్దు.. బాబా రామ్‌దేవ్‌పై కంగనా ఫైర్!

ఎన్టీఆర్, భూమిక మూవీల తర్వాత మాదే.. ‘మోడ్రన్ మిస్సమ్మ’ నుండి ఫస్ట్ సింగిల్!

‘ఇరుముడి’ హిట్ అవ్వాలంటే ఎంత రాబట్టాలో తెలుసా..?

పవిత్ర గౌడ మాజీ భర్త మృతి.. అసలేం జరిగిందంటే?

తాడ్‌బండ్ ఆలయంలో వరుణ్ తేజ్, లావణ్య ప్రత్యేక పూజలు..

Big Stories

Advertisement
×