E-Paper
Advertisement

ప్రేమ కోసం పెట్టిన కండిషన్… ఆటేరాని వాడు ఫుట్ బాల్ గ్రౌండ్ లోకి దిగితే… ఈ స్పోర్ట్స్ డ్రామా తెలుగులోనే

ప్రేమ కోసం పెట్టిన కండిషన్… ఆటేరాని వాడు ఫుట్ బాల్ గ్రౌండ్ లోకి దిగితే… ఈ స్పోర్ట్స్ డ్రామా తెలుగులోనే
Advertisement

Jaadugar Movie on OTT:  ఫుట్‌బాల్ అంటే ఇష్టం లేని ఓ వ్యక్తి… అదే ఆటలో ఓ టీమ్‌ను గెలిపించాల్సి వస్తే ఎలా ఉంటుంది ? అందులోనూ అతనికి ఫుట్‌బాల్ గురించి కనీస అవగాహన కూడా లేకపోతే ? ఇదే కాన్సెప్ట్‌తో కామెడీ, ఎమోషన్, లవ్‌ను కలిపి తెరకెక్కించిన సినిమా ‘జాదూగర్’ (Jaadugar). ‘పంచాయత్’ ఫేమ్ జితేంద్ర కుమార్ ఇందులో మ్యాజిక్ చేసే మీను పాత్రలో కనిపిస్తారు. అతనికి ఫుట్‌బాల్ అంటే అస్సలు ఇష్టం ఉండదు. కానీ ఓ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటే ఫుట్‌బాల్ టోర్నమెంట్‌లో తన టీమ్‌ను సెమీఫైనల్స్ వరకు తీసుకెళ్లాల్సిందే. దీంతో ఆట రాని ఓ మేజిషియన్… ఓడిపోవడం తప్ప ఇంకేమీ తెలియని టీమ్‌తో కలిసి మొదలుపెట్టే ప్రయాణమే ఈ సినిమా. మరి మీను ప్రేమ కోసం ఫుట్‌బాల్ ఆడగలిగాడా? అసలు చివరికి ఏం జరిగింది ? ఈ సినిమాను ఏ ఓటీటీలో చూడవచ్చు ? అనే వివరాలపై ఒక లుక్కేద్దాం పదండి.

కథలోకి వెళ్తే…

మధ్యప్రదేశ్‌లోని నీమచ్ అనే ఊరిలో ఫుట్‌బాల్ అంటే అందరికీ పిచ్చి. కానీ మీను మాత్రం దానికి పూర్తిగా దూరం. అతని కల మాత్రం గొప్ప మేజిషియన్ కావడం. చిన్నప్పుడే తండ్రిని ఫుట్‌బాల్ మ్యాచ్‌లో కోల్పోవడంతో ఆ ఆటపై అతనికి విరక్తి ఏర్పడుతుంది. మీను బాబాయ్ ప్రదీప్ మాత్రం స్థానిక ‘ఆదర్శ్ కాలనీ’ ఫుట్‌బాల్ టీమ్‌కు కోచ్. ఆ టీమ్‌కు ఓడిపోవడం తప్ప పెద్దగా ఇంకేమీ తెలియదు. అలాంటి సమయంలో మీను జీవితంలోకి దిశా అనే డాక్టర్ వస్తుంది. ఆమెను చూసిన వెంటనే ప్రేమలో పడిపోతాడు.

Advertisement

దిశాను పెళ్లి చేసుకోవాలంటే ఆమె తండ్రి పెట్టే కండిషన్ మీను జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. ఆదర్శ్ కాలనీ టీమ్‌ను సంతోష్ ట్రోఫీ టోర్నమెంట్‌లో సెమీఫైనల్స్ వరకు తీసుకెళ్లాలి. అంతేకాదు, కీలకమైన మ్యాచ్‌లో మీను కూడా ఆడాలి. అప్పుడే పెళ్లికి ఒప్పుకుంటానని చెబుతాడు. ఫుట్‌బాల్ ఆడటం రాని మీను… ఆ టీమ్‌లో చేరతాడు. టీమ్ పరిస్థితి చూసి అతను జడుసుకుంటాడు. ఆటగాళ్లలో కొందరికి అసలు ఆటపై ఆసక్తి ఉండదు. మరికొందరికి వయసు, ఫిట్‌నెస్ సమస్యలు. ఇలాంటి జట్టుతో వరుస మ్యాచ్‌లు ఆడాల్సి వస్తుంది.

అక్కడే తన మ్యాజిక్ తెలివిని మీను ఫుట్‌బాల్‌లో ఉపయోగించడం మొదలుపెడతాడు. ప్రత్యర్థులను గందరగోళానికి గురి చేసే చిన్న చిన్న ట్రిక్స్, మైండ్ గేమ్స్‌తో మ్యాచ్‌లను గెలిపించేందుకు ప్రయత్నిస్తాడు. ఈ క్రమంలో వచ్చే కామెడీ సన్నివేశాలు నవ్విస్తాయి. అదే సమయంలో టీమ్ సభ్యుల మధ్య బంధం కూడా బలపడుతుంది. టోర్నమెంట్ ముందుకు సాగుతున్న కొద్దీ మీను ఆలోచనల్లో కూడా మార్పు వస్తుంది. ప్రేమ అంటే మనకు కావాల్సిన వ్యక్తిని సొంతం చేసుకోవడం కాదని.. వారి సంతోషాన్ని కోరుకోవడమని అర్థం చేసుకుంటాడు.

Advertisement

తండ్రికి ఫుట్‌బాల్‌పై ఉన్న ప్రేమ, బాబాయ్ టీమ్ కోసం పడుతున్న కష్టం కూడా అతనికి అర్థమవుతుంది. చివరి మ్యాచ్‌లో మీను తన వ్యక్తిగత ప్రయోజనం కోసం కాకుండా టీమ్, ఊరి గౌరవం కోసం నిజాయితీగా ఆడాలని నిర్ణయించుకుంటాడు. మరి ఆ టీమ్ చివరికి గెలిచిందా ? మీను దిశాను పెళ్లి చేసుకున్నాడా ? అతని తండ్రి విషయంలో ఉన్న బాధ నుంచి బయటపడగలిగాడా ? అనేదే సినిమా చూసి తెలుసుకోవలసిన అంశం.

తెలుగులో చూడొచ్చా ?

‘జాదూగర్’ ప్రస్తుతం Netflixలో హిందీతో పాటు తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. స్పోర్ట్స్, కామెడీ, లవ్, ఎమోషన్ కలిసిన లైట్‌హార్టెడ్ సినిమా చూడాలని ఉంటే ఈ సినిమాను డోంట్ మిస్.

Read Also: చచ్చి బతికి పగ తీర్చుకునే జడ్జి… 10 ఏళ్ల టైమ్ ట్రావెల్‌తో అదిరిపోయే కొరియన్ సిరీస్ స్ట్రీమింగ్ తెలుగులో

Tags

Related News

ఆ ఊరిలో ప్రతి 10 ఏళ్లకో నరబలి… ఓటీటీలోకి అల్టిమేట్ డార్క్ థ్రిల్లర్… హనుమాన్ చాలీసాను పక్కన పెట్టుకుని చూడండి

లోకాన్ని నాశనం చేయాల్సిన విలన్ బాబు మిస్సింగ్… ఏంజెల్ డెమన్ల టెన్షన్ పీక్స్… మతిపోగొట్టే ఫ్యాంటసీ సిరీస్

తండ్రినే చంపాలని కూతురికి ఆర్డర్… మైండ్ బ్లాకింగ్ స్పై థ్రిల్లర్ సిరీస్

30 వేల ఏళ్లుగా నిద్రపోతున్న డెవిల్ ని గెలికింది… క్యూట్ ఫెయిరీ చేసిన పనికి వరల్డ్ కే వణుకు… ఈ ఫాంటసీ లవ్ కాంబో వేరే లెవెల్

కేస్ నుంచి ఎస్కేప్ అవ్వడానికి లవ్ డ్రామా… డాక్టర్ తో ఫైర్‌ఫైటర్ రొమాంటిక్ లవ్ ట్రాక్

లండన్‌లో వడాపావ్ బిజినెస్‌తో కోట్ల సంపాదన… కానీ ఆ ఒక్క సీక్రెట్ బయటపడితే అంతా షెడ్డుకే

18 ఏళ్ల శత్రుత్వం… బద్దశత్రువుల ఇంట్లో పుట్టి ప్రేమలో పడే జంట… క్రేజీ కొరియన్ రొమాంటిక్ సిరీస్

24 ఏళ్లకే ఫార్ములా వన్ ప్రపంచ ఛాంపియన్… షుమాకర్ లెజెండ్ గా మారిన గూస్‌బంప్స్ మూమెంట్

Big Stories

Advertisement
×