E-Paper
Advertisement

టికెట్ రేట్ల ‘జీఓ’పై ఫైర్: తెలంగాణ సర్కార్‌కు థియేటర్ ఓనర్ల డెడ్‌లైన్!

టికెట్ రేట్ల ‘జీఓ’పై ఫైర్: తెలంగాణ సర్కార్‌కు థియేటర్ ఓనర్ల డెడ్‌లైన్!
Advertisement

Ticket Prices:సినిమా టికెట్ రేట్ల వ్యవహారం ఇపుడు సినీ ఇండస్ట్రీని షేక్ చేస్తుంది.నిన్న ప్రభుత్వం జీవో ఒకసారి చూస్తే థియేటర్ల రకాలు, సీటింగ్ కేటగిరీల ఆధారంగా ధరలని చాలా స్పష్టంగా కేటాయించారు.

నాన్ ఏసీ థియేటర్లలో నాన్-ప్రీమియం సీట్లకు కనిష్ఠంగా రూ. 30, గరిష్ఠంగా రూ. 70 కాగా, ప్రీమియం సీట్లకు కనిష్ఠంగా రూ. 50, గరిష్ఠంగా రూ. 100గా నిర్ణయించారు. ఏసీ థియేటర్ల విషయానికి వస్తే, నాన్-ప్రీమియం కేటగిరీలో కనిష్ఠంగా రూ. 50 నుంచి గరిష్ఠంగా రూ. 150 వరకు, ప్రీమియం కేటగిరీలో కనిష్ఠంగా రూ. 100 నుంచి గరిష్ఠంగా రూ. 200 వరకు అమ్మవచ్చని తెలిపింది.ఇకపోతే స్పెషల్ థియేటర్లు మరియు మల్టీప్లెక్స్‌లలో నాన్-ప్రీమియం కేటగిరీ టికెట్ ధరను కనిష్ఠంగా రూ. 100 నుంచి గరిష్ఠంగా రూ. 250 వరకు ఖరారు చేస్తూ ప్రభుత్వం ఆర్డర్ పాస్ చేసింది.

Advertisement

ఇదిగో ఈ జీవో పైనే ఇపుడు మండిపడుతున్నాయి థియేటర్ యాజమాన్యాలు,ఎగ్జిబిటర్స్ అసోసియేషన్లు. ప్రభుత్వం ప్రకటించిన ఈ జీవో థియేటర్ వ్యవస్థనే నాశనం చేసేలా ఉందంటూ ఒక రేంజ్ లో ఫైర్ అవుతున్నారు.తెలంగాణ సర్కార్ తీసుకొచ్చిన ఈ టికెట్ ధరల నిబంధనలు సింగిల్ స్క్రీన్ థియేటర్లకు, మల్టీప్లెక్స్‌లకు ఏమాత్రం గిట్టుబాటు కావడం లేదని తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ స్పష్టం చేసింది. ప్రస్తుత కరెంట్ బిల్లులు, మెయింటెనెన్స్ ఖర్చులు, జీతాలు పెరిగిన ఈ సందర్బంలో ప్రభుత్వం ఈ ఫ్లెక్సిబుల్ రేట్లు ఏమాత్రం సరిపోవని వారు వాపోతున్నారు. ఈ జీఓ తమ వ్యాపారాన్ని దెబ్బతీసేలా ఉందంటూ తీవ్రంగా ఖండిస్తున్నారు.

ముఖ్యమంత్రికి లేఖ… కోర్టుకు వెళ్లే యోచన

ఇక టికెట్ రేట్ల సమస్యపై త్వరలోనే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిని కలిసి తమ సమస్యలను వివరించాలని, ఒక అధికారిక లేఖ రాయాలని ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ నిర్ణయించినట్టు తెలుస్తుంది. ప్రభుత్వం తమ డిమాండ్లపై సానుకూలంగా స్పందించడానికి పది రోజుల గడువు ఇస్తున్నట్లు తెలిపారు. ఒకవేళ ఈ పది రోజుల్లో సమస్య పరిష్కారం కాకపోతే, తమ హక్కుల కోసం కోర్టు మెట్లు ఎక్కేందుకు   కూడా ఆలోచించమంటూ హెచ్చరించారు.

పెద్ద సినిమాల విడుదల వేళ ఆందోళన

Advertisement

రాబోయే రోజుల్లో పెద్ద బడ్జెట్ సినిమాలు, భారీ అంచనాలున్న పాన్-ఇండియా చిత్రాలు అయిన టాక్సిక్, ఫౌజీ,విశ్వంభర,కింగ్ 100 వంటి పెద్ద సినిమాలు రిలీజ్ కానున్నయి.ఇలాంటి హై బడ్జెట్ సినిమాలకి ప్రీమియర్లకి కాని, మొదటి రోజు కాని వచ్చే వసూళ్లు చాలా ముఖ్యం.అలాంటిది ఇలా ప్రభుత్వం తక్కువ రేట్లని ఫిక్స్ చేస్తే సినిమాకి పెట్టిన కనీస ఖర్చులు కూడా రాబట్టుకోలేమంటూ వాపోతున్నారు. ఇలాంటి భారీ చిత్రాలకు విడుదలైన మొదటి పది రోజులు వచ్చే కలెక్షన్లే అత్యంత ముఖ్యం. దానికి అనుగుణంగా ఫ్లెక్సిబుల్ రేట్లు లేదా టికెట్ రేట్ల పెంపునకు ప్రభుత్వం సహకరించకపోతే, బయ్యర్లు, ఎగ్జిబిటర్లు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది.

also read :తేదీలు, వారాల పేర్లతో వచ్చిన బ్లాక్ బాస్టర్ మూవీస్ ఇవే.. అనిల్ ప్లాన్ అదుర్స్!

ప్రేక్షకులు, ఎగ్జిబిటర్ల మధ్య నలిగిపోతున్న పరిశ్రమ

ఒకవైపు రేట్లు మండిపోతున్నాయి అని కామన్ ఆడియన్స్ థియేటర్ల మొహం చూడని పరిస్థితి ఒకవైపు ఉంటే,  మరోవైపు థియేటర్లు నడపాలంటే రేట్లు భారీగానే ఉండాలంటూ ఎగ్జిబిటర్లు వాదించడం ఇక్కడ గమనార్హం.చూడాలి మరి పది రోజులలోగా ప్రభుత్వం స్పందించి ఎగ్జిబిటర్ల సమస్యలకు పరిష్కారం చూపుతుందా లేక ఇచ్చిన జీవోనే శాసనం అంటూ అదే మాటపై ఉంటుందా అన్నది పది రోజులు ఆగితే కాని తెలిసేలా లేదు !

Tags

Related News

విజయవాడలో స్టార్స్ సందడి: ఘనంగా ముగిసిన విబి ఎంటర్టైన్మెంట్స్ అవార్డుల వేడుక

తేదీలు, వారాల పేర్లతో వచ్చిన బ్లాక్ బాస్టర్ మూవీస్ ఇవే.. అనిల్ ప్లాన్ అదుర్స్!

నా బెడ్ రూమ్ గురించి పగటి కలలు కనొద్దు.. బాబా రామ్‌దేవ్‌పై కంగనా ఫైర్!

ఎన్టీఆర్, భూమిక మూవీల తర్వాత మాదే.. ‘మోడ్రన్ మిస్సమ్మ’ నుండి ఫస్ట్ సింగిల్!

‘ఇరుముడి’ హిట్ అవ్వాలంటే ఎంత రాబట్టాలో తెలుసా..?

పవిత్ర గౌడ మాజీ భర్త మృతి.. అసలేం జరిగిందంటే?

తాడ్‌బండ్ ఆలయంలో వరుణ్ తేజ్, లావణ్య ప్రత్యేక పూజలు..

Big Stories

Advertisement
×