E-Paper
Advertisement

Jananayagan Censor: విజయ్ ‘జననాయగన్’ సెన్సార్‌కు మరో సారి బ్రేక్.. వాయిదాకు కారణం ఇదే!

Jananayagan Censor: విజయ్ ‘జననాయగన్’ సెన్సార్‌కు మరో సారి బ్రేక్.. వాయిదాకు కారణం ఇదే!
Advertisement

Jananayagan Censor: దళపతి విజయ్ నటిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘జననాయగన్’ సెన్సార్ ప్రక్రియలో మరోసారి జాప్యం జరిగింది. వాస్తవానికి ఈ సినిమాకు సంబంధించిన ప్రత్యేక సెన్సార్ స్క్రీనింగ్ ఈరోజే జరగాల్సి ఉండగా, అనివార్య కారణాల వల్ల ఇది వాయిదా పడింది. తాజా సమాచారం ప్రకారం, సెన్సార్ బోర్డు సభ్యులలో ఒకరు హఠాత్తుగా అనారోగ్యానికి గురికావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీనితో చిత్ర యూనిట్ మరియు అభిమానులు మరికొన్ని రోజులు నిరీక్షించక తప్పని పరిస్థితి నెలకొంది. అయితే ఈ సినిమా గత ఏడాది విడుదల కావాల్సి ఉంది. విజయ్ చివరి సినిమా కావడంతో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. కేవీఎన్ ప్రొడక్షన్ కంపెనీ. ఇప్పటికే పలు మార్లు ఈ సినిమా విడుదల అవుతుందని వార్తలు వచ్పినా మూవీ టీం నుంచి ఎటువంటి క్లారిటీ రాలేదు.

Read als0-Hamsa Nandini: నా జీవితాన్ని మళ్లీ నిర్మించుకున్నా.. 16 సైకిళ్ళ కీమో థెరపీపై నటి ఎమోషనల్!

Advertisement

ఈ స్క్రీనింగ్‌ను ఇప్పుడు మార్చి 17వ తేదీకి రీషెడ్యూల్ చేశారు. గత కొంతకాలంగా ఈ సినిమా సెన్సార్ విషయంలో పలు వివాదాలు నడుస్తున్న సంగతి తెలిసిందే. రివైజింగ్ కమిటీ సభ్యులు సినిమాను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే తుది సర్టిఫికేట్‌ను జారీ చేయనున్నారు. రాజకీయ నేపథ్యం ఉన్న చిత్రం కావడంతో, సెన్సార్ బోర్డు సూచించే కట్స్ లేదా మార్పులు సినిమా విడుదలపై ఎలాంటి ప్రభావం చూపుతాయో అన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. ప్రస్తుతానికి మార్చి 17న జరిగే స్క్రీనింగ్ తర్వాతే పూర్తి స్పష్టత రానుంది. మార్చి 17 తర్వాత విజయ్ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న అభిమానులకు గుడ్ న్యూస్ వచ్చే అవకాశం ఉంది.

Read also-Film industry: రోజుకు 15 కోట్ల రెమ్యూనరేషన్.. ఇండియన్ సినీ హిస్టరీలో సరికొత్త రికార్డు!

Advertisement

ఈ వాయిదా కారణంగా సినిమా విడుదల తేదీలో కూడా స్వల్ప మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది. ఏప్రిల్ నెలాఖరులో లేదా మే మొదటి వారంలో సినిమాను థియేటర్లలోకి తీసుకురావాలని నిర్మాతలు భావిస్తున్నారు. హెచ్. వినోద్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ భారీ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతాన్ని అందిస్తున్నారు. విజయ్ కెరీర్‌లో ఇది చివరి సినిమా కావడంతో, అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తయిన వెంటనే చిత్ర బృందం అధికారిక విడుదల తేదీని ప్రకటించనుంది. ఈ సినిమా విడుదల కోసం విజయ్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సెన్సార్ మాత్రం ఈ సినిమా విడదులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వుడం లేదు. మరి మార్చి 17 తర్వాత ఏం జరుగుతుందో చూడాలి మరి. ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్ల కోసం నిర్మాతలు భరీ గా ఖర్చు పెట్టారు.

Related News

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

Big Stories

Advertisement
×