Vikramarkudu Child Artist : విక్రమార్కుడు (Vikramarkudu) సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసిన రవి రాథోడ్ అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు గుర్తు పడుతున్నారు. అయితే ఈ సినిమా ద్వారా చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంతో ఫేమస్ అయిన రవి రాథోడ్ సినిమాలు చేస్తున్నప్పుడే పేరెంట్స్ ని కోల్పోవడంతో ఈ విషయం తెలుసుకున్న రాఘవ లారెన్స్ దగ్గరికి తీసి ట్రస్టులో ఉంచి చదివించారు. కానీ అందులో నుండి తప్పించుకొని బయటపడి చాలా సంవత్సరాల తర్వాత కనిపించాడు రవి. దీంతో చాలామంది యూట్యూబర్లు రవి రాథోడ్ ని ఇంటర్వ్యూలు చేశారు.ఇక ఈ ఇంటర్వ్యూలు వైరల్ అవ్వడంతో రాఘవ లారెన్స్ రవి రాథోడ్ ని ఉద్దేశించి మళ్లీ ఒకసారి రారా.. నిన్ను కొట్టను తిట్టను అంటూ ఎమోషనల్ ట్వీట్ చేశారు. అయితే ఈ ట్వీట్ చేయడంతో రవి రాథోడ్ ని ఇంటర్వ్యూ చేసిన ఒక లేడీ యాంకర్ లారెన్స్ దగ్గరకి నేరుగా వెళ్లేలా చేసింది. అయితే రాఘవ లారెన్స్ (Raghava Lawrence) ని కలిసాక రవి రాథోడ్ పరిస్థితి ఏంటి అని తెలుసుకోవడానికి మళ్ళీ ఆ యాంకర్ రవి రాథోడ్ ఉండే ప్లేస్ కి వెళ్ళింది.ఇక అక్కడికి వెళ్లి ఎన్నో ప్రశ్నలు అడిగి తెలుసుకుంది.
తాగుబోతులకు నేను సహాయం చేయను – రాఘవ లారెన్స్..
అయితే రవి రాథోడ్ చిన్నప్పటినుండి ఫుడ్ సరిగ్గా తినకపోవడం, ఎక్కువగా మద్యపానానికి బానిసవ్వడంతో నడవలేని స్థితిలో ఉన్నాడు.ఈ పరిస్థితి చూసి చలించిపోయిన రాఘవ లారెన్స్ తన టీం కి చెప్పి ఆయనకు చికిత్స చేయించారట.ఈ విషయం గురించి రవి రాథోడ్ (Ravi Rathod) మాట్లాడుతూ.. “రాఘవ అన్నని కలవడంతోనే చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. ప్రేమగా మాట్లాడారు. నాకు అన్ని టెస్టులు చేయించి టాబ్లెట్లు ఇప్పించారు. తాగుబోతులకు నేను సహాయం చేయను. కానీ నిన్ను చిన్నప్పుడు పెంచాను కాబట్టి సపోర్ట్ చేస్తున్నాను.ఇప్పటినుండి తాగకూడదు అని మాట తీసుకున్నారు” అంటూ చెప్పుకోచ్చారు.
రవి రాథోడ్ కి డబ్బు సహాయం కూడా చేసిన రాఘవా లారెన్స్..
మరి డబ్బు సహాయం ఏమైనా చేశారా అని యాంకర్ అడగగా..అలాంటిదేమీ లేదు అని చెప్పారు. కానీ యాంకర్ గట్టిగా అడగడంతో ఇచ్చారని అసలు విషయం బయట పెట్టారు. అలాగే నన్ను చెన్నైకి నా ఫ్రెండ్స్ తీసుకెళ్లారని, 10 రోజులకు సరిపడా మందులు ఇచ్చారని, ఇప్పటి నుండి తాగనని మాట ఇచ్చానని, రాఘవ అన్నకు మాట ఇచ్చినప్పటి నుండి ఇప్పటివరకు ఒక్క చుక్క మందు కూడా ముట్టలేదని, ఒకవేళ తాగితే డైరెక్ట్ గా నువ్వు దేవుడి దగ్గరికే వెళ్ళిపోతావని డాక్టర్ నాకు వార్నింగ్ ఇచ్చారు. అలాగే డాక్టర్ ఇచ్చిన టాబ్లెట్లు చాలా పవర్ ఫుల్ గా ఉన్నాయి. ఒకప్పుడు మందు తాగకపోతే ఉండేవాడిని కాదు.బాడీ మొత్తం వణికి పోయేది.కానీ ప్రస్తుతం ఈ టాబ్లెట్లు వేసుకున్నాక అంతా సెట్ అయింది. ఇప్పుడు సపోర్ట్ ఉంటే కాస్త నడవగలుగుతున్నాను అంటూ తన ఆరోగ్యం గురించి చెప్పుకొచ్చారు రవి రాథోడ్..
మద్యానికి బానిసవ్వడం వల్లే ఇలాంటి పరిస్థితి..
ఇక రాఘవ లారెన్స్ దగ్గరికి తీసుకు వెళ్లిన రవి రాథోడ్ ఫ్రెండ్ మాట్లాడుతూ..రవి రాథోడ్ ఎక్కువగా మద్యానికి అలవాటు పడి, ఫుడ్ సరిగ్గా తినకపోవడం వల్లే ఈ పరిస్థితికి వచ్చాడని, టెస్టులు చేయగా కిడ్నీలలో రాళ్లు ఉన్నాయని, అందుకే సరిగ్గా నడవలేకపోతున్నారని డాక్టర్ చెప్పారు అంటూ చెప్పుకొచ్చారు. ఇక రవి రాథోడ్ పరిస్థితిని చూసిన యాంకర్ మళ్లీ ఎప్పటికీ తాగకూడదని లారెన్స్ గారికి ఇచ్చిన మాటని నిలబెట్టుకోవాలని, డబ్బులను దుర్వినియోగం చేయకుండా ఉండాలని చెప్పింది.ఇక యాంకర్ రవి రాథోడ్ ని ఇంటర్వ్యూ చేయడంతో చాలామంది నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. రవి రాథోడ్ ని ఇంటర్వ్యూ చేయడం వల్ల ఆయన మళ్లీ బయట సమాజానికి పరిచయమయ్యాడు. ఈ దెబ్బతో ఆయనకు మళ్ళీ సినిమాల్లో అవకాశాలు వచ్చి లైఫ్ సెట్ అవ్వాలని కోరుకుంటున్నాం అంటూ కామెంట్లు పెడుతున్నారు. మొత్తానికైతే తాగుబోతులకు సహాయం చేయను అని చెప్పిన రాఘవ లారెన్స్ రవిరాథోడ్ ను చిన్నప్పటినుంచి చూసారు కాబట్టి అతడికి సహాయాన్ని చేసి మాట నిలబెట్టుకుంటున్నారని చెప్పవచ్చు.
ALSO READ:R.Madhavan: భాషా వివాదంలో వేలు పెట్టిన మాధవన్… అందుకే ఇబ్బందులు అంటూ కామెంట్!