BigTV English

Tollywood Hero : రెమ్యూనరేషన్ తీసుకోకుండా సినిమాలు చెయ్యబోతున్న స్టార్ హీరో.. ఏం జరిగింది..?

Tollywood Hero : రెమ్యూనరేషన్ తీసుకోకుండా సినిమాలు చెయ్యబోతున్న స్టార్ హీరో.. ఏం జరిగింది..?

Tollywood Hero : ఈమధ్య ఇండస్ట్రీలో స్టార్ హీరోల సినిమాలు భార్య అంచనాలతో థియేటర్లలోకి వచ్చినా కూడా అవి బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా మారుతున్నాయి. గత కొన్నేళ్లుగా కొందరు హీరోల పరిస్థితి మరి దారుణంగా ఉంది. ఎలాంటి స్టోరీ తో ప్రేక్షకులను పలకరించినా కూడా ఎక్కడో ఒకచోట తేడా కొట్టడంతో ఆ సినిమా ఫ్లాప్ అవుతుంది. ఇటీవల ఎంతోమంది స్టార్ హీరోలు సినిమాలు వచ్చిన కొద్దిరోజులకే థియేటర్లనుంచి బయటకు వచ్చేస్తున్నాయి. ఇదిలా ఉండగా కొందరు స్టార్ హీరోలు మాత్రం సినిమాలకు రెమ్యూనరేషన్ తీసుకోకుండా వచ్చిన లాభాల్లో వాటాలను తీసుకుంటున్నారు. అయితే ఇప్పుడు ఓ హీరో మాత్రం సినిమాకు రెమ్యూనరేషన్ తీసుకొనని అంటున్నాడు. హీరో ఆ నిర్ణయం తీసుకోవడానికి గల కారణాలేంటో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం..


‘ఎల్లమ్మ’ మూవీ కోసం నితిన్ షాకింగ్ నిర్ణయం..?

టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ ఈమధ్య బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. అయితే భీష్మ తర్వాత ఆయన ఖాతాలో బ్లాక్ బస్టర్ హిట్టు పడలేదు. ఏడాది రెండు సినిమాలతో ప్రేక్షకులను పలకరించాడు.. రాబిన్ హుడ్ ముందుగా థియేటర్లలో రిలీజ్ అయింది. బాక్స్ ఆఫీస్ వద్ద యావరేజ్ టాక్ ని సొంతం చేసుకోవడంతో పెద్దగా ఆడలేదు. నిన్న వచ్చిన తమ్ముడు సినిమా కూడా నితిన్ కు నిరాశనే మిగిల్చింది. భారీ అంచనాలతో రిలీజ్ అయిన ఈ మూవీ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద ఘోరంగా డీలా పడింది. ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కింది. థియేటర్లలోకి వచ్చిన తర్వాత దారుణంగా బోల్తా కొట్టడంతో నితిన్ తర్వాత సినిమా కోసం షాకింగ్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.


ప్రస్తుతం నితిన్ బలగం డైరెక్టర్ వేణుతో ఎల్లమ్మ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. దిల్ రాజు ప్రొడక్షన్ లోనే చేయబోతున్నాడు. ఇంకా షూటింగ్ ని మొదలు పెట్టుకోని ఈ సినిమాకు నితిన్ ఎలాంటి అడ్వాన్స్ ఇవ్వొద్దు అని దిల్ రాజు కి చెప్పాడట. సినిమా హిట్ అయ్యి లాభాలు వచ్చినప్పుడే తీసుకుంటానని అన్నాడట.. ఒక్క దిల్ రాజుతో మాత్రమే కాదు. తదుపరి సినిమాలకు కూడా ఇదే కొనసాగించే అవకాశం ఉన్నట్లు నితిన్ సన్నిహిత వర్గాల్లో టాక్. మరి ఎల్లమ్మ సినిమా నితిన్ ని గట్టెక్కిస్తుందేమో చూడాలి..

నితిన్ కు లక్ కలిసి రాలేదా..?

ఎన్టీఆర్ తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్, రాజమౌళి లతో సినిమాలు చేసిన ఏకైక హీరో ఇతనే. అలా అంత మంది స్టార్ డైరెక్టర్స్ తో సినిమాలు చేసినా ఇతను స్టార్ కాలేకపోయాడు.. ఒక్క హిట్ సినిమా పడితే ఆ తర్వాత వచ్చిన నాలుగైదు సినిమాలు డిజాస్టర్ గా మిగలడం నితిన్ బ్యాడ్ లక్ అని చెప్పాలి. భీష్మ తర్వాత వచ్చిన సినిమాలు పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. ఒకప్పుడు నిత్యనుంచి సినిమా వస్తుందంటే కచ్చితంగా బాక్సాఫీస్ బద్దలు కొట్టేలా ఉంటుందని ఆయన అభిమానులు అభిప్రాయంతో ఉండేవారు. కానీ ఈ మధ్య మాత్రం ఆ అభిప్రాయం మారిందని తెలుస్తుంది. గత కొన్నేళ్లుగా సరైన హిట్ సినిమా లేకపోవడంతో ఆయన అభిమానులు నిరాశను వ్యక్తం చేస్తున్నారు. నితిన్ కు లక్ కలిసి రావడం లేదు. ఒక్క హిట్ సినిమా పడితే మళ్లీ కెరియర్ ట్రాక్ లోకి పడుతుంది అని సోషల్ మీడియాలో పోస్ట్లు పెడుతున్నారు. మరి నితిన్ కు ఎల్లమ్మ సినిమా ఎలాంటి రిజల్ట్ ని ఇస్తుందో చూడాలి.. ఇది ఏమైనా కూడా ఈ సినిమా నితిన్ కు లైఫ్ అండ్ డేత్ లా ఉంది.. ఇది హిట్ అయితే మాత్రమే నితిన్ తర్వాత కెరీర్ ఉంటుందని ఇప్పటికే ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి…

Related News

Sobhita: షూటింగ్ లొకేషన్ లో వంట చేసిన శోభిత.. చైతూ రియాక్షన్ ఇదే!

Lokesh Kangaraj: చేసింది 6 సినిమాలే..22 మంది హీరోలను డైరెక్ట్ చేశా.. గర్వంగా ఉందంటూ!

OG Glimpse: ఎందయ్యా సుజీత్ బర్త్ డే హీరోదా…విలన్ దా ఆ గ్లింప్స్ ఏంటయ్యా?

Madharasi Censor Report: మదరాసి సెన్సార్‌ పూర్తి.. ఆ సీన్స్‌పై బోర్డు అభ్యంతరం, మొత్తం నిడివి ఎంతంటే

Ghaati Censor Report: అనుష్క ‘ఘాటీ’కి సెన్సార్‌ కట్స్.. ఆ సీన్లపై కోత.. మొత్తం మూవీ నిడివి ఎంతంటే!

Anushka Shetty: డాక్యుమెంటరీగా బాహుబలి.. కన్ఫర్మ్ చేసిన స్వీటీ!

Big Stories

×