E-Paper
Advertisement

Virosh Wedding: దేశవ్యాప్తంగా విరోష్ వెడ్డింగ్ వేడుకలు.. ఈ నగరాల్లో అన్నదానాలు, స్వీట్ల పంపకం

Virosh Wedding: దేశవ్యాప్తంగా విరోష్ వెడ్డింగ్ వేడుకలు.. ఈ నగరాల్లో అన్నదానాలు, స్వీట్ల పంపకం
Advertisement

Virosh Wedding: టాలీవుడ్ స్టార్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న తమ వివాహ బంధాన్ని అత్యంత వైభవంగా, అర్థవంతంగా జరుపుకుంటున్నారు. తమ జీవితంలోని ఈ మధురమైన ఘట్టాన్ని దేశప్రజలందరితో పంచుకోవాలనే ఉద్దేశంతో, మార్చి 1వ తేదీన దేశవ్యాప్తంగా మిఠాయిలతో నిండిన ట్రక్కులను పంపుతున్నట్లు ఈ జంట ప్రకటించింది. ‘భారతదేశం ఏదైనా వేడుకను మిఠాయిలు, ఆహారంతోనే కదా సెలబ్రేట్ చేసుకుంటుంది’ అంటూ విజయ్, రష్మికలు తమ సంతోషాన్ని అందరికీ పంచుతూ అందరి ఆశీస్సులు కోరుతున్నారు. ఈ వేడుకల్లో భాగంగా కేవలం మిఠాయిల పంపిణీ మాత్రమే కాకుండా, దేశవ్యాప్తంగా ఉన్న 16 ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రాలలో భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఆ వివరాలను తెలుపుతూ వారు చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఆ వివరాల్లోకి వెళితే..

Also Read- Manchu Vishnu: యుద్ధంలో చిక్కుకున్న మంచు విష్ణు ఫ్యామిలీ.. తలపైనే వెళ్తున్న క్షిపణి!

16 రాష్ట్రాలలోని ప్రముఖ ఆలయాల్లో

Advertisement

తెలంగాణ, హైదరాబాద్‌లోని హరే కృష్ణ హెరిటేజ్ టెంపుల్, మహబూబ్‌నగర్‌లోని మాన్యంకొండ శ్రీ లక్ష్మి వెంకటేశ్వర స్వామి ఆలయం, చింతపల్లి సాయిబాబా ఆలయాల్లో అన్నదానం జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం, వైజాగ్ శ్రీ కనక మహాలక్ష్మి ఆలయం, ద్వారకా తిరుమల (చిన్న తిరుపతి) ఆలయాల్లో భక్తులకు ప్రసాద వితరణ చేయనున్నారు. కర్ణాటక బెంగళూరులోని శివోహం టెంపుల్, ఉత్తరప్రదేశ్ బృందావనంలోని శ్రీ శ్రీకృష్ణ బలరామ్ మందిర్, అస్సాం గౌహతిలోని శ్రీ రుక్మిణి టెంపుల్.. ఇలా మొత్తంగా 16 రాష్ట్రాలలోని ప్రముఖ ఆలయాల్లో ఈ సేవా కార్యక్రమాలు కొనసాగనున్నాయని తెలిపారు.

Also Read- Sravanthi Chokkarapu: అనసూయ వెళ్లిపోవడమే ప్లస్ అయ్యిందా? అసలు విషయం బయటపెట్టిన యాంకర్ స్రవంతి చొక్కారపు

ఉత్తరాది నుంచి దక్షిణాది వరకు మిఠాయిల పంపిణీ

Advertisement

ఇక మిఠాయిల పంపిణీ విషయానికి వస్తే, ఉత్తరాది నుంచి దక్షిణాది వరకు అన్ని ప్రధాన నగరాలను కవర్ చేస్తున్నారు. తెలంగాణలో హైదరాబాద్, మహబూబ్‌నగర్, కరీంనగర్.. ఏపీలో వైజాగ్, విజయవాడ, పుట్టపర్తిలతో పాటు ఢిల్లీ, ముంబై, అహ్మదాబాద్, చెన్నై, కొచ్చి, జైపూర్ వంటి నగరాల్లో స్వీట్లు పంచుతున్నారు. అయితే బీహార్‌లో మాత్రం ఒక రైలు ప్రమాదం కారణంగా ఏర్పడిన ఆలస్యం వల్ల, అక్కడ సోమవారం నాడు పంపిణీ చేయనున్నట్లు స్పష్టం చేశారు. తమ పెళ్లి సందర్భంగా ఇలా సమాజానికి మేలు చేసే కార్యక్రమాలు చేపట్టిన ఈ జంటపై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ‘విరోష్’ వెడ్డింగ్ విషయానికి వస్తే.. ‘గీత గోవిందం’ సినిమాలో కలిసి నటించిన ఈ జంట, అప్పటి నుంచి ప్రేమించుకుంటూ.. ఇప్పుడు ఇరు కుటుంబాల పెద్దలను ఒప్పించి, రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఫిబ్రవరి 26న అతి కొద్ది మంది సమక్షంలో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.

Also Read- Sankranthi movies 2027: హీటెక్కిస్తున్న 2027 సంక్రాంతి సినిమాల టైటిల్స్..ఒక్కొక్కటి ఒక్కో డైమండ్!

Related News

హైదరాబాద్‌లో ‘వైఫ్ ఎక్స్ఛేంజ్’ కల్చర్ ఉందంటూ హీరోయిన్ మాధవీలత సంచలన వ్యాఖ్యలు!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

కన్నీటి పర్యంతమవుతున్న ‘మహారాజ’ బ్యూటీ.. అసలేం జరిగిందంటే?

డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ వివాదం..ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం!

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

Big Stories

Advertisement
×