E-Paper
Advertisement

విష్ణుప్రియ బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్ వెనక అసలు కష్టం ఇదే!

విష్ణుప్రియ బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్ వెనక అసలు కష్టం ఇదే!
Advertisement

Vishnu Priya Diet:కెరీర్ మొదట్లో అరకొరా సినిమాలు , షార్ట్ ఫిలిమ్స్ చేసుకుపోయిన విష్ణు ప్రియ టీవీ షోలతో ఒక్కసారిగా సాలిడ్ క్రేజ్ కొట్టేసింది.ముఖ్యంగా సుడిగాలి సుధీర్ తో చేసిన పోరాపోవే టీవీ షోతో లైమ్ లైట్ లోకి వచ్చేసింది.ఇక అప్పటి నుండి అనేక షోలలో యాంకర్ గా , ఎన్నో ప్రోగ్రామ్స్ లలో పార్టిసిపేట్ చేసిన విష్ణు ప్రియ మళ్ళీ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చేస్తుంది.

ఈ క్రమంలోనే అల్లరి నరేష్ హీరోగా నటిస్తున్న ‘రంభ ఊర్వశి మేనక’లో ఊర్వశి పాత్ర పోషించి మరో సారి ఆడియన్స్ ని అలరించడానికి రెడీ అయిపొయింది.ఇక ఈ సినిమా సెప్టెంబర్ 4న థియేటర్లలో విడుదల కాబోతున్న సందర్బంగా ప్రమోషన్స్ లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని పలు ఆసక్తికరమైన విషయాలని పంచుకుంది విష్ణుప్రియ.

ఏకంగా 40 రోజుల పాటు

Advertisement

విష్ణుప్రియ మాట్లాడుతూ ఈ సినిమాలో ఊర్వశి పాత్ర కోసం నన్ను అప్రోచ్ అయ్యారని,అయితే ఈ క్యారెక్టర్ కి తగ్గట్టుగా తాను ఫిట్ గా లేనని,అందుకోసం బాడీని బాగా ట్రాన్స్ ఫామ్ చేయాల్సి వచ్చిందని చెప్పుకొచ్చింది. ముఖ్యంగా సినిమా కోసమే ఏకంగా 40 రోజుల పాటు డైట్ చేస్తూ వర్కౌట్స్ చేశానని ఆ కష్టమే ఇపుడు తెరమీద కనిపిస్తుందని అసలు విషయం చెప్పుకొచ్చింది.

ముఖ్యంగా సినిమా కోసం ఏంటో ఇష్టమైన ఫుడ్ ని కంట్రోల్ చేస్తూ బాడీని తిరిగి గాడిన పెట్టడానికి దాదాపు 40 రోజుల పాటు ఎంత కష్టపడ్డానో తనకే తెలుసని వాపోయింది.షూట్ లో యాక్షన్ అని చెప్పే ప్రతీసారి విష్ణు ప్రియా…. పొట్ట లోపలికి అను అంటూ ఎన్నో సార్లు అరిచాడంటూ సరదాగా నవ్వులు పూయించింది.

Advertisement

ఇక ఈ సినిమాలో తనతో కలిసి నటించిన రాశి సింగ్, ప్రిషా సింగ్ ల గూర్చి కూడా తన అభిప్రాయాన్ని తెలిపింది.మిగతా ఇద్దరు కూడా రంభ, మేనక పాత్రల్లో అద్భుతంగా నటించారని, ముఖ్యంగా ఈ సినిమాలలో వాళ్ళు పోషించిన ఆమాయక పాత్రలని చూస్తుంటే వారు మరింత క్యూట్ గా కనిపిస్తారని తెలిపింది.

ఎంత కష్టం వచ్చిందంటూ

ఇక విష్ణు ప్రియ చెప్పిన మాటలకి ‘నువ్విలాగే స్లిమ్ గా ఉంటూ సినిమాలు చేయాలి,మమ్మల్ని ఎంటర్ టైన్ చేయాలంటూ సపోర్ట్ చేస్తూ కామెంట్స్ పెడుతుంటే, మరికొంతమంది మా విషు ఏకంగా నలబై రోజుల పాటు డైట్ కంట్రోల్ చేసిందంటే ఎంత కష్టం వచ్చిందంటూ విష్ణు ప్రియపై ప్రేమని ఒలకబోసేస్తున్నారు.

ఇక విష్ణు ప్రియ విషయానికి వస్తే రీసెంట్ గా ఇంస్టా సబ్ క్రిప్షన్ పేరిట ఫాలోవర్స్ నుండి భారీ సంఖ్యలో డబ్బులు వసూలు చేస్తుందంటూ మీడియాలో వార్తలు తెగ చక్కర్లు కొట్టిన సంగతి తెలిసిందే.

నరేష్ కి ఎలాంటి ఫలితాన్ని అందిస్తుందో !

ఇక ‘రంభ ఊర్వశి మేనక’ సినిమా విషయానికి వస్తే ఇది పాంటసీ బ్యాక్ డ్రాప్ లో ,రూరల్ విలేజ్ డ్రామాని మిక్స్ చేసి సరికొత్తగా రానుందని తెలుస్తుంది.రంభ ఊర్వశి మేనక లు అనుకోకుండా భూలోకానికి వచ్చి ఇక్కడే అల్లరి నరేష్ ఇంట్లో ఉండిపోవడం వల్ల జరిగే ఎంటర్ టైనింగ్ స్టోరీని ట్రైలర్ చూస్తేనే అర్థం అవుతుంది.

మొత్తానికి నాంది, బచ్చల మల్లి, ఉగ్రం అంటూ సీరియస్ సినిమాలవైపు మళ్ళిన అల్లరి నరేష్ మళ్ళీ కామెడీ బాట పట్టడంతో ఈ సినిమా ఇక హిట్టే అంటూ మురిసిపోతున్నారు నరేష్ ఫ్యాన్స్. చూడాలి మరి రాజేష్ దండ నిర్మాణంలో చింతాడ చంద్ర మోహన్ దర్శకత్వంలో సెప్టెంబర్ 4న  రానున్న  ఈ సినిమా నరేష్ కి ఎలాంటి ఫలితాన్ని అందిస్తుందో !

Tags

Related News

థియేటర్లలో భజనలు..బయటి నుంచి కుర్చీలు! ‘ఇరుముడి’ వీడియో వైరల్!

‘టాక్సిక్’లో ఎవరి రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా? లెక్క చూస్తే మైండ్ బ్లాక్!

ఇరుముడి దెబ్బకి బాక్సాఫీస్ షేక్.. టాప్-5లోకి ఎంట్రీ!

అల్లు అర్జున్ ఖాతాలో అరుదైన ఘనత!

దసరా బరిలో ‘రణబాలి’.. రిలీజ్ డేట్ లాక్!

మళ్లీ సంక్రాంతికి సిద్ధమవుతున్న తెలుగమ్మాయి.. సక్సెస్ అవుతుందా?

నాగ్ బర్త్ డే ట్రీట్ లోడింగ్.. ఫ్యాన్స్ కు పునకాలే..!

Big Stories

Advertisement
×