E-Paper
Advertisement

నేపాల్ జల ప్రళయం.. 288 మంది భారతీయులు మిస్సింగ్.. 21 మంది సురక్షితమన్న కేంద్రం

నేపాల్ జల ప్రళయం.. 288 మంది భారతీయులు మిస్సింగ్.. 21 మంది సురక్షితమన్న కేంద్రం
Advertisement

Nepal Floods: నేపాల్ అకస్మిక వరదల్లో 200 మందికి పైగా భారతీయుల ఆచూకి మిస్ అయిన సంగతి తెలిసిందే. దీనిపై కేంద్ర మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పందించారు. రసూవా జిల్లాలో మెుత్తం 288 మంది భారతీయుల ఆచూకి తెలియరాలేదన్న ఆయన.. మరో 21 మందిని మాత్రం గుర్తించి సురక్షితంగా కాపాడినట్లు తెలిపారు. గల్లంతైన వారితో పాటు బాధితుల యోగ క్షేమాల కోసం నేపాల్ ప్రభుత్వంతో నిరంతరం చర్చలు జరుపుతున్నట్లు పేర్కొన్నారు.

‘ఫోన్ కలవకపోతే టెన్షన్ వద్దు’

ఫ్లాష్ ఫ్లడ్స్ కారణంగా రసువా ప్రాంతంలో కమ్యూనికేషన్ వ్యవస్థ పూర్తిగా దెబ్బతిందని రణధీర్ అన్నారు. ఫోన్ లైన్లు, ఇంటర్నెట్ సేవలు నిలిచిపోవడంతో క్షేత్రస్థాయిలో ఉన్న ప్రజలతో మాట్లాడటం సాధ్యపడటం లేదన్నారు. కాబట్టి నేపాల్ పర్యటనకు వెళ్లిన తమవారి ఫోన్లు కలవనంత మాత్రాన వారు ప్రమాదంలో ఉన్నట్లు కాదని స్పష్టం చేశారు.

73 మంది విద్యుత్ కార్మికులు

Advertisement

ఇదిలా ఉంటే అందుబాటులోకి రాని 288 మంది భారతీయులలో త్రిశూలి-1 విద్యుత్ ప్రాజెక్టులో పనిచేస్తున్న 73 మంది కార్మికులు ఉన్నారు. కాట్మాండ్ లోని భారత రాయబార కార్యాలయం ఈ ప్రాజెక్టు అధిపతులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతోంది. వీరితో పాటు కైలాస మానససరోవర్ యాత్రకు వెళ్లిన భక్తులు, నేపాల్ పర్యటనకు వెళ్లిన పర్యాటకులు కూడా మిస్ అయినవారిలో ఉన్నారు.

రాష్ట్రాల వారీగా చూస్తే..

తమిళనాడుకు చెందిన ‘సామ్రాట్ ట్రావెల్స్’, ‘ఫ్లై ఎవరెస్ట్ ట్రావెల్స్’ ద్వారా వెళ్లిన 37, 49 మందితో కూడిన రెండు బృందాల ఆచూకి మిస్ అయ్యింది. అలాగే బెంగాల్ నుంచి సామ్రాట్ ట్రావెల్స్ ద్వారా వెళ్లిన 32 మంది, రిచా టూర్స్ ద్వారా వివిధ రాష్ట్రాల నుంచి వెళ్లిన 61 మంది ఆచూకి తెలియరాలేదు. అలాగే కేరళకు చెందిన మరో 33 మంది పౌరులు మిస్ అయ్యారు.

Advertisement

Also Read: 1871లో మనుషుల్లేని ద్వీపంలోకి 5 ఆవులు.. 137 ఏళ్ల తర్వాత అక్కడ ఉన్నది చూసి.. శాస్త్రవేత్తలే షాక్!

నేపాల్ ప్రధానితో మాట్లాడిన మోదీ

మరోవైపు విషాదకర ఘటనపై భారత ప్రధాని నరేంద్ర మోదీ నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీతో టెలిఫోన్లో మాట్లాడారు. ఈ కష్టసమయంలో నేపాల్ ప్రజలకు భారత ప్రభుత్వం తరఫున సానుభూతి తెలిపారు. ప్రమాద తీవ్రతను ఎదుర్కొనేందుకు, సహాయక చర్యలు చేపట్టేందుకు భారతదేశం నుంచి కావలసిన అన్ని రకాల సహాయాన్ని అందిస్తామని ప్రధాని హామీ ఇచ్చారు.

Also Read: నడవలేము మహాప్రభో.. ప్రపంచ ‘బద్దకస్తుల’ జాబితాలో.. భారత్ స్థానం ఎంతంటే?

Tags

Related News

రైల్వే ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం.. దసరాకి బోనస్..?

‘బ్లూ డ్రమ్’ కేసులో సంచలన తీర్పు.. భర్తను చంపిన భార్య, ఆమె ప్రియుడికి మరణ శిక్ష ఖరారు!

పొయ్యిలో 20కి పైగా పాములు.. ఏకంగా పిల్లలతో కాపురం పెట్టేసిందిగా? ధైర్యం ఉంటేనే చూడండి

ప్రేమకు అడ్డొచ్చిందని.. కంటికి రెప్పలా చూసిన నానమ్మనే హత్య చేసిన మనుమరాలు!

గోల్డ్ షాపు ఓపెనింగ్‌కు ముందే బిగ్ షాక్.. 12 నిమిషాల్లో రూ.8 కోట్ల బంగారం చోరీ..!

భారతీయ పైలట్‌పై దాడి.. విచారణ ముమ్మరం చేసిన ఎన్ఐఏ.. యూఏఈకి ప్రత్యేక బృందం!

గంగానదిలో పడవ బోల్తా.. మహిళలు-పిల్లలతో సహా 14 మంది మృతి, బీహార్‌లో ఘటన

ఢిల్లీ నిరసనలను అడ్డంపెట్టుకుని పాక్ డ్రామాలు.. 200లకు పైగా ఫేక్ పోస్టులు డిలీట్!

Big Stories

Advertisement
×