Vishwambhara :మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi), బింబిసారా ఫేమ్ డైరెక్టర్ వశిష్ట(Vasishta) కాంబినేషన్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన సినిమా విశ్వంభర(Vishwambhara).. సోషియో ఫాంటసీ సినిమాగా వస్తున్న విశ్వంభర మూవీ ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని, విడుదలకు కూడా సిద్ధమైంది. కానీ సడన్గా ఈ సినిమా విడుదలయ్యే సమయానికి చిరంజీవి వారసుడు రామ్ చరణ్ (Ram Charan) గేమ్ ఛేంజర్(Game Changer) రిలీజ్ ఉండడంతో కొడుకు కోసం వెనక్కి తగ్గి సంక్రాంతి బరిలో నిలవాలనుకున్న విశ్వంభర సినిమాని వాయిదా వేసుకున్నారు. అలా విశ్వంభర వాయిదా పడింది. అయితే సంక్రాంతికి విడుదలవ్వాల్సిన ఈ సినిమా మళ్లీ సంక్రాంతి వచ్చేవరకు ఎందుకు వెయిట్ చేస్తున్నారనే డౌట్ అందరికీ రావచ్చు.. చాలామంది సినిమాలో గ్రాఫిక్స్ బాలేవని, అందుకే మళ్ళీ సినిమాని రీ షూట్ చేస్తున్నారని అంటుంటే.. ఇంకొంతమందేమో డైరెక్షన్ బాలేదని ఇలా కథలు కథలుగా మాట్లాడుకుంటున్నారు.
స్పెషల్ సాంగ్ కోసం రంగంలోకి భీమ్స్ సిసిరోలియో..
కానీ అసలు విషయం ఏమిటంటే.. విశ్వంభర (Vishwambhara) మూవీ షూటింగ్ పూర్తయిన సంగతి నిజమే. కానీ ఆ సినిమాలో కంప్యూటర్ గ్రాఫిక్స్ ఆలస్యం అవ్వడం కారణంగా సినిమాని వాయిదా వేసినట్టు తెలుస్తోంది.. అయితే ఈ సినిమాలో చిరంజీవి, మౌనీ రాయ్(Mouni Rai) మధ్య ఒక స్పెషల్ సాంగ్ పెడుతున్నట్టు వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. ఇక ఈ స్పెషల్ సాంగ్ కోసం కీరవాణి (Keeravani)ని పక్కన పెట్టి భీమ్స్ సిసిరోలియో (Bheems Ceciroleo)ని తీసుకున్నారట చిత్ర యూనిట్. సినిమా మొత్తానికి కీరవాణి మ్యూజిక్ అందిస్తే.. ఆ ఒక్క పాటకు మాత్రం భీమ్స్ ని ఎందుకు తీసుకున్నారనే డౌట్ అందరిలో ఉంటుంది. మరి భీమ్స్ ని ఆ పాట కోసం ఎందుకు తీసుకున్నారు..? కీరవాణి మ్యూజిక్ నచ్చలేదా? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
కీరవాణి ఉండగా భీమ్స్ ఎందుకంటే..?
విశ్వంభర మూవీలో యూత్ కోసమే చిరంజీవి – మౌనీ రాయ్ కాంబోలో ఓ ఐటెం సాంగ్ యాడ్ చేశారట. అయితే ఈ సాంగ్ కి భీమ్స్ సిసిరోలియో(Bheems Ceciroleo) మ్యూజిక్ అందించారట. దానికి కారణం కీరవాణి మ్యూజిక్ నచ్చలేదనో లేదా మరే కారణమో కాదు.కీరవాణి (Keeravani) అప్పుడు అందుబాటులో లేకపోవడం వల్ల భీమ్స్ ని ఎంచుకున్నారట. అయితే ఈ మధ్యకాలంలో భీమ్స్ మ్యూజిక్ అందించిన సినిమాలు మ్యూజికల్ గా బాగా హిట్ అవ్వడంతో ఆయనపై పూర్తి నమ్మకముంచి చిత్ర యూనిట్ స్పెషల్ సాంగ్ కోసం భీమ్స్ ని సంప్రదించినట్లు తెలుస్తోంది..
విశ్వంభర సినిమా చిరు అభిమానుల ఆకలి తీరుస్తుందా?
ఇక ఈ సాంగ్ ని సినిమా కోసం యాడ్ చేసే సమయంలో కీరవాణి హరిహర వీరమల్లు(Hari Hara Veeramallu) సినిమాకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇస్తూ బిజీగా ఉండడం కారణంగా ఆయన్ని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక భీమ్స్ ని తీసుకున్నట్టు తెలుస్తోంది. ఏది ఏమైనప్పటికీ విశ్వంభరలో వచ్చే ఐటెం సాంగ్ కి భీమ్స్ మ్యూజిక్ పెద్ద ప్లస్ అయ్యేలా కనిపిస్తోంది. మరి చూడాలి ఈ సినిమా మెగా ఫ్యాన్స్ ఆకలి తీరుస్తుందా లేదా అనేది.
also read:Prashanth Neel: ఎన్టీఆర్ మూవీకి డైరెక్టర్ భారీ డిమాండ్.. నిర్మాతలకు మిగిలేది బో**డే!