Rishabh Pant : టీమిండియా క్రికెట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. టీమిండియా ఆటగాళ్లు అద్భుతంగా ఆడుతారు. కానీ ముఖ్యంగా ప్రస్తుతం ఇంగ్లాండ్ తో జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో కాస్త తడబడ్డట్టు కనిపిస్తున్నారు. ఎందుకంటే..? తొలి టెస్ట్ లో తొలి ఇన్నింగ్స్ లో అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. కానీ రెండో ఇన్నింగ్స్ లో డీలా పడిపోయారు. రెండో ఇన్నింగ్స్ లో ఎక్సలెంట్ గా ఆడారు. మూడో ఇన్నింగ్స్ లో తక్కువ స్కోర్ ను కూడా ఛేజింగ్ చేయలేకపోయారు. ఇక నాలుగోో టెస్టు మ్యాచ్ లో తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా 358 పరుగులకు ఆలౌట్ అయింది. అయితే ఇందులో రిషబ్ పంత్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. గాయంతో మరీ టీమిండియా కోసం పోరాడి హాఫ్ సెంచరీ చేశాడు రిషబ్ పంత్.
Also Read : Suryakumar Yadav : ఆ మహిళా క్రికెటర్ తో సూర్యకుమార్ యాదవ్ ఎంజాయ్.. పడవ నడుపుతూ అతన్ని ఇమిటేట్
సెంచరీ చేసిన ఇంగ్లాండ్ బ్యాటర్
ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య మ్యాచ్ జరుగుతున్న సమయంలో రిషబ్ పంత్-శార్దూల్ ఠాకూర్ మధ్య ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. శార్దుల్ ఠాకూర్ కాళ్లు మొక్కాడు రిషబ్ పంత్. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వాస్తవానికి రిషబ్ పంత్ కాళ్లు మొక్క లేదు.. కానీ పక్కన గ్రౌండ్ ని మోకాడు. అయితే ఈ వీడియోలో మాత్రం కాళ్లు మొక్కినట్లు కనిపిస్తోంది. ఇది సోషల్ మీడియాలో వైరల్ కావడం విశేషం. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 358 పరుగులు చేసి ఆలౌట్ కాగా.. ఇంగ్లాండ్ బ్యాటర్లు మాత్రం అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నారు. నిలకడగా ఆడుతున్నారు. క్రీజులో రూట్, బెన్ స్టోక్స్ ఉన్నారు. రూట్ 179 బంతుల్లో 104 పరుగులు చేశాడు. గత మ్యాచ్ లో కూడా రూట్ సెంచరీ చేయడం విశేషం.
లీడ్ లో ఇంగ్లాండ్..
ఇంగ్లాండ్ బ్యాటర్లు భారత్ నిర్దేశించిన 359 పరుగుల లక్ష్యాన్ని అలవొకగా ఛేదించారు. 400 పరుగులు దాటాడు. ప్రస్తుతం 50 కి పైగా లీడ్ లో ఉన్నారు. ఇంగ్లాండ్ బ్యాటర్లలో ఓపెనర్లు క్రాలీ 84, డకెట్ 94 ఇద్దరూ కూడా సెంచరీ మిస్ చేసుకున్నారు. పోప్ 71, జో రూట్ సెంచరీ చేశాడు. హ్యారీ బ్రూక్ ఈసారి 3 పరుగులకే ఔట్ అయ్యాడు. కెప్టెన్ బెన్ స్టోక్స్ 27 పరుగులు చేసి క్రీజులో కొనసాగుతున్నాడు. భారత బౌలర్లలో వాషింగ్టన్ సుందర్ 2 , జడేజా 1, కంబోజ్ 1 వికెట్లు తీశారు. కీలక బౌలర్లు బుమ్రా, సిరాజ్ ఇప్పటి వరకు ఒక్క వికెట్ కూడా తీయకపోవడం గమనార్హం. ఇక టీమిండియా బ్యాటర్లలో ఓపెనర్ యశస్వి జైస్వాల్ 58, కే.ఎల్. రాహుల్ 48, సాయి సుదర్శన్ 61, కెప్టెన్ శుబ్ మన్ గిల్ 12, రిషబ్ పంత్ 54, రవీంద్ర జడేజా 20, శార్దూల్ ఠాకూర్ 41, వాషింగ్టన్ సుందర్ 27, అన్షుల్ కంబోజ్0, బుమ్రా4, సిరాజ్ 5 పరుగులు చేశారు. ఇక ఇంగ్లాండ్ బౌలర్లలో బెన్ స్టోక్స్ 5, ఆర్చర్ 3, వో క్స్ 1, లియామ్ డౌసన్ 1 వికెట్ తీశారు. దీంతో భారత బ్యాటర్లు 358 పరుగులకు ఆలౌట్ అయ్యారు. ఇంగ్లాండ్ బ్యాటర్ల బ్యాటింగ్ చూస్తుంటే 500 పరుగులకు పైగా స్కోర్ చేసేవిధంగా కనిపిస్తోంది.
From this angle, it looks like Rishabh Pant is taking blessings from Lord Thakur. 😂 pic.twitter.com/Zsv4b2jodc
— Out Of Context Cricket (@GemsOfCricket) July 25, 2025