VK Naresh: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఒకప్పుడు హీరోగా ఎన్నో సినిమాలు చేసి ప్రేక్షకులను అలరించారు వీకే నరేష్ (VK Naresh). దివంగత మహిళ దర్శకురాలు, సీనియర్ హీరోయిన్ విజయనిర్మల (Vijaya Nirmala) వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన నరేష్.. ఎన్నో చిత్రాలలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. హీరోగానే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా పాత్రలు చేస్తూ ఇప్పటికీ ఇండస్ట్రీలో చలామణి అవుతున్నారు. ఇకపోతే కెరియర్ పరంగా ఎంతో ఉన్నత స్థాయికి చేరుకున్న ఈయన.. వ్యక్తిగతంగా ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే.
అందులో భాగంగానే మూడు పెళ్లిళ్లు చేసుకుని.. ఇద్దరికీ విడాకులు ఇచ్చిన నరేష్.. ఇప్పుడు తోటి నటి పవిత్ర లోకేష్ (Pavitra Lokesh) తో గత కొన్ని సంవత్సరాలుగా సహజీవనం చేస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా వీరిద్దరి వ్యవహారం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది కూడా..ఇదిలా ఉండగా గత కొన్ని రోజులుగా వీరి గురించి ఎవరు పెద్దగా మాట్లాడుకోలేదు. కానీ మళ్ళీ ఇన్నాళ్ల తర్వాత పవిత్ర లోకేష్ పేరును ప్రస్తావిస్తూ.. తన తల్లిని నరేష్ గుర్తు చేసుకోవడం ఆశ్చర్యంగా మారింది.
అసలు విషయంలోకి వెళ్తే.. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో.. విభిన్న పాత్రలతో ప్రేక్షకులను మెప్పిస్తున్న నరేష్ తాజాగా నటించిన చిత్రం ‘బ్యూటీ’. ఈ సినిమాలో హీరోయిన్ కి తండ్రి పాత్రలో నటించారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు నరేష్. ఇంటర్వ్యూలో భాగంగా ముద్దు పేర్ల గురించి ప్రస్తావన రాగా.. నరేష్ తన తల్లిని తలుచుకొని పవిత్ర పేరును మళ్లీ తీసుకురావడం ఇక్కడ వైరల్ గా మారింది.
తల్లిని తలుచుకుంటూ అలాంటి కామెంట్స్..
నరేష్ మాట్లాడుతూ.. “మా అమ్మ నన్ను నరి అని పిలిచేది. అయితే తమిళంలో నరి అంటే నక్క. ఈ విషయం తెలిసి మా అభిమానులు నన్ను ఫాక్స్ అని పిలిచేవాళ్ళు. ముద్దొస్తే నారి అని పిలిచేది. మరీ ప్రేమ ఎక్కువైతే నారిగా అని కూడా పిలిచేది. అలాంటప్పుడు అమ్మను కాకా పట్టొచ్చు అని నాకు కూడా అర్థం అయ్యేది. ఇక నన్ను అలా ఎవరు పిలవరు. అయితే పవిత్ర లోకేష్ కూడా నన్ను చాలా గౌరవంగా పిలుస్తుంది. ముద్దు పేరు అయితే రాయా అని పిలుస్తుంది. ఒక రకంగా చెప్పాలి అంటే అది ముద్దు పేరు కాదు కానీ అలా ఆమె పిలుస్తూ ఉంటుంది” అంటూ తన తల్లిని గుర్తు చేసుకుంటూ పవిత్ర లోకేష్ తనను ఎలా పిలుస్తుంది అనే విషయాన్ని కూడా నరేష్ బయట పెట్టారు. ప్రస్తుతం నరేష్ చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
ఇంద్ర భవనం లాంటి ఇంటిని నిర్మించుకున్న నరేష్ – పవిత్ర లోకేష్
నరేష్ – పవిత్ర లోకేష్ బంధం విషయానికి వస్తే.. ఇప్పటికీ పెళ్లి చేసుకోలేదు. కానీ సహజీవనం చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు ఇటీవల ఇంద్ర భవనం లాంటి ఇంటిని తమ కోసం నిర్మించుకొని, ఆ ఇంటి గృహప్రవేశాన్ని కూడా ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పలువురు సెలబ్రిటీలు కూడా హాజరైన విషయం తెలిసిందే.
ALSO READ: ANR: అక్కినేని ‘ప్రేమాభిషేకం’ రీ రిలీజ్.. టికెట్ కొనక్కర్లేదు.. విడుదల ఎప్పుడంటే?