E-Paper
Advertisement

తెలంగాణ..రాయలసీమ.. ఉత్తరాంధ్ర..సినిమాలకి ఇదేం లెక్క? నరేష్ ఫైర్!

తెలంగాణ..రాయలసీమ.. ఉత్తరాంధ్ర..సినిమాలకి ఇదేం లెక్క? నరేష్ ఫైర్!
Advertisement

VK Naresh:నవరసరాయ నటుడు సీనియర్ విజయ కృష్ణ నరేష్ తాజాగా ‘గరివిడి లక్ష్మి’ సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో చేసిన కామెంట్స్ ఇపుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈరోజుల్లో తెలుగు ఇండస్ట్రీలో తెలంగాణ, రాయలసీమ, ఉత్తరాంధ్ర అంటూ సినిమాలకు ట్యాగ్ లు వేయడం ఒక ఫ్యాషన్ అయిపోయిందని అసలు సినిమాలకి ప్రాంతాలకి ముడిపెట్టడం ఏంటంటూ ఒక రేంజ్ లో మండి పడ్డారు.

విడగొట్టి చూడటం ఎంత వరకు కరెక్ట్

Advertisement

సినిమా అనేది ఎదో ఒక బాషకో,ప్రాంతానికో పరిమితం కాదని,సినిమాలోని కథకి ,అందులోని ఎమోషన్ కి ఎలాంటి బార్డర్స్ ఉండవంటూ తేల్చి చెప్పారు. మంచి పాటలు ఏ బాషలో వచ్చినా మనం ఎలాగైతే ఆస్వాదిస్తామో అలాగే మంచి కథతో వచ్చే సినిమాలని కూడా ఎదో భాష కే పరిమితం చేయకుండా అందరూ సినిమాని ఆస్వాదించాలని చెప్పుకొచ్చారు.

అసలే వరల్డ్ సినిమా అరచేతిలోకి వచ్చిన ఈ రోజుల్లో కొరియన్,జపనీస్ , మలయాళం, తమిళం,కన్నడ ఇలా ఆ దేశం ఈ దేశం, ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం అన్న తేడా లేకుండా అందరూ ఆదరిస్తున్న ఈ సమయంలో ఇంకా మన తెలుగు సినిమాలని ప్రాంతాల పేరుతో విడగొట్టి చూడటం ఎంత వరకు కరెక్ట్ అంటూ ఫైర్ అయ్యారు.

Advertisement

ఎమోషన్స్ మాత్రం  పరిమితం కావు

ఇక తాజాగా ప్రముఖ బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి జీవితం ఆధారంగా తెరకెక్కిన ‘గరివిడి లక్ష్మి’ సినిమా విషయంలోనూ ఇదే విషయాన్నిచెప్పుకొచ్చాడు.ఈ సినిమా ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన ఒక గొప్ప కళాకారిణి జీవిత కథే అయినప్పటికీ, ఇందులో ఉన్న ఎమోషన్స్ మాత్రం ఒక్క ఉత్తరాంధ్రకే పరిమితం కావని స్పష్టం చేశారు. ప్రతి ఒక్క మనిషికి తన పుట్టిన నేలతో ఒక విడదీయరాని అనుబంధం ఉంటుందని, ఆ మట్టి వాసన ఎలాంటి భాషా, ప్రాంతీయ గోడలు అడ్డుకావని తేల్చి చెప్పారు.

అందరికి ఒకేలా అర్థమవుతాయి

ఇక ఈక్రమంలోనే భారతీరాజా దర్శకత్వంలో వచ్చిన తమిళ చిత్రం ‘మణ్ వాసనై’ (తెలుగులో ‘కోకిలమ్మ’)సినిమాని ప్రత్యేకంగా గుర్తుచేశారు నరేష్. గ్రామీణ మట్టి వాసన ఉన్న కథలు ఎక్కడి నుండి వచ్చినా అవి ప్రపంచంలోని అందరికి ఒకేలా అర్థమవుతాయని,అలాంటిది సినిమాని ఇంకా ప్రాంతాల పేరిట వేరు చేయడం సరికాదని చెప్పుకొచ్చారు.

ఇక ఒక బయోపిక్ తీసేటప్పుడు అది ఒక డాక్యుమెంటరీ లా ఉండాల్సిన అవసరం లేదని దానికి నాగ్ అశ్విన్ తీసిన మహానటే పెద్ద ఎగ్జాంపుల్ అని ,ఒక వ్యక్తీ లైఫ్ ని ఎంత సినిమాటిక్ గా చూపించవచ్చో ప్రూవ్ చేశాడని ఆకాశానికి ఎత్తేశాడు.

సినిమాలలో 70 %సక్సెస్ రేటు 

ఇక తాను డబ్బుల కోసమో ,ప్యాకేజీల కోసమో సినిమాలు చేయట్లేదని,మంచి సినిమాలకి తన వంతు సహాయం చేయాలనే ఉద్దేశంతోనే సినిమాలు చేస్తున్నానని తెలిపాడు.ఇక తన కెరీర్ లో దసరా సీజన్ లో వచ్చిన సినిమాలలో 70 %సక్సెస్ రేటు ఉందని,ఇపుడు ఆ కోవలోనే దసరా సీజన్లో వచ్చే సినిమాలలో గరివిడి లక్ష్మి సినిమా పెద్ద సక్సెస్ సాధిస్తుంది అంటూ తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చారు నరేష్.

ఏది ఏమైనా ప్రపంచమే ఒక కుగ్రామం అయిపోయి వరల్డ్ సినిమా అరచేతికి వచ్చిన ఈ రోజుల్లో నిజంగానే సినిమాని తెలంగాణ..రాయలసీమ.. ఉత్తరాంధ్ర..అంటూ విడదీయడం నిజంగా భాధాకరం !

ALSO READ :తెలుగు సినిమాల్లో ఎప్పటికీ మారని కామెడీ సీన్లు ఏంటో తెలుసా ?

Tags

Related News

జగపతిబాబునే ఇమిటేట్ చేసిన అభిమాని.. హీరో అదిరిపోయే రియాక్షన్.. వీడియో వైరల్!

27 ఏళ్ల తర్వాత చిరుతో జతకట్టబోతున్న రమ్యకృష్ణ.. ఈ ట్విస్ట్ ఏంటి బాస్?

రీషూట్ చేయాల్సిందేనా? ఆదర్శ కుటుంబం వాయిదాకు ఇదే కారణమా?

సినీ ఇండస్ట్రీలో విషాదం..బిల్లా 2 నిర్మాత మృతి.

శ్రీ విష్ణు ‘కామ్రేడ్ కళ్యాణ్’ ట్రైలర్ చూశారా? నవ్వులే నవ్వులు!

మరో గోల్డెన్ ఆఫర్ పట్టేసిన అనస్వర రాజన్.. నిన్న చిరు.. నేడు?

తెలుగు సినిమాల్లో ఎప్పటికీ మారని కామెడీ సీన్లు ఏంటో తెలుసా ?

Big Stories

Advertisement
×