E-Paper
Advertisement

7 ఇయర్స్ మిస్సింగ్… పుట్టుకతో గుడ్డిదైన పిల్ల తిరిగొచ్చేసరికి కంటిచూపుతో… మెంటల్ మాస్ సిరీస్ మావా

7 ఇయర్స్ మిస్సింగ్… పుట్టుకతో గుడ్డిదైన పిల్ల తిరిగొచ్చేసరికి కంటిచూపుతో… మెంటల్ మాస్ సిరీస్ మావా
Advertisement

Sci-Fi Mystery Series OTT : ఏడేళ్ల క్రితం అదృశ్యమైన ఓ అమ్మాయి అకస్మాత్తుగా ఇంటికి తిరిగి వస్తుంది. కనిపించకుండా పోయినప్పుడు ఆమెకు కంటిచూపు లేదు. కానీ తిరిగి వచ్చినప్పుడు ఆమెకు చూపు వచ్చేసింది. తన గతం గురించి పెద్దగా చెప్పదు. తన పేరు కూడా ఇప్పుడు ‘ది ఓఏ’ అని చెబుతుంది. ఇలా మొదలైన మిస్టరీ నుంచి మనకు తెలిసిన ప్రపంచాన్ని దాటి మరో డైమెన్షన్ వరకు తీసుకెళ్లే సై-ఫై మిస్టరీ సిరీస్ కథే ‘ది ఓఏ’ (The OA). మరి ఈ థ్రిల్లర్ ను ఏ ఓటీటీలో చూడవచ్చు ? తెలుగులో ఉందా లేదా ? అన్నది తెలియాలంటే వివరాల్లోకి వెళ్దాం.

కథలోకి వెళ్తే…

ప్రెయిరీ జాన్సన్ ఏడేళ్ల క్రితం కనిపించకుండా పోతుంది. అప్పటికి ఆమెకు కంటిచూపు ఉండదు. కుటుంబం ఎన్నో ప్రయత్నాలు చేసినా ఆమె ఆచూకీ దొరకదు. కానీ ఏడేళ్ల తర్వాత ఆమె ఒక్కసారిగా ఇంటికి తిరిగి వస్తుంది. ఆశ్చర్యకరంగా ఇప్పుడు ఆమెకు చూపు వచ్చి ఉంటుంది. తల్లిదండ్రులు నాన్సీ, ఏబెల్ కు ఇది అద్భుతంలా అనిపిస్తుంది. కానీ ప్రెయిరీ మాత్రం తన గురించి అందరికీ తెలియని మరో కథను దాచి పెడుతుంది. ఆమె తన పేరును కూడా ‘ది ఓఏ’గా మార్చుకున్నట్టు చెబుతుంది. ఏడేళ్ల పాటు ఎక్కడ ఉంది, ఎలా చూపు వచ్చింది అనే విషయాలను మాత్రం పూర్తిగా వెల్లడించదు.

Advertisement

ప్రెయిరీ తన చుట్టూ ఉన్న కొంతమంది టీనేజర్లను ఎంపిక చేసుకుంటుంది. స్టీవ్, ఫ్రెంచ్, బక్, జెస్సీ, టీచర్ బీబీఏతో కలిసి ఓ రహస్య గ్రూప్‌ ను ఏర్పాటు చేస్తుంది. వాళ్లందరినీ ఒకచోట చేర్చి, తనకు జరిగిన విషయాలను చెబుతుంది. తాను చిన్నతనంలో రష్యాలో నినా అజరోవాగా జీవించానని, తన జీవితాన్ని మార్చేసిన కొన్ని సంఘటనల తర్వాత మరో ప్రపంచంలోకి వెళ్లినట్టుగా చెబుతుంది. ఆమె చెప్పే కథలో మరణం, ప్రయోగాలు, బందీ జీవితం, మరో డైమెన్షన్ వంటి అంశాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తాయి.

ప్రెయిరీ చెప్పే కథను నమ్మాలా వద్దా అన్న సందేహం ఆ టీనేజర్లలో ఉంటుంది. కానీ ఆమె చూపించే కొన్ని ప్రూఫ్స్ వాళ్లను నమ్మేలా చేస్తాయి. ఇక ఆమె ఉద్దేశం మాత్రం స్పష్టంగా ఉంటుంది. తనలాంటి ఘటనలు ఎదుర్కొన్న మరికొందరిని కాపాడేందుకు ఈ టీమ్ అవసరమని చెబుతుంది. అసలు ప్రెయిరీకి అసలు ఏం జరిగింది ? ఆమె కంటిచూపు ఎలా వచ్చింది ? ఆమె ‘ది ఓఏ’ అనే పేరు ఎందుకు పెట్టుకుంది ? ఆమె చెప్పే మరో డైమెన్షన్ నిజంగానే ఉందా ? ఆ రహస్యమైన మూవ్‌మెంట్స్ వెనుక ఉన్న శక్తి ఏంటి ? తెలియాలంటే ఈ సిరీస్ ను మస్ట్ వాచ్.

Advertisement

Also Read : దట్టమైన అడవిలో విమానం క్రాష్… బతకడానికి అమ్మాయిలు చేసిన పని చూస్తే ఒళ్లు గగుర్పొడవాల్సిందే

ఓటీటీలో ఎక్కడ చూడొచ్చు?

‘ది ఓఏ’ Netflix ఒరిజినల్ సై-ఫై మిస్టరీ సిరీస్. బ్రిట్ మార్లింగ్, జేసన్ ఐజాక్స్, ఎమ్మోరీ కోహెన్ ఈ సిరీస్ లో ప్రధాన పాత్రల్లో నటించారు. ఇది నెట్ ఫ్లిక్స్ లో రెండు పార్ట్స్‌గా అందుబాటులో ఉంది. కానీ తెలుగులో లేదు.

Tags

Related News

నడిసముద్రంలో మిస్సింగ్ షిప్… తలుపు తీసి చూస్తే కళ్లు తేలేసే సీక్రెట్స్…’డార్క్’ మేకర్స్ మైండ్-బెండింగ్ మిస్టరీ

దట్టమైన అడవిలో విమానం క్రాష్… బతకడానికి అమ్మాయిలు చేసిన పని చూస్తే ఒళ్లు గగుర్పొడవాల్సిందే

ప్రతిరోజూ ఉదయం 3:33 గంటలకే మెలకువ… సీరియల్ కిల్లర్‌కి, ఈ టైమ్‌కి ఉన్న లింక్ ఏంటి ? తెలుగులోనే స్ట్రీమింగ్

బాబోయ్ 23 ఏళ్లకు ఒకసారి వచ్చే దెయ్యం మళ్లీ వచ్చింది… రాత్రిపూట ఒంటరిగా చూడకూడని సినిమా

డ్రాగన్‌ను కొట్టడానికి కుర్రాడి క్రేజీ జర్నీ… విజువల్స్ పీక్స్ అసలు… ఎపిక్ ఫాంటసీ అడ్వెంచర్ సినిమా

అయ్యబాబోయ్ ఆ అద్దంలో డెవిల్ ఉందంట… సీక్రెట్ టెస్ట్ చేయబోతే మైండ్ బ్లాకయ్యే సీన్స్… వైరల్ అవుతున్న హారర్ మూవీ

భూమిని తుడిచిపెట్టే వైరస్… 2035 నుంచి పాస్ట్‌లోకి వెళ్లిన ఖైదీ… అల్టిమేట్ టైమ్ ట్రావెల్ సై-ఫై సిరీస్

Big Stories

Advertisement
×