E-Paper
Advertisement

బిగ్ బాస్ 10 లో పొలిటికల్ గేమ్స్.. సీక్రెట్ బయట పెట్టిన శివాజీ!

బిగ్ బాస్ 10 లో పొలిటికల్ గేమ్స్.. సీక్రెట్ బయట పెట్టిన శివాజీ!
Advertisement

Shivaji On Bigg Boss 10 : తెలుగు బుల్లితెర పై ప్రసారం అవుతున్న బిగ్ బాస్ 10 తెలుగు కార్యక్రమం మరొక నాలుగు వారాలలో పూర్తి కాబోతోంది. ఇక ఈ సీజన్ కాస్త విభిన్నంగా ఊహలకు అందని విధంగా ఉన్న సంగతి తెలిసిందే. ఇక బిగ్ బాస్ సీజన్ 10 (Bigg Boss 10 ) బజ్ హోస్ట్ గా శివాజీ (Shivaji)కొనసాగుతున్న సంగతి తెలిసిందే. కమెడియన్ అలీ (Ali)వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఆలీతో జాలీగా అనే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా సినిమాలకు సంబంధించిన విషయాలతో పాటు బిగ్ బాస్ 10 గురించి కూడా ఎన్నో ఆశక్తి కరమైన విషయాలను తెలియజేశారు.

బిగ్ బాస్ హౌస్ లో రాజకీయ ఎత్తుగడలు..

ఇక ఇదివరకు ప్రసారమైన సీజన్ల కంటే సీజన్ 10 లో పాల్గొన్న కంటెస్టెంట్ల గురించి ఈయన మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సీజన్లో పాల్గొన్న కంటెస్టెంట్లు ఆట కంటే కూడా రాజకీయ వ్యూహాలు లెక్కల పైనే ఎక్కువ దృష్టి పెట్టారని శివాజీ తెలిపారు. ఉదాహరణకు ఈ అమ్మాయి ఉంటే ఆ అబ్బాయి చుట్టే తిరుగుతూ ఆట ఆడుతుంది కాబట్టి ఈ వారం అతన్ని ఆపేద్దాం వంటి వ్యూహాలు చేస్తున్నారని శివాజీ తెలిపారు. ఇలా బిగ్ బాస్ హౌస్లో రాజకీయ ఎత్తుగడలు జరుగుతున్నాయని అయితే ఇవన్నీ హౌస్ లో ఏమాత్రం పని చేయవని శివాజీ తెలిపార

పీఆర్ టీం వ్యూహాలు ఫలించవు..

Advertisement

ఇక హౌస్ లో ఉన్న కంటెస్టెంట్లకు సంబంధించిన పి ఆర్ టిమ్ బయట ఎంత కష్టపడినా వారి వ్యూహాలు హౌస్ లో ఉన్న కంటెస్టెంట్ ల ప్రయాణం పై ఏమాత్రం ప్రభావం చూపవని తెలిపారు. ఇక ఈ కార్యక్రమ నిర్వాహకులు సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను ఏమాత్రం పట్టించుకోరం అంటూ శివాజీ ఈ సందర్భంగా తెలియజేశారు. ఇలా బిగ్ బాస్ సీజన్ 10 కార్యక్రమం గురించి శివాజీ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇక శివాజీ కూడా బిగ్ బాస్ సీజన్ సెవెన్ కార్యక్రమంలో కంటెస్టెంట్ గా పాల్గొన్నారు. ఈ సీజన్లో శివాజీ విన్నర్ అవుతారని అందరూ భావించారు కానీ ఊహించని విధంగా పల్లవి ప్రశాంత్ విజేతగా బయటకు వచ్చిన సంగతి తెలిసిందే.

టాప్ ఫైవ్ కంటెస్టెంట్లు వీళ్లే..

ఇక ఈ సీజన్ అనంతరం శివాజీ ఈ కార్యక్రమ బజ్ హోస్ట్ గా కొనసాగుతున్నారు. ఇక ఈ సీజన్ 10 లో టాప్ ఫైవ్ కంటెస్టెంట్ల గురించి కూడా శివాజీ తన అభిప్రాయాన్ని తెలియజేశారు. ఇందులో భాగంగా త్రిగుణ్, ముఖేష్, నరేష్, దేబ్జానీ కచ్చితంగా ఉంటారని ఇక ఐదవ స్థానం కోసం రాంప్రసాద్, వంశీ లేదా అమన్ పోటీ పడే అవకాశాలు ఉన్నాయి అంటూ శివాజీ తెలియజేశారు. ఇలా బిగ్ బాస్ 10 కార్యక్రమం గురించి నటుడు శివాజీ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. మరి ఈయన చెప్పిన విధంగానే టాప్ ఫైవ్ లో ఈ కంటెస్టెంట్లు ఉంటారా లేదా అనేది తెలియాల్సి ఉంది.

Advertisement

Also Read: సినిమా ప్రమోషన్ల కోసం చేతబడి చేసిన హీరోలు.. షాక్ లో నిర్మాత!

Related News

బిగ్ బాస్ హౌస్లో స్పెషల్ సర్ప్రైజ్.. సందడి చేసిన ఇమ్మానుయేల్, సంజన!

లోపల త్రిగుణ్..బయట పీఆర్ టీం.. బిగ్ బాస్ వారి చేతుల్లోనే: నటరాజ్ మాస్టర్

నిర్మాతలకు చుక్కలు చూపిస్తున్న శ్రీవల్లి.. రెమ్యూనరేషన్ ఎంతంటే..?

రౌడీలను హౌస్ లోకి పంపించారు.. బిగ్ బాస్ పై నటరాజ్ మాస్టర్ ఫైర్!

Gundeninda GudiGantalu Today episode: రోహిణి పై మనోజ్ కు డౌట్.. బాలు ఏడ్పించేసాడు.. పాపం మీనా..

Karthika Deepam 2 Serial Today Episode November 24th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌:  సూరజ్ ను ఏం చేశావే అంటూ జ్యోత్స్ను నిలదీసిన మాలిని 

Podarillu Today Episode : విక్కీ పై చక్రీ సీరియస్.. మహాకు టెన్షన్.. చక్రీ కాపాడతాడా..?

Big Stories

Advertisement
×