BigTV English

War 2 Collections : ఎన్టీఆర్ ‘వార్ 2’ డే 1 వసూళ్ల ప్రిడిక్షన్.. ఎన్ని కోట్లంటే..?

War 2 Collections : ఎన్టీఆర్ ‘వార్ 2’ డే 1 వసూళ్ల ప్రిడిక్షన్.. ఎన్ని కోట్లంటే..?

War 2 Collections : టాలీవుడ్ స్టార్ హీరో గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ బాలీవుడ్ లో నటించిన మొదటి సినిమా వార్ 2.. ఇవాళ భారీ అంచనాలతో ఈ సినిమా థియేటర్లలోకి వచ్చేసింది. టాలీవుడ్ లో స్టార్ హీరోగా వరస హిట్ సినిమాలలో నటించిన ఎన్టీఆర్ బాలీవుడ్ లో ఏ రేంజ్ లో సత్తాని చాటాడో తెలుసుకోవాలని అందరూ ఈ మూవీ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆ సమయం రానే వచ్చేసింది.. ఇవాళ థియేటర్లోకి వచ్చేసిన ఈ సినిమా మొదటి షో తోనే బాక్సాఫీస్ హిట్ అనే టాక్ ని సొంతం చేసుకుంది.. ఎన్టీఆర్ పర్ఫామెన్స్ ఊహించని విధంగా ఉందని ఫాన్సు ఫుల్ ఖుషి అవుతున్నారు. మొత్తానికి పబ్లిక్ టాక్ ను చూస్తే ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకునేలా కనిపిస్తుంది.. ఈ సినిమాకి అందుతున్న టాక్ ప్రకారం మొదటి రోజు ఎన్ని కోట్ల కలెక్షన్లు రాబట్టిందో ఇప్పుడు ఒకసారి వివరంగా తెలుసుకుందాం..


‘వార్ 2’ ఫస్ట్ డే కలెక్షన్స్.. 

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ అలాగే బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ కలయికలో దర్శకుడు అయాన్ ముఖర్జీ తెరకెక్కించిన భారీ చిత్రమే “వార్ 2”.. ఈ సినిమాకు తెలుగులో పెద్దగా ప్రమోషన్స్ చేయలేదన్న విషయం తెలిసిందే.. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ ఈ మూవీలో ప్రధాన పాత్రలో నటించడంతో ఈ సినిమాపై భారీ హైప్ క్రియేట్ అయింది. దాంతో ఎక్కువగా బాలీవుడ్ లోనే ప్రమోషన్స్ జరిగాయి. తెలుగులో చివరిగా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. అందులో ఎన్టీఆర్ మాట్లాడిన మాటలు ప్రేక్షకుల మనసును దోచుకున్నాయి.. దాంతో ఈ సినిమాకు భారీగా ఓపెనింగ్స్ జరిగాయని తెలుస్తుంది.. ట్రేడ్ సర్కిల్స్ లో టాక్ నడుస్తుంది. దీనితో వార్ 2 ఈజీగా 100 కోట్ల మార్క్ ని క్రాస్ చేసే ఛాన్స్ ఉందని తెలుస్తుంది. యష్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్ లో ఏ సినిమా కూడా 100 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ అందుకోలేదు. కానీ మంచి టాక్ ను సొంతం చేసుకుంది. అంతేకాదు ఈ వీకెండ్ కలెక్షన్స్ భారీగా పెరిగే అవకాశం కూడా ఉంది.. మొత్తానికి మన గ్లోబల్ స్టార్ నార్త్ లో కూడా సత్తాని చాటాడని అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు.


Also Read :షోలో కన్నీళ్లు పెట్టుకున్న సుమ.. 25 ఏళ్లుగా ఎన్ని మోసాలో..

“వార్ 2” పై పబ్లిక్ ఏమంటున్నారంటే..?

త్రిబుల్ ఆర్ సినిమాతో వరల్డ్ వైడ్ గా మంచి క్రేజీ నందు ఉన్న ఎన్టీఆర్ గ్లోబల్ స్టార్ గా అందరి హృదయాలను దోచుకున్నాడు. ఈ మూవీ తర్వాత వచ్చిన దేవర సినిమా యావరేజ్ టాక్ ని అందుకున్న కూడా కలెక్షన్ల పరంగా పర్వాలేదనిపించింది. ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్ గా మరో సినిమా రాబోతుంది. ఈ మూవీ తర్వాత ఎన్టీఆర్ బాలీవుడ్ లో వార్ 2 సినిమా చేశారు.. పవర్ ప్యాక్డ్ యాక్షన్‌తోపాటు హృతిక్ రోషన్, ఎన్టీఆర్ పెర్ఫార్మెన్స్ బాగున్నాయి. వారిద్దరి మధ్య కెమిస్ట్రీ మ్యాజిక్ చేసింది. డ్యాన్స్ సీక్వెన్స్ అదిరిపోయింది. అయితే కథలో దమ్ము లేదు. పేలవంగా వీఎఫ్ఎక్స్ వర్క్ ఉంది. కియారా అద్వానీ గ్లామర్ షో బాగుంది. చివరి 25 నిమిషాలు మూవీ క్లైమాక్స్ చాలా బాగుందని పబ్లిక్ అంటున్నారు. ఇప్పటివరకు అయితే పాజిటివ్ టాక్ ని అందుకున్న ఈ మూవీ వీకెండ్ కలెక్షన్ల వర్షం కురిపించే అవకాశం ఉంది. అందులో దేవర తర్వాత రాబోతున్న ఈ సినిమాపై తారక్ అభిమానులు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు.. ఎన్టీఆర్ మాటిచ్చిన ప్రకారం ఈ సినిమా మంచి టాక్ ని సొంతం చేసుకుందని తెలుస్తుంది. ఇక ఎన్టీఆర్ సినిమాల విషయానికొస్తే.. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఆ తర్వాత మరో రెండు ప్రాజెక్టులలో నటించబోతున్నట్లు సమాచారం. త్వరలోనే గురించి అధికారిక ప్రకటన రానుంది..

Related News

Bipasha Basu: మృణాల్ కి గట్టి కౌంటర్ ఇచ్చిన బిపాసా బసు.. ఆ ఆలోచనల నుండి బయటకు రండి అంటూ!

Coolie Collections : రజినీ ఖాతాలో హిట్.. డే 1 వసూళ్ల ప్రిడిక్షన్..కలెక్షన్ల సునామీనే..

Shilpa Shetty – Raj Kundra: రూ. 60 కోట్ల బిగ్ స్కామ్ కేసులో ఇరుక్కున్న శిల్పా శెట్టి దంపతులు.. ఏమైందంటే?

Maheshbabu: మహేష్ బాబు మరదలు కారుకి ప్రమాదం.. కార్ వెనుక భాగం మొత్తం!

Tollywood: నడిరోడ్డుపై బట్టలు అమ్ముకుంటున్న హీరోయిన్.. ఏంటీ కర్మ!

Big Stories

×