BigTV English

Maheshbabu: మహేష్ బాబు మరదలు కారుకి ప్రమాదం.. కార్ వెనుక భాగం మొత్తం!

Maheshbabu: మహేష్ బాబు మరదలు కారుకి ప్రమాదం.. కార్ వెనుక భాగం మొత్తం!

Maheshbabu:టాలీవుడ్ లో సూపర్ స్టార్ గా పేరు సొంతం చేసుకున్నారు మహేష్ బాబు (Mahesh Babu). ప్రస్తుతం రాజమౌళి (Rajamouli ) దర్శకత్వంలో ఎస్ ఎస్ ఎం బి 29 (SSMB 29) అనే వర్కింగ్ టైటిల్ తో అంతర్జాతీయ ప్రమాణాలతో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఆగస్ట్ 9వ తేదీన మహేష్ బాబు పుట్టినరోజు కావడంతో ఎస్ఎస్ఎంబి29 మూవీ నుంచీ మహేష్ బాబు కి సంబంధించి రాజమౌళి ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేయడమే కాకుండా నవంబర్ లో సినిమా అప్డేట్ రిలీజ్ చేస్తామని ప్రకటించారు. ఇదిలా ఉండగా ఇప్పుడు మహేష్ బాబు మరదలు ప్రయాణిస్తున్న కారుకి యాక్సిడెంట్ అయిందని తెలిసి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.


మహేష్ బాబు మరదలు కారుకి ప్రమాదం..

అసలు విషయంలోకి వెళ్తే.. ప్రముఖ నటి శిల్పా శిరోద్కర్ (Shilpa Shirodkar) కారును ముంబైలో బుధవారం సిటీ ఫ్లో బస్సు ఢీ కొట్టింది. ఈమె కారు దెబ్బతిన్న చిత్రాలను ఇంస్టాగ్రామ్ లో పంచుకుంది. బస్సు కంపెనీ బాధ్యత వహించడానికి నిరాకరించడంతో నిరాశ వ్యక్తం చేసిన శిల్పా శిరోద్కర్.. వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.. అయితే ఈ కారు ప్రమాదంలో తన కారులో ఉన్న ఎవరికి గాయాలు కాలేదు కానీ కారు వెనుక భాగం డామేజ్ అయినట్లు స్పష్టం చేసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఇకపోతే ఈ కారు ప్రమాదంలో ఎవరికి ఏం జరగలేదని తెలియడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.


శిల్పా శిరోద్కర్ కెరియర్..

శిల్పా శిరోద్కర్ విషయానికి వస్తే ప్రముఖ నటుడు, నిర్మాత అయిన మోహన్ బాబు నటించిన ‘బ్రహ్మ’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఆ తర్వాత నాగార్జున (Nagarjuna) తో కలిసి హిందీ సినిమా ‘ఖుదా గవాహ్’ చిత్రంలో నటించినా.. ఈ సినిమాని తర్వాత కొండవీటి సింహం అనే పేరుతో తెలుగులో రిలీజ్ చేశారు. ఈ పేరుతో ఒక పెద్ద సూపర్ హిట్ అయిన సినిమా ముందే ఉండడంతో పెద్దగా గుర్తింపు రాలేదు. ఇకపోతే ఈమె సోదరి నమ్రత శిరోద్కర్ ప్రముఖ నటి అన్న విషయం అందరికీ తెలిసిందే.. ఇక ఈమె మహేష్ బాబును వివాహం చేసుకోవడంతో శిల్పా శిరోద్కర్ మహేష్ బాబు బంధువు అయిపోయారు. అలా కూడా ఈమె పాపులారిటీ సంపాదించుకున్నారు.

శిల్పా శిరోద్కర్ వ్యక్తిగత జీవితం..

సినిమాలలో నటిస్తూ ఉండగానే.. 2000వ సంవత్సరంలో అపరేష్ రంజిత్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది శిల్పా శిరోద్కర్. అటు వైవాహిక జీవితంలో సంతోషంగా కొనసాగుతున్న ఈమె.. అప్పుడప్పుడు తన సోదరీ నమ్రతా శిరోద్కర్ తో వెకేషన్ ఎంజాయ్ చేస్తూ అందుకు సంబంధించిన ఫోటోలను కూడా అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.

ALSO READ:Coolie OTT: రజినీకాంత్ కూలీ ఓటీటీ లాక్.. స్ట్రీమింగ్ అప్పటి నుంచే!

Related News

Bipasha Basu: మృణాల్ కి గట్టి కౌంటర్ ఇచ్చిన బిపాసా బసు.. ఆ ఆలోచనల నుండి బయటకు రండి అంటూ!

Coolie Collections : రజినీ ఖాతాలో హిట్.. డే 1 వసూళ్ల ప్రిడిక్షన్..కలెక్షన్ల సునామీనే..

Shilpa Shetty – Raj Kundra: రూ. 60 కోట్ల బిగ్ స్కామ్ కేసులో ఇరుక్కున్న శిల్పా శెట్టి దంపతులు.. ఏమైందంటే?

War 2 Collections : ఎన్టీఆర్ ‘వార్ 2’ డే 1 వసూళ్ల ప్రిడిక్షన్.. ఎన్ని కోట్లంటే..?

Tollywood: నడిరోడ్డుపై బట్టలు అమ్ముకుంటున్న హీరోయిన్.. ఏంటీ కర్మ!

Big Stories

×