Suma Adda Promo : బుల్లితెర పై లెజండరీ యాంకర్ సుమ చేస్తున్న ప్రతి షో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. సుమ యాంకరింగ్ ప్రేక్షకులందరికీ బాగా ఆకట్టుకుంటుంది. అందుకే ప్రతి ఒక్కరూ సుమా చేసిన సుమ చూసేందుకు ఆసక్తి కనబరుస్తుంటారు. గత కొన్ని లుగా యాంకర్ గా హోస్ట్ గా చేసింది. ప్రస్తుతం ఆమె సుమా అడ్డా అనే షో తో ప్రేక్షకులను అలరిస్తుంది.. ఈ షో లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమో ని తాజాగా రిలీజ్ చేశారు.. ఈ ప్రోమోలో రాజీవ్ కనకాల ఎంట్రీ ఇచ్చారు. వీరిద్దరి గురించి కొన్ని ఆసక్తికర విషయాలను సుమా పంచుకుంది.. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..
సుమా అడ్డా ప్రోమో..
టాలీవుడ్ యంగ్ హీరోయిన్ వర్ష బొల్లమ్మ ప్రధాన పాత్రలో నటిస్తున్న వెబ్ సిరీస్ కానిస్టేబుల్ కనకం. ఈటీవీ విన్ ఓటీటీలో ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. ఆగస్టు 14 నుంచి ఈ వెబ్ సిరీస్ అందుబాటులోకి రాబోతుంది. తాజాగా ఈ మూవీ టీమ్ సుమ అడ్డా షోకి ప్రమోషన్స్ కోసం వచ్చింది. ఇందులో కీలక పాత్రలో సుమ భర్త రాజీవ్ కనకాల నటించారు. ఈ షోకి ఆయనకు కూడా రావడంతో హైలెట్ అయ్యింది. ఈ షో లేటెస్ట్ ప్రోమో కాస్త సందడిగా మారింది. రాజీవ్ వచ్చి రాగానే అందరి దగ్గరకి వెళ్లి పలకరించారు. ఇది చూసి మీ అందరూ చాలా క్రమశిక్షణగా ఉన్నారు ఈ కుర్రాడు తప్ప అంటూ రాజీవ్ గురించి మూవీ టీమ్‌కి కంప్లెయింట్ చేసింది సుమ. దీంతో ఇక్కడెక్కడో కాలిన వాసన వస్తుందా మీకు అంటూ సుమకి పంచ్ వేశారు.. అది ప్రోమోకి హైలెట్ అవుతుంది.
Also Read: మెగా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. రంగంలోకి దిగిన సుకుమార్..
25 ఏళ్లుగా నన్ను మోసం చేశారు..
ఈ ఎపిసోడ్ ప్రోమోలో సుమ, రాజీవ్ కనకాల మధ్య సీన్స్ హైలెట్ గా నిలిచాయి. ప్రోమో చివరిలో ర్యాపిడ్ ఫైర్ అంటూ రాజీవ్‌ని కొన్ని ప్రశ్నలు అడిగింది సుమ. నా యోగక్షేమాలన్నీ చూసుకునేది. నా కొడుకు రోషన్ నా, కూతురు మనస్విని అంటూ కొశ్చన్ అడిగితే రాజీవ్ తెలివిగా నేను చెప్పను అంటూ పట్టుబట్టారు. ఆ తర్వాత సుమా మా పెళ్లి అయ్యి 25 ఏళ్ల అయింది. ఎన్ని మోసాలు చేశాడో అంటూ సుమ సరదాగా కామెంట్ చేసింది. ఇక సుమ ఒప్పుకుంటే వీళ్లిద్దరిలో ఒకరితో కాఫీకి వెళ్లాలని ఉంది. వర్ష రాజీవ్ తో అని సరదాగా అంటుంది. తూచ్ ఇది నేను ఊరికే అడిగాను అని సుమ అంటుంది. మొత్తానికి ఎపిసోడ్ ప్రేక్షకులను ఆకట్టుకొనేలా ఉంది… ఈ ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సుమ ఏ షో చేసినా అది హైలెట్ అవుతుందన్న విషయం మరోసారి ప్రూవ్ అయింది. ఈ వెబ్ సిరీస్ స్ భారీ అంచనాలతో ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతుంది.