BigTV English

War 2 Film: అదంతా ఫేక్…ప్రీ రిలీజ్ ఈవెంట్ పై స్పందించిన వార్ 2 టీమ్!

War 2 Film: అదంతా ఫేక్…ప్రీ రిలీజ్ ఈవెంట్ పై స్పందించిన వార్ 2 టీమ్!

War 2 Film: టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్(NTR) ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఈయన రాజమౌళి దర్శకత్వంలో నటించిన RRR సినిమా తర్వాత చేస్తున్న ప్రతి ఒక్క సినిమాని కూడా పాన్ ఇండియా స్థాయిలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఇటీవల దేవర సినిమా (Devara Movie) ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో మంచి హిట్ అందుకున్న ఎన్టీఆర్ త్వరలోనే బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్(Hrithik Roshan) తో కలిసి నటించిన వార్ 2(War 2) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమా ఆగస్టు 14వ తేదీ పాన్ ఇండియా స్థాయిలో విడుదలకు సిద్ధమయింది.


ఆగస్టు 10 న ప్రీ రిలీజ్?

ఇక ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలు పెడుతున్నారు. ఇదివరకే ఈ సినిమా నుంచి విడుదల చేసిన ట్రైలర్ మాత్రం ఎంతో అద్భుతమైన ఆదరణ సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతున్న నేపథ్యంలో తెలుగు సినిమా హక్కులను సితార ఎంటర్టైన్మెంట్ అధినేత నాగ వంశీ(Naga Vamsi) కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ప్రీ రిలీజ్ వేడుకను (Pre Release Event)ఎంతో ఘనంగా నిర్వహించాలని భావించినట్టు తెలుస్తుంది. అయితే ఆగస్టు 10వ తేదీ ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను విజయవాడలో నిర్వహించబోతున్నట్లు వార్తలు చక్కర్లు కొట్టాయి.


అది నిజం కాదు… ఊహగానాలే..

ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో భాగంగా ఎన్టీఆర్ తో పాటు బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ కూడా పాల్గొంటారు అంటూ వార్తలు వినిపించాయి. ఇలా ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక గురించి పెద్ద ఎత్తున వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ వార్తలపై సితార ఎంటర్టైన్మెంట్ స్పందిస్తూ ఫుల్ క్లారిటీ ఇచ్చారు. వార్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ గురించి వస్తున్న వార్తలలో ఏమాత్రం నిజం లేదని అదంతా కేవలం ఊహగానాలు మాత్రమేనని తెలిపారు. ఇంకా ఈ వేడుక ఎక్కడ జరగాలి అనే విషయంపై స్పష్టత రాలేదని, వేదిక గురించి స్పష్టత వచ్చిన తరువాత తామే అధికారకంగా ఈ విషయాన్ని అభిమానులతో పంచుకుంటాము అంటూ సితార ఎంటర్టైన్మెంట్ ఈ వార్తలకు పులి స్టాప్ పెట్టింది.

అంచనాలు పెంచిన ట్రైలర్..

ఇలా ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక గురించి వచ్చే వార్తలలో ఏమాత్రం నిజం లేదని తెలియడంతో అభిమానులు ఒకింత నిరాశకు గురి అయ్యారు అయితే త్వరలోనే ఈ కార్యక్రమం ఎక్కడ జరుగుతుంది ఏంటి అనే వివరాలు అధికారికంగా వెల్లడించనున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమాపై ఇప్పటికే భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి ఇందులో ఎన్టీఆర్ ఒక స్పై ఏజెంట్ గా కనిపించబోతున్నారని తెలుస్తోంది. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా యశ్ రాజ్ ఫిలిమ్స్ యూనివర్స్ నుంచి ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ నటి కియారా అద్వానీ హీరోయిన్ గా నటించారు.

Also Read: Sonia Akula: ఘనంగా బిగ్ బాస్ బ్యూటీ సోనియా ఆకుల సీమంతం.. ఫోటోలు వైరల్!

Related News

Manchu Lakshmi: రామ్ చరణ్ ఇంట్లో ఉన్న మంచు లక్ష్మి… టాప్ సీక్రెట్ రివీల్

Poonam Pandey: రామాయణ కీలక పాత్రలో పూనమ్ పాండే.. మండిపడుతున్న హిందూ సంఘాలు

Dhanush: అదే నా కల.. అందుకే మీ సినిమాలలో ఆ పాత్రలు చేస్తున్నారా సార్!

Allu Sneha: స్నేహ రెడ్డికి ఈ ఫోటో అంటే అంత ఇష్టమా.. అంత స్పెషల్ ఏంటబ్బా?

Pasivadi Pranam Film: చిరు పసివాడి ప్రాణం చైల్డ్ ఆర్టిస్ట్ ఆ హీరోయినేనా.. ఇప్పుడు ఎలా ఉందంటే?

Idli KottuTrailer: ఆకట్టుకుంటున్న ధనుష్ ఇడ్లీ కొట్టు ట్రైలర్.. పని ఆదాయం కోసమే కాదంటూ!

Actress Hema: మంచు లక్ష్మికి హేమ సపోర్ట్.. మధ్యలో యాంకర్ సుమను కూడా ఇరికించేసిందిగా!

Mohanlal: ప్రతిష్టాత్మక పురస్కారానికి ఎంపికైన నటుడు మోహన్ లాల్.. ఖుషి అవుతున్న ఫ్యాన్స్!

Big Stories

×