Tips For White Hair: ఈ రోజుల్లో చాలా మంది తెల్ల జుట్టు సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. దీంతో జుట్టును నల్లగా మార్చుకోవడానికి రకరకాల ప్రొడక్ట్స్ వాడుతుంటారు. ముఖ్యంగా ఎక్కువ మంది తెల్ల కోసం మార్కెట్ లో దొరికే రకరకాల ఫేస్ కలర్స్ ట్రై చేస్తారు. వీటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ప్రమాదం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే ఇలాంటివి జరగకుండా ఉండాలంటే కొన్ని రకాల హోం రెమెడీస్ వాడటం మంచిది. హోం రెమెడీస్ తక్కువ సమయంలో జుట్టు నల్లగా మారడానికి ఎంతగానో ఉపయోగపడతాయి. తెల్ల జుట్టును నల్లగా మార్చేందుకు ఎలాంటి హోం రెమెడీస్ వాడాలో ఇప్పుడు తెలుసుకుందాం.
తెల్ల జుట్టు కోసం హోం రెమెడీస్:
కాఫీ స్ప్రే:
కాఫీ ఉదయాన్నే తాజాగా ఉంచడమే కాకుండా.. రంగు మారిన జుట్టును క్షణాల్లోనే నల్లగా మార్చడానికి కూడా సహాయపడుతుంది. అంతే కాకుండా ఇది ఎక్కువ సమయం జుట్టును నల్లగా మార్చేందుకు కూడా ఉపయోగపడుతుంది. ఇందు కోసం ఒక చిన్న కప్పు నీటిలో 2 టీస్పూన్ల ఇన్‌స్టంట్ కాఫీ పొడిని వేసి మరిగించండి. అది పూర్తిగా చల్లబడిన తర్వాత, దానిని స్ప్రే బాటిల్‌లో నింపండి. ఈ స్ప్రేను జుట్టు మీద తేలికగా స్ప్రే చేసి ఆరనివ్వండి. ఇలా తరచుగా చేయడం వల్ల నేచురల్ గానే మీ జుట్టుకు ముదురు గోధుమ రంగులోకి మారుతుంది. ఎక్కువ సార్లు వాడటం వల్ల జుట్టు నల్లగా మెరిసిపోతుంది.
బీట్‌రూట్ వాడకం:
కాఫీకి బదులుగా బీట్‌రూట్‌ను కూడా తెల్ల జుట్టును నల్లగా మార్చడానికి ఉపయోగించవచ్చు. బీట్‌రూట్‌ను ఉడికించి.. దాని రసాన్ని తీసి.. చల్లారిన తర్వాత, స్ప్రే బాటిల్‌లో నింపండి. మీరు దీన్ని జుట్టు మీద స్ప్రే చేసినప్పుడు.. అది జుట్టుకు సహజ రంగును ఇస్తుంద.తరచుగా దీనిని వాడటం వల్ల కూడా తెల్ల జుట్టు పూర్తిగా మారిపోతుంది.
డ్రై షాంపూ:
డ్రై షాంపూ జుట్టును రిఫ్రెష్ చేయడమే కాకుండా.. కొంతవరకు తెల్ల జుట్టును కూడా కవర్ చేస్తుంది. ముఖ్యంగా మీరు టిన్టెడ్ డ్రై షాంపూని ఉపయోగిస్తే.. అది తలలోని తెల్ల జుట్టును నల్లగా మారుస్తుంది. దీనివల్ల తెల్ల జుట్టు కూడా మీకు చాలా తక్కువగా కనిపిస్తుంది.
Also Read: ఫేస్ క్రీములు అవసరమే లేదు, బియ్యం పిండి ఇలా వాడితే చాలు !
ఐషాడో, హెయిర్ పౌడర్:
మీ దగ్గర హెయిర్ పౌడర్ లేకపోతే.. ఐషాడో ఒక గొప్ప ఎంపిక. మీ జుట్టుకు సరిపోయే షేడ్ ఏదైనా.. బ్రష్ సహాయంతో తెల్ల జుట్టు మూలాలపై ఆ మ్యాట్ ఐషాడోను తేలికగా అప్లై చేయండి. ఇది తక్షణమే జుట్టు రంగును బ్లెండ్ చేస్తుంది. తక్కువ సమయంలోనే మీకు ఉన్న తెల్ల జుట్టు రంగు మార్చడానికి కూడా ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.
హెయిర్ స్ప్రే:
ఈ రోజుల్లో..నిమిషాల్లోనే తెల్ల జుట్టును నల్లగా మార్చడానికి అనేక హెయిర్ మస్కారాలు, రూట్ టచ్-అప్ స్టిక్స్ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. మీరు అకస్మాత్తుగా ఎక్కడికైనా వెళ్లాల్సి వచ్చినప్పుడు, పార్లర్‌కు వెళ్లలేనప్పుడు ఇవి చాలా ఉపయోగకరంగా ఉంటాయి.
కలర్ స్ప్రేలు & హెయిర్ ఫైబర్స్:
మీ జుట్టు కొంచెం మందంగా కనిపించాలని అనుకున్నా.. లేదా తెల్ల జుట్టును దాచాలని కోరకున్నా కూడా కలర్ స్ప్రే లేదా హెయిర్ ఫైబర్ పౌడర్ ఉపయోగించండి. ఇవి వాటర్ ప్రూఫ్ అంతే కాకుండా ఇవి జుట్టుకు సహజమైన రూపాన్ని కూడా ఇస్తాయి. అంతే కాకుండా నిమిషాల్లోనే జుట్టుకు కొత్త రూపాన్ని ఇస్తాయి.