Sonia Akula: బిగ్ బాస్ బ్యూటీ సోనియా ఆకుల (Sonia Akula)ఇటీవల అభిమానులతో గుడ్ న్యూస్ షేర్ చేసుకున్న విషయం మనకు తెలిసిందే. ప్రాజెక్ట్స్ సక్సెస్ అంటూ ఈమె చాలా విభిన్నంగా తన ప్రెగ్నెన్సీని(Pregnancy) రివీల్ చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అయింది. పెళ్లయిన కొద్ది నెలలకే సోనియా తల్లి కాబోతున్న విషయాన్ని అభిమానులతో పంచుకోవడంతో అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. బిగ్ బాస్ 8 (Bigg Boss 8)కంటెస్టెంట్ గా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన సోనియా కొన్ని వారాలపాటు హౌస్ లో కొనసాగుతూ ఎంతో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారు.
హాజరైన సెలబ్రిటీలు…
ఇలా బిగ్ బాస్ కార్యక్రమంలో సుమారు 6 వారాలు పాటు కొనసాగిన ఈమె అనంతరం ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చారు. అయితే బిగ్ బాస్ పూర్తి అయ్యే సరికి ఈమె తన పెళ్లి గురించి అభిమానులతో శుభవార్త పంచుకున్నారు. యష్(Yash) అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్న వెంటనే ఈ జంట ఓంకార్ ఇస్మార్ట్ జోడి కార్యక్రమంలో పాల్గొని సందడి చేశారు ఇక ఈ కార్యక్రమాల ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సోనియా యష్ తాజాగా తల్లిదండ్రులు కాబోతున్నట్లు తెలియజేశారు. తాజాగా ఈమె సీమంతపు (Baby Shower)వేడుక ఎంతో అంగరంగ వైభవంగా జరిగినట్టు తెలుస్తుంది. ఈ సీమంతపు వేడుకలలో భాగంగా బుల్లితెర నటి నటులతో పాటు బిగ్ బాస్ కంటెస్టెంట్ లో ఇస్మార్ట్ జోడి కంటెస్టెంట్లు కూడా పాల్గొని సందడి చేశారు.
స్పెషల్ అట్రాక్షన్ గా ఓంకార్..
జబర్దస్త్ సుజాత, దంపతులతో పాటు బుల్లితెర నటి కీర్తి భట్ తన ప్రియుడుతో ఈ సీమంతపు వేడుకలలో పాల్గొన్నారు. ఇక ఈ సీమంతపు వేడుకలలో భాగంగా ప్రముఖ యాంకర్ ఓంకార్ (Omkar)కూడా పాల్గొని సందడి చేశారు. ప్రస్తుతం సోనియా సీమంతపు వేడుకలకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలు చూసినా అభిమానులు ముందుగానే ఈ జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అతి త్వరలోనే ఈ జంట పండంటి బిడ్డకు జన్మనివ్వబోతున్నారని చెప్పాలి.
?igsh=MTJ6NHdkdmNwcDVsMQ%3D%3D
ఇక సోనియా కెరియర్ విషయానికి వస్తే… రాంగోపాల్ వర్మ ఎంతోమంది హీరోయిన్లను ఇండస్ట్రీకి పరిచయం చేశారు. ఇలా రాంగోపాల్ వర్మ నిర్మించిన కరోనా వైరస్ సినిమా ద్వారా సోనియా ఇండస్ట్రీకి హీరోయిన్గా పరిచయమయ్యారు. ఇలా హీరోయిన్ గా పలు సినిమాలు వెబ్ సిరీస్ లలో నటించిన ఈమె అదే గుర్తింపుతో బిగ్ బాస్ కార్యక్రమంలోకి అడుగుపెట్టారు. ఇక బిగ్ బాస్ కార్యక్రమంలో ఉన్నది తక్కువ వారాలే అయినప్పటికీ నామినేషన్స్ లో పెద్ద ఎత్తున తన వాదన వినిపిస్తూ వార్తల్లో నిలిచారు. ఇక బిగ్ బాస్ 8 కంటెస్టెంట్లు అయినా నిఖిల్,పృథ్వీతో పెద్దోడు చిన్నోడు అంటూ బ్రదర్ సిస్టర్ రిలేషన్ కొనసాగించారు. ఇక ఈమె ఇండస్ట్రీలోకి రాకముందు మోడల్ గా చేశారు అనంతరం ఇండస్ట్రీ వైపు అడుగులు వేశారు. ఇక పెళ్లి తర్వాత సోనియా కేవలం తన భర్త బిజినెస్ లను చూసుకుంటూ ఉన్నారని తెలుస్తోంది.
Also Read: Nirupam Paritala: సీరియల్ నటుడు నిరుపమ్ రెమ్యూనరేషన్.. ఆస్తుల విలువ ఎంతో తెలుసా?