Ramayana:దర్శక ధీరుడు నితేష్ తివారీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న విజువల్ వండర్ ‘రామాయణం’ చిత్రం గురించి ప్రతీ అప్డేట్ సినిమా ప్రేమికులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. తాజాగా ఈ సినిమా నుంచి మేకర్స్ మరో బిగ్ అప్డేట్ ఇచ్చారు. చిత్రంలో అత్యంత కీలకమైన కైకేయి పాత్రకు సంబంధించిన అధికారిక ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పౌరాణిక చిత్రంలో బాలీవుడ్ ప్రముఖ నటి ఆ పాత్రలో ఎలా కనిపించబోతున్నారో చూడటానికి ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇంతకీ ఆ నటి ఎవరన్నది చూద్దాం..
‘రామాయణం’ సినిమాలో శ్రీరాముడి సవతి తల్లి కైకేయిగా లారా దత్తా కనిపించనున్నారు. ఆమె క్యారెక్టర్ పోస్టర్ తాజాగా విడుదలై నెట్టింట చక్కర్లు కొడుతోంది.. ఈ పోస్టర్‌లో లారా దత్తా అత్యంత రాజసం ఉట్టిపడేలా సంప్రదాయబద్ధమైన దుస్తులు, భారీ ఆభరణాలతో అయోధ్య రాణిగా అద్భుతంగా కనిపిస్తున్నారు. ఇక ఆమె కళ్లలో కనిపించే హావభావాలు రామాయణ కథలోని కీలక మలుపులను గుర్తుచేస్తున్నాయి.
ఈ అప్డేట్‌తో పాటు మేకర్స్ మరో ముఖ్యమైన పాత్రకు సంబంధించిన పోస్టర్‌ను కూడా రివీల్ చేశారు. రామాయణ కథను పూర్తిగా మార్చివేసే మంథర పాత్రలో నటి షీబా చద్దా నటిస్తున్నారు. చేతిలో కర్ర పట్టుకుని ఒక కుట్రపూరితమైన ఆలోచనతో కనిపిస్తున్న మంథర లుక్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఇక రాణి కైకేయి మనసును మార్చి, ఆ తర్వాత సామ్రాజ్యంలో చీకటి రోజులకు కారణమయ్యే ఈ పాత్ర సినిమాకు చాలా కీలకం కానుంది.
“కైకేయి రెండు కోరికలు.. రాముడి జీవితంలో కీలక మలుపు! ఈ క్యాప్షన్‌తో విడుదలైన పోస్టర్లు ఆసక్తి రేపుతున్నాయి. మంథర సలహాలతో కైకేయి తీసుకున్న నిర్ణయాలు రామాయణ కథను ఎలా మార్చాయో ఈ పోస్టర్లు హైలైట్ చేస్తున్నాయి. ఇక ఇప్పటికే దశరథ మహారాజుగా అరుణ్ గోవిల్ నటిస్తున్న లుక్ రాగా, ఇప్పుడు కైకేయి, మంథర లుక్స్ సినిమాపై అంచనాలను తారాస్థాయికి చేర్చాయి.
also read:ఆమెపై పగబట్టిన హౌస్ మేట్స్.. ఎలిమినేషన్ తప్పదా?
నితేష్ తివారీ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ భారీ పాన్-ఇండియా చిత్రంలో రణ్‌బీర్ కపూర్ శ్రీరాముడిగా, సాయి పల్లవి సీతగా నటిస్తున్నారు. అలాగే రాకింగ్ స్టార్ యష్ రావణాసురుడిగా, సన్నీ డియోల్ హనుమంతుడిగా, రవి దూబే లక్ష్మణుడిగా నటిస్తున్నారు. నమిత్ మల్హోత్రా నిర్మాణంలో,వస్తున్న ఈ చిత్రం పార్ట్ 1 ఈ ఏడాది దీపావళికి ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.
ఇక మొత్తానికి, ‘రామాయణం’ సినిమా నుంచి వస్తున్న ప్రతీ క్యారెక్టర్ పోస్టర్ సినిమాపై అంచనాలను విపరీతంగా పెంచేస్తోంది. లారా దత్తా రాణి కైకేయిగా కనిపించనున్న తీరు ప్రేక్షకులను కచ్చితంగా మెప్పిస్తుంది. ఇక హిందీతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో వస్తున్న ఈ విజువల్ వండర్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో వేచి చూడాలి..