E-Paper
Advertisement

ఈ ఎడిటర్ కు ప్రొడ్యూసర్ కంటే బిల్డప్ ఎక్కువ.. మంచి సినిమాలను నాశనం చేస్తున్నాడుగా?

ఈ ఎడిటర్ కు ప్రొడ్యూసర్ కంటే బిల్డప్ ఎక్కువ.. మంచి సినిమాలను నాశనం చేస్తున్నాడుగా?
Advertisement

Tollywood Editor :సినిమా ఇండస్ట్రీలో ఒక సినిమా తెరపై అద్భుతంగా కనిపించే విషయంలో ఎడిటర్ పాత్ర కూడా కీలకంగా ఉంటుందని చెప్పాలి. అయితే సినీ ఇండస్ట్రీలో ఒక ఎడిటర్ తీసుకుంటున్నటువంటి నిర్ణయాలపై ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చలు మొదలవుతున్నాయి. టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ఒక బడా ఎడిటర్ ఎడిటింగ్ నిర్ణయాలపై విమర్శలు వచ్చాయి. రీసెంట్‌గా ఒక పెద్ద బడ్జెట్ చిత్రంలో ఈ ఎడిటర్ తీసుకున్న కొన్ని నిర్ణయాలు ఇండస్ట్రీలో చర్చనీయాంశం అయ్యాయి. సినిమాలో ఉండాల్సిన కొన్ని మంచి సీన్లను కట్ చేసి, అనవసరమైన సీన్లకు ప్రాధాన్యతనిచ్చారనే గుసగుసలు వినిపిస్తున్నాయి.

పనితీరుపై ఆరోపణలు…

ఈ ఎడిటర్ చేస్తున్న ఈ పనుల కారణంగా  సక్సెస్ తలకెక్కిందనే ప్రచారం కూడా జరుగుతోంది. కొద్దికాలంగా ఆయన వ్యవహారశైలి, ప్రొఫెషనలిజం పట్ల కొందరు అసంతృప్తిగా ఉన్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ నడుస్తోంది.మంచి పేరున్నప్పటికీ…: ఆయన టాలెంటెడ్ ఎడిటరే అయినప్పటికీ, కేవలం గతంలోని పేరు ప్రఖ్యాతల మీద మాత్రమే కెరీర్ ను ముందుకు తీసుకెళ్లలేరని, ఎప్పుడూ ఒకేలా కష్టపడటం చాలా ముఖ్యం. తాజాగా ఈ ఎడిటర్ విషయంలో
సదరు ప్రముఖ నిర్మాణ సంస్థ విషయంలోనూ, ఆ ప్రొడ్యూసర్ అడుగులకు మడుగులొత్తుతూ ఆ ఎడిటర్ చేస్తున్న పనులపై ట్రేడ్ వర్గాల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది.

అసలు టాలీవుడ్‌లో ఏం జరుగుతోంది?

Advertisement

ఈ విధంగా ఎడిటర్ నడుచుకుంటున్న తీరు చూస్తుంటే టాలీవుడ్ ఇండస్ట్రీలో ఏం జరుగుతోంది? కంట్రోల్ అంతా ఆ ఎడిటర్ చేతిలోనేనా? ఆ బ్యానర్‌లో ఆ ఎడిటర్ లేకుండా నూలుపోగు కూడా కదలదనే టాక్ గట్టిగా వినిపిస్తోంది. ఆ ప్రొడ్యూసర్‌కు అత్యంత ఆప్తుడిగా ఉంటూ, బయట వేరే సినిమాలకు పని చేసినా సరే… ఆ ప్రాజెక్ట్‌లను ముందుగా ఆ ప్రొడ్యూసర్‌కు, ఆయన కోటరీకి చూపించి వారి గ్రీన్ సిగ్నల్ తీసుకునేలా వ్యవహరిస్తున్నారట. బజ్ తగ్గించే కుట్రలు? ఇతర బేనర్స్ సినిమాలను కూడా ముందుగా వీళ్లకు చూపించి, డిస్ట్రిబ్యూటర్లకు తక్కువ రేట్లు కట్టించడం లేదా కావాలని సినిమాపై బజ్ తగ్గించేలా ప్లాన్ చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. కేవలం తమ వర్గానికి నచ్చిన ప్రైస్‌కే అన్నీ జరిగేలా పావులు కదుపుతున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఇంటికి హార్డ్ డిస్క్ ట్రిప్స్..

ఒక సినిమాకి సంబంధించిన హార్డ్ డిస్క్‌ను నేరుగా ఎడిటర్ ఇంటికి తీసుకెళ్లి కూర్చొని వర్క్ చేయడం, ఆ ప్రొడ్యూసర్ టీమ్‌కి ఎప్పటికప్పుడు అప్డేట్స్ చూపించడం జరుగుతోందట. వారికి నచ్చితేనే ఫైనల్ అవుట్‌పుట్ బయటకు వెళ్తుందని, లేదంటే సీట్లు కట్ చేయడం వంటి పనులు జరుగుతున్నాయని ఇండస్ట్రీలో చర్చ నడుస్తోంది.

బయపడిపోతున్న మిగతా నిర్మాతలు..

Advertisement

ఈ ఎడిటర్‌తో సినిమా అంటేనే ఇప్పుడు టాలీవుడ్‌లో మిగతా నిర్మాతలు భయపడిపోయే పరిస్థితి వచ్చిందట. కంటెంట్ మీద కంటే అనవసరమైన సమీకరణాల మీద ఎక్కువ ఫోకస్ పెడుతున్నారనే విమర్శలు ఇండస్ట్రీ వర్గాల నుంచి గట్టిగానే వినిపిస్తున్నాయి.మరి ఈ కాంట్రవర్సీపై టాలీవుడ్ పెద్దలు ఎలా స్పందిస్తారో చూడాలి!

Also Read: తెలుగింటి కోడలుగా అడుగు పెట్టబోతున్న నిధి అగర్వాల్.. అబ్బాయి ఎవరంటే?

Related News

తెలుగింటి కోడలుగా అడుగు పెట్టబోతున్న నిధి అగర్వాల్.. అబ్బాయి ఎవరంటే?

వివేక్ ఆత్రేయ రవితేజ RT 78 టైటిల్ పై బిగ్ అప్డేట్!

రామాయణ నుండి బిగ్ అప్డేట్.. కైకేయి పాత్రలో స్టార్ హీరోయిన్!

నాగచైతన్య వర్సెస్ నితిన్.. బాక్సాఫీస్ వార్ లో గెలిచేదెవరు?

‘కామ్రేడ్ కళ్యాణ్’ పై ఫైర్ అవుతున్న మెగా ఫాన్స్.. ఆ డైలాగ్స్ కారణమా?

ఢిల్లీ హై కోర్టును ఆశ్రయించిన విజయ్ దేవరకొండ… వాటిని తొలగించాలంటూ!

సుమలతకి అనుకూలంగా హైకోర్టు.. అసోసియేషన్ ఎన్నికలకు బ్రేక్!

Big Stories

Advertisement
×