E-Paper
Advertisement

శ్రీ విష్ణులో ఇంత టాలెంటా? హీరో కాకపోయి ఉంటే?

శ్రీ విష్ణులో ఇంత టాలెంటా? హీరో కాకపోయి ఉంటే?
Advertisement

Sree Vishnu : సినీ ఇండస్ట్రీలోకి రాకముందు ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక ఉద్యోగం చేసుకుంటూ తమ జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటారు . అది ఎంత పెద్ద ఉద్యోగం అయినప్పటికీ, సినిమా కలను నెరవేర్చుకోవడానికి వాటన్నింటినీ పక్కన పెట్టి మరీ ఇండస్ట్రీలోకి వస్తున్న విషయం తెలిసిందే. అలా ఇప్పటికే ఎంతోమంది ఇంజనీర్లు, డాక్టర్లు, రాజకీయ నాయకులు కూడా ఇండస్ట్రీలో చలామణి అవుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే నటుడిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకొని విలక్షణమైన నటనతో బాక్సాఫీస్ వద్ద తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్కెట్ ను ఏర్పాటు చేసుకున్నారు.

శ్రీ విష్ణులో ఇంత టాలెంట్ ఉందా?

ఆయన ఎవరో కాదు వెండితెరపై విభిన్నమైన కథలతో.. నేచురల్ యాక్టింగ్ తో.. తనదైన కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తున్న శ్రీ విష్ణు(Sree Vishnu). ఏ పాత్ర చేసినా.. అందులో ఒదిగిపోయే ఆయన టాలెంట్ ను స్క్రీన్ పై చూస్తూనే ఉన్నాం.. కానీ ఆయన లైఫ్లో ఎంతోమందికి తెలియని ఒక విషయం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. పైగా ఈ విషయాన్ని ఆయనే అభిమానులతో స్వయంగా పంచుకున్నారు. అసలు విషయంలోకి వెళ్తే.. తాజాగా ఆయన నటించిన చిత్రం ‘కామ్రేడ్ కళ్యాణ్’. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ సినిమా. ప్రమోషన్స్ లో భాగంగా నాటి విషయాలను గుర్తు చేసుకుంటూ శ్రీ విష్ణు చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

నాటి కష్టాలను చెప్పుకున్న శ్రీ విష్ణు..

Advertisement

“నా బాల్యం మొత్తం గోదావరి జిల్లాలైన అమలాపురం, భీమవరం పరిసరాలలోనే గడిచింది. అప్పట్లో బ్యాట్ కొనుక్కునే పరిస్థితి లేక కొబ్బరి మట్టలను బ్యాటుగా చెక్కుకొని రబ్బర్ బాల్ తో క్రికెట్ ఆడే వాళ్ళం. స్కూల్ రోజుల్లో కార్క్ బాల్ , గ్రేస్ బాల్స్ తో మ్యాచులు జరిగేవి. టీమ్ మొత్తానికి ఒకే ఒక్క కిట్టు ఉండేది. బ్యాటింగ్ కి వెళ్లేవాడు ఒక ప్యాడ్ పెట్టుకుంటే.. రన్నర్ కి ఇంకో ప్యాడ్ ఇచ్చేవాడు. ఆ తర్వాత ఒక్కడు వాడిన ప్యాడ్స్ ని ఇంకొకరు మార్చుకుంటూ మ్యాచ్ లాడిన పరిస్థితులు కూడా ఉన్నాయి. ముఖ్యంగా నేను ఎక్కువగా నా పనులన్నీ లెఫ్ట్ హ్యాండ్ తోనే చేస్తాను. కానీ బ్యాటింగ్ మాత్రం రైట్ హ్యాండ్ తో చేస్తాను. బౌలింగ్ మాత్రం ఒక సహజమైన లెఫ్ట్ ఆర్మ్ స్వింగ్ ఉండేది. ముఖ్యంగా 90 ఏళ్ల కాలంలోనే హైదరాబాద్ శీతాకాలపు చలి, మంచు వాతావరణం ఉపయోగించుకుంటూ.. బంతిని ఎలా స్వింగ్ చేయాలో స్వయంగా నేర్చుకున్నాను.

అండర్ 19 జట్టులో లెఫ్ట్ ఆర్మ్ ఫేసర్..

ఈ రోజుల్లో లాగా అప్పట్లో ప్రతి ఊరికి క్రికెట్ అకాడమీలు, నెట్స్ ఉండేవి కాదు.. బౌలింగ్ స్పీడ్ పెంచుకోవడం కోసం సిమెంట్ పెచ్చు పై టెన్నిస్ బాల్ ను నీళ్లలో తడిపి మరీ బౌలింగ్ ప్రాక్టీస్ చేసేవాళ్ళు. భీమవరంలో చదువుకునేటప్పుడు స్కూల్ తరఫున జోనల్ టోర్నమెంట్లో ఆడడం, ఆ తర్వాత ఏలూరు కాకినాడలో జిల్లా స్థాయి సెలక్షన్లలో రాణించే వాళ్ళం అంటూ నాటి విషయాలను చెప్పుకొచ్చారు. ఇవాళ అంచలంచెలుగా ఎదుగుతూ స్టేట్ అండర్ 19 జట్టులో లెఫ్ట్ ఆర్మ్ ఫేసర్ గా చోటు దక్కించుకున్నట్లుగా కూడా శ్రీ విష్ణు తెలిపారు..

Advertisement

ALSO READ; త్వరలో పెళ్లి చేసుకోబోతున్న జబర్దస్త్ కమెడియన్..!

పరిస్థితుల ప్రభావంతో నటన వైపు అడుగులు..

ఒకానొక దశలో క్రికెట్ నే జీవితంగా మార్చుకోవాలనుకున్న శ్రీ విష్ణు కొన్ని పరిస్థితుల ప్రభావంతో నటన వైపు అడుగులు వేసినట్లు గుర్తు చేసుకున్నారు. ఏది ఏమైనా శ్రీ విష్ణు ఒకవేళ ఇండస్ట్రీలోకి రాకపోయి ఉంటే ఆయన దేశం గర్వించదగ్గ గొప్ప క్రికెటర్ అయి ఉండే వారని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

Related News

లగ్జరీ కారు కొన్న ప్రేమలు హీరో.. ఖరీదు ఎంతంటే?

త్రివిక్రమ్ పై పూనమ్ కౌర్ మరో సంచలన పోస్ట్..!

ఈ ఎడిటర్ కు ప్రొడ్యూసర్ కంటే బిల్డప్ ఎక్కువ.. మంచి సినిమాలను నాశనం చేస్తున్నాడుగా?

తెలుగింటి కోడలుగా అడుగు పెట్టబోతున్న నిధి అగర్వాల్.. అబ్బాయి ఎవరంటే?

వివేక్ ఆత్రేయ రవితేజ RT 78 టైటిల్ పై బిగ్ అప్డేట్!

రామాయణ నుండి బిగ్ అప్డేట్.. కైకేయి పాత్రలో స్టార్ హీరోయిన్!

నాగచైతన్య వర్సెస్ నితిన్.. బాక్సాఫీస్ వార్ లో గెలిచేదెవరు?

Big Stories

Advertisement
×