E-Paper
Advertisement

తెలుగింటి కోడలుగా అడుగు పెట్టబోతున్న నిధి అగర్వాల్.. అబ్బాయి ఎవరంటే?

తెలుగింటి కోడలుగా అడుగు పెట్టబోతున్న నిధి అగర్వాల్.. అబ్బాయి ఎవరంటే?
Advertisement

Nidhi Agarwal: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో నటిగా కొనసాగుతూ ఎన్నో విభిన్నమైన సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీగా ఉన్న వారిలో నిధి అగర్వాల్(Nidhi Agarwal) ఒకరు. వరుస ప్రాజెక్టులతో ఎంతో బిజీగా ఉన్నా ఈ ముద్దుగుమ్మ ఇటీవల ప్రభాస్ హీరోగా నటించిన ది రాజా సాబ్ (The Rajasaab)సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరోవైపు షాపింగ్ మాల్స్ ప్రారంభోత్సవ కార్యక్రమాలలో కూడా పాల్గొంటూ సందడి చేస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్న నిధి అగర్వాల్ తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు.

తెలుగబ్బాయిని పెళ్లి చేసుకోబోతున్న నటి..

ఒక షాపింగ్ మాల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సందడి చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా నిధి అగర్వాల్ పెళ్లికి సంబంధించిన ప్రశ్నలు ఎదురయ్యాయి. తెలుగు అబ్బాయిని పెళ్లి చేసుకుంటారా? అంటూ ఒక రిపోర్టర్ ఈమెను ప్రశ్నించారు ఇలా పెళ్లి(Marriage) గురించి ప్రస్తావనకు రావడంతో నిధి అగర్వాల్ ఈ విషయంపై స్పందిస్తూ.. అది తెలియదు బహుశా చేసుకోవచ్చు అంటూ సరదాగా నవ్వుతూ సమాధానం ఇచ్చారు. ఇలా తెలుగు అబ్బాయిని పెళ్లి చేసుకోవచ్చేమో అని చెప్పడమే కాకుండా తెలుగు రాష్ట్రాలతో తనకున్న అనుబంధం గురించి కూడా పలు విషయాలను అభిమానులతో పంచుకున్నారు.

నిధి అగర్వాల్ ప్రేమలో పడ్డారా?

Advertisement

తాను కూడా తెలుగు అమ్మాయినే అని నిధి అగర్వాల్ తెలిపారు. తాను హైదరాబాద్ లో పుట్టానని తెలిపారు. ఇలా హైదరాబాదులో పుట్టి పెరిగిన నిధి అగర్వాల్ పెళ్లి చేసుకుని తెలుగింటి కోడలుగా అడుగు పెట్టవచ్చు అంటూ సమాధానం చెప్పడంతో బహుశా ఈమె ఎవరితోనైనా ప్రేమలో పడ్డారా? అందుకే ఇలా తెలుగింటి కోడలు కావచ్చేమో అంటూ సమాధానం ఇచ్చారా అంటూ సోషల్ మీడియా వేదికగా అభిమానులు ఎన్నో సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రస్తుతం నిధి అగర్వాల్ పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు.

పవన్, ప్రభాస్ తో నటించిన ప్రయోజనం లేదా..

నిధి అగర్వాల్ సవ్యసాచి అనే సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు హీరోయిన్ గా పరిచయమయ్యారు. మొదటి సినిమాతో పర్వాలేదు అనిపించుకున్న ఈ ముద్దుగుమ్మ అనంతరం ఇస్మార్ట్ శంకర్, మిస్టర్ మజ్ను, హీరో, హరిహర వీరుమల్లు, రాజా సాబ్ వంటి తదితర సినిమాలలో నటించారు. ఇక ఈమె నటించిన హరిహర వీరమల్లు, రాజాసాబ్ సినిమాలు ఒకే ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఇక ఈ సినిమాల ద్వారా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ప్రభాస్ వంటి స్టార్ట్ హీరోలతో కలిసి నటించినప్పటికీ ఈ రెండు సినిమాలు కూడా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. ఈ సినిమాలు ఈమె కెరియర్ కు పెద్దగా ప్రయోజనం కలగలేదని చెప్పాలి.

Advertisement

Also Read: వివేక్ ఆత్రేయ రవితేజ RT 78 టైటిల్ పై బిగ్ అప్డేట్!

Related News

వివేక్ ఆత్రేయ రవితేజ RT 78 టైటిల్ పై బిగ్ అప్డేట్!

రామాయణ నుండి బిగ్ అప్డేట్.. కైకేయి పాత్రలో స్టార్ హీరోయిన్!

నాగచైతన్య వర్సెస్ నితిన్.. బాక్సాఫీస్ వార్ లో గెలిచేదెవరు?

‘కామ్రేడ్ కళ్యాణ్’ పై ఫైర్ అవుతున్న మెగా ఫాన్స్.. ఆ డైలాగ్స్ కారణమా?

ఢిల్లీ హై కోర్టును ఆశ్రయించిన విజయ్ దేవరకొండ… వాటిని తొలగించాలంటూ!

సుమలతకి అనుకూలంగా హైకోర్టు.. అసోసియేషన్ ఎన్నికలకు బ్రేక్!

భయపడితే ముందుకు వెళ్లలేం… కత్రినా కైఫ్ కామెంట్స్ వైరల్!

Big Stories

Advertisement
×