E-Paper
Advertisement

వివేక్ ఆత్రేయ రవితేజ RT 78 టైటిల్ పై బిగ్ అప్డేట్!

వివేక్ ఆత్రేయ రవితేజ RT 78 టైటిల్ పై బిగ్ అప్డేట్!
Advertisement

Raviteja RT 78: టాలీవుడ్ స్టార్, మాస్ మహారాజ రవితేజ ఇటీవల ఇరుముడి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇటీవల వరుస డిజాస్టర్ సినిమాలతో ఎంతో సతమతం అవుతున్న రవితేజకు ఇరుముడి (Irumudi)సినిమా సూపర్ హిట్ బ్లాక్ బాస్టర్ అందించింది. ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో రవితేజ(Raviteja) తన తదుపరి ప్రాజెక్టులపై పూర్తిస్థాయిలో దృష్టి సారించారు. ఎప్పుడు ఒకే తరహా కథలు కాకుండా విభిన్నమైన కథల ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పటివరకు రవితేజ కెరియర్లో నటించని హర్రర్ జోనర్ ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారంటూ వార్తలు వచ్చాయి.

వివేక్ ఆత్రేయతోనే రవితేజ సినిమా..

ఇరుముడి సినిమా తర్వాత రవితేజతో పలువురు దర్శక నిర్మాతలు చర్చలు జరిపినట్టు తెలుస్తోంది. ఇక రవితేజ మాత్రం వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో సినిమాకు కమిట్ అయినట్టు తాజాగా అధికారక ప్రకటన వెల్లడించారు.లక్ష్మణ్ మరియు శ్రీని సంయుక్తంగా బ్రిడ్జ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్ సినిమాగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇకపోతే చిత్ర బృందం తాజాగా ఈ సినిమాకు సంబంధించిన కీలక అప్డేట్ తెలియజేశారు. రవితేజ తన తదుపరి సినిమా వివేక్ ఆత్రేయతో (Vivek athreya) ఉండబోతుందని ఈ సినిమా RT 78 వర్కింగ్ టైటిల్ తో ఒక పోస్టర్ విడుదల చేశారు.

పరిశీలనలో తులాభారం టైటిల్..

Advertisement

ఇక ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ డాక్యుమెంటరీని అక్టోబర్ 11వ తేదీ ఉదయం 10:30 నిమిషాలకు విడుదల చేయబోతున్నట్లు తెలిపారు. ఇలా చిత్ర బృందం ఈ విషయాన్ని అధికారకంగా ప్రకటించిన నేపథ్యంలో రవితేజ అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ సినిమా ఏ జోనర్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతుందనే విషయంపై కూడా స్పష్టత రాబోతోంది. ఈ సినిమాకు ఇప్పటికే తులాభారం(Thulabharam) అనే టైటిల్ పరిశీలనలో ఉందంటూ ఇండస్ట్రీలో వార్తలు బయటకు వచ్చాయి. అదేవిధంగా ఈ సినిమాలో రవితేజకు జోడిగా ప్రియాంక అరుళ్ మోహన్ నటించబోతున్నట్టు సమాచారం.

Advertisement

ఇక ఈ సినిమాలో ప్రియాంక అరుళ్ మోహన్ తో పాటు అనస్వరరాజన్ కీలక పాత్రలో కనిపించబోతున్నారని తెలుస్తుంది. ఇక రవితేజకు విలన్ గా జె.డి చక్రవర్తి నటించబోతున్నారు. వీరిద్దరి కాంబినేషన్లో డాన్ శీను సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది .సుమారు 18 సంవత్సరాల తర్వాత మరోసారి వీరిద్దరి కాంబినేషన్ వెండి తెరపై కనిపించబోతుందని తెలుస్తోంది. ఈ విషయాలన్నింటికీ సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన రాబోతుంది. అయితే ఈ సినిమాని దసరా పండుగను పురస్కరించుకొని పూజా కార్యక్రమాలతో షూటింగ్ పనులు ప్రారంభం కాబోతున్నాయని సమాచారం.

Also Read: నాగచైతన్య వర్సెస్ నితిన్.. బాక్సాఫీస్ వార్ లో గెలిచేదెవరు?

Related News

రామాయణ నుండి బిగ్ అప్డేట్.. కైకేయి పాత్రలో స్టార్ హీరోయిన్!

నాగచైతన్య వర్సెస్ నితిన్.. బాక్సాఫీస్ వార్ లో గెలిచేదెవరు?

‘కామ్రేడ్ కళ్యాణ్’ పై ఫైర్ అవుతున్న మెగా ఫాన్స్.. ఆ డైలాగ్స్ కారణమా?

ఢిల్లీ హై కోర్టును ఆశ్రయించిన విజయ్ దేవరకొండ… వాటిని తొలగించాలంటూ!

సుమలతకి అనుకూలంగా హైకోర్టు.. అసోసియేషన్ ఎన్నికలకు బ్రేక్!

భయపడితే ముందుకు వెళ్లలేం… కత్రినా కైఫ్ కామెంట్స్ వైరల్!

మరో గోల్డెన్ ఛాన్స్ కొట్టేసిన మమితా బైజు.. ‘జై హనుమాన్’లో కీ రోల్!

Big Stories

Advertisement
×