Trisha Krishnan: ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద పెళ్లి కాని ప్రసాదులు, పెళ్ళికాని అమ్మాయిలు చాలామంది ఉన్నారు. అయితే కొంతమంది తమ మనసుకు నచ్చిన వారు దొరకక పెళ్లి చేసుకోలేదు అంటుంటే.. మరి కొంతమంది పెళ్లి అనే బంధానికి కట్టుబడి ఉండలేక పెళ్లి చేసుకోలేదు అంటున్నారు. అయితే ఇలా ఎవరికివారు సాకులు చెప్పినా.. అతను అభిమాన నటీనటుల పెళ్లి వేడుక కోసం అభిమానులు ఎంతగా ఎదురు చూస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే మరి కొంతమంది నిశ్చితార్థం చేసుకుని, ఆ తర్వాత పెళ్లి చేసుకోకుండా విడిపోయిన జంటలు కూడా ఉన్నాయి. అలాంటి జంటలలో త్రిష (Trisha) కూడా ఒకరు. 2015 లోనే నిశ్చితార్థం చేసుకొని పెళ్లి పీటలెక్కి ఈపాటికి పిల్లాపాపలతో సంతోషంగా ఉండాల్సిన త్రిష.. నేడు సోషల్ మీడియాలో విమర్శలు ఎదుర్కోవడం , ట్రోలింగ్ అనుభవించడం ఆమె అభిమానులు తట్టుకోలేకపోతున్నారు. అసలు త్రిష పెళ్లి ఎందుకు ఆగిపోయింది? నిశ్చితార్థం రోజు ఏం జరిగింది? అనే విషయాలు మళ్లీ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
2014లో త్రిష తన కెరీర్ పిక్స్ లో ఉండగానే చెన్నైకి చెందిన వ్యాపారవేత్త వరుణ్ (Varun ) తో నిశ్చితార్థం చేసుకుంది. ఈ విషయాన్ని 2015 జనవరిలో ఆమె స్వయంగా వెల్లడించింది. అయితే ఆ తర్వాత పెళ్లి పీటలు ఎక్కుతున్నారు అని అభిమానులు సంతోషపడే లోపే ఏం జరిగిందో తెలియదు కానీ కొన్ని నెలలకే జరగాల్సిన వివాహం కాస్త రద్దయింది. ఆ వ్యాపారవేత్త త్రిషను పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉండాలని షరతు పెట్టారని, ఆ కారణంగానే నిశ్చితార్థం రద్దు అయింది అనే కామెంట్లు అప్పట్లో జోరుగా వినిపించాయి. అటు త్రిష కూడా తాను సింగిల్ గా, సంతోషంగా ఉన్నాను అంటూ ఎన్నో ఇంటర్వ్యూలలో చెప్పుకొచ్చింది.
ఇకపోతే ఒకానొక ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ..” నేను పెళ్లి చేసుకోవాలనుకున్న వ్యక్తి నన్ను సినిమాలలో నటించడం ఆపమని అడిగారు. దానికి బదులుగా నిశ్చితార్థానికి ముగింపు పలకాలని నిర్ణయించుకున్నాను. నేను కేవలం గర్భవతి అయినప్పుడు మాత్రమే విరామం తీసుకుంటాను. ఒకవేళ నాకు హీరోయిన్ పాత్రలు ఆఫర్ చేయకపోయినా.. నా ఇమేజ్ కి సరిపడా పాత్రలు చేస్తాను. కానీ ఇండస్ట్రీకి మాత్రం దూరం కాను. నా చివరి శ్వాస వరకు నేను సినిమాలలోనే ఉండాలనేదే నా కోరిక” అంటూ త్రిష తన అభిప్రాయాన్ని తెలిపింది. మొత్తానికైతే నిశ్చితార్థం జరిగిన వెంటనే సినిమాలో మానేయమని చెప్పి ఉంటారు. అదే రోజు ఆమె ఈ కఠిన నిర్ణయం తీసుకోలేక కొంతకాలానికి తన నిర్ణయాన్ని నిర్భయంగా బయట పెట్టి నిశ్చితార్ధాన్ని క్యాన్సిల్ చేసుకుని ఉండుంటుంది అంటూ నెటిజన్స్ , అభిమానులు అభిప్రాయపడుతున్నారు.
also read:టాక్సిక్ మూవీపై హీరోయిన్ విమర్శలు!
ఇదిలా ఉండగా గతంలో ప్రముఖ టాలీవుడ్ హీరో రానా (Rana ), ప్రభాస్ (Prabhas) వంటి హీరోలతో రిలేషన్ కొనసాగిస్తున్నారనే వార్తలు జోరుగా వినిపించాయి. అయితే ఇప్పుడు గత కొంతకాలంగా ప్రముఖ కోలీవుడ్ స్టార్ హీరో, తమిళనాడు ముఖ్యమంత్రి విజయ దళపతి (Vijay Thalapathy) తో పలు కథనాలు ప్రచారంలో ఉన్నాయి. కానీ త్రిష మాత్రం సంయమనం పాటిస్తూ తనదైన శైలిలో స్పందిస్తూ దూసుకుపోతున్నారు. ఏది ఏమైనా 11 ఏళ్ళ క్రితమే జరగాల్సిన ఆ పెళ్లి సినిమా ఇండస్ట్రీ కోసమే ఆగిపోయిందనే విషయం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.