E-Paper
Advertisement

టాక్సిక్ మూవీపై హీరోయిన్ విమర్శలు!

టాక్సిక్ మూవీపై హీరోయిన్ విమర్శలు!
Advertisement

Toxic Movie Yash:ఒకప్పుడు టీవీ సీరియల్స్ చేస్తూ తన కెరీర్ ను ఆరంభించిన యశ్ (Yash)… ఆ తర్వాత హీరోగా మారి సినిమాలు చేయడం మొదలుపెట్టాడు. కన్నడ ఇండస్ట్రీలో ప్రాంతీయంగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తూ వచ్చిన ఈయన.. సడన్గా ప్రశాంత్ నీళ్ (Prashanth Neel) దర్శకత్వంలో కేజీఎఫ్ (KGF) సినిమా చేసి ఒక్కసారిగా సంచలన విజయం అందుకున్నారు.. ముఖ్యంగా ఈ ఒక్క సినిమా ఆయనను పాన్ ఇండియా స్టార్ గా మార్చేసింది. ఆ తర్వాత వచ్చిన కేజిఎఫ్ 2 ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద అత్యధిక కలెక్షన్లు రాబట్టింది. రెండేళ్లు గ్యాప్ తీసుకొని మళ్ళీ ఇప్పుడు ఒక విభిన్న కథాంశంతో టాక్సిక్ (Toxic) అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

యశ్ టాక్సిక్ పై అంచనాలు తారాస్థాయికి..

ఈ ఏడాది మార్చిలోనే ఈ సినిమా ప్రేక్షకులు ముందుకు రావాల్సి ఉండగా.. పలు కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు ఆగస్టు 26వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఇప్పటికే వరుస ప్రమోషన్స్ మొదలుపెట్టిన విషయం తెలిసిందే. ముఖ్యంగా మలయాళ లేడీ డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ (Geethu Mohan Das) దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ కమర్షియల్ సినిమాలో కియారా అద్వానీ (Kiara Advani) మెయిన్ హీరోయిన్ గా నటిస్తుండగా.. నయనతార (Nayanthara ), తారా సుతారియా (Tara sutharia), రుక్మిణి వసంత్(Rukmini Vasanth) , హుమా ఖురేషి(Huma Qureshi) తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. కన్నడ, ఇంగ్లీష్ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రం హిందీ, తెలుగు, తమిళ్, మలయాళం భాషలలో డబ్బింగ్ వెర్షన్ తో ప్రేక్షకుల ముందుకు రానుంది..

టాక్సిక్ మూవీపై విరుచుకుపడ్డ హీరోయిన్..

Advertisement

ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన పాటలు, ట్రైలర్, టీజర్ అన్నీ కూడా సినిమాపై అంచనాలు పెంచేసాయి . ముఖ్యంగా ఈ సినిమా నుండి హీరోయిన్స్ తో రొమాంటిక్ సాంగ్స్ విడుదల చేయగా.. దీనిపై విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. అలాంటి సమయంలో సినిమా కథపై మేకర్స్ చేసిన కామెంట్లు ఆసక్తిని కలిగిస్తున్నాయి. అయితే ఇలాంటి సమయంలో తాజాగా ఒక హీరోయిన్ టాక్సిక్ పై విమర్శలు గుప్పించడమే కాకుండా కన్నడ ఇండస్ట్రీ నుండి యశ్ పారిపో అంటూ చేసిన కామెంట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. మరి ఆమె ఎవరు? ఎందుకు ఇలాంటి కామెంట్లు చేస్తోంది? అసలేం జరిగింది? అనే విషయం ఇప్పుడు చూద్దాం.

also read:బండ్ల గణేష్ ఇంట మొదలైన పెళ్లి సందడి.. ఘనంగా హల్దీ వేడుక!

కన్నడ ఇండస్ట్రీ వదిలి పారిపో – రిషిక సింగ్

Advertisement

ఆమె ఎవరో కాదు ప్రముఖ నటి రిషిక సింగ్ (Rishika Singh) .. ఈ సినిమాలో అభ్యంతరకరమైన అలాగే ఇంటిమేట్ సన్నివేశాలు చాలా ఉన్నాయి అంటూ ఆమె తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ విషయంపై ఒక వీడియో సందేశాన్ని కూడా ఆమె విడుదల చేశారు. అందులో హీరో యశ్ ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్నాయి. “కన్నడ సంస్కృతి , మహిళల పట్ల హుందాగా గౌరవంతో వ్యవహరించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్న విషయాన్ని గుర్తించుకోవాలి. సమాజంలో ఎంతో మందికి ఆదర్శంగా ఉండే యశ్.. అసలు ఇలాంటి పాత్రను ఎలా అంగీకరించాడు.. యశ్ నువ్వు కర్ణాటక విడిచిపెట్టి వెళ్ళిపో” అంటూ తనదైన మాటలతో విరుచుకు పడిపోయింది. మొత్తానికి అయితే రిషిక సింగ్ చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ముఖ్యంగా ఆమె వ్యాఖ్యలపై యశ్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ అభిమాన హీరో పై అనవసర విమర్శలు చేయొద్దంటూ మండిపడుతున్నారు. ఏది ఏమైనా రిషికా సింగ్ చేసిన ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

Related News

11 ఏళ్ల క్రితం ఆగిపోయిన త్రిష పెళ్లి.. నిశ్చితార్థం రోజు ఏం జరిగిందో తెలుసా?

‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ట్విట్టర్ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే..?

గాయాలతో హీరోయిన్.. ఫ్యాన్స్ ఆందోళన.. ఏం జరిగిందంటే..?

Theater Movies : ఇవాళ థియేటర్లలోకి రాబోతున్న సినిమాలు.. ఆ రెండు డోంట్ మిస్..

ఒక్క సినిమా కెరీర్ మొత్తం మార్చేసింది.. ఇప్పుడు ఆమె రేంజ్ ఇదే!

రిలీజ్‌కు ముందే జైలర్ 2 రికార్డ్.. ఓటీటీ రైట్స్‌కు కళ్లు చెదిరే ధర!

రామ్ గోపాల్ వర్మతో సినిమా చేయడం వల్లే..తేజస్విని మదివాడ వైరల్ కామెంట్స్ !

Big Stories

Advertisement
×