Pawan Vs Balayya: కూటమిలోని కుంపటి మొదలయ్యిందా.. ? పవన్ మాటకు విలువ లేదా.. ? ఏడాదికే పవన్ పవర్ తగ్గిందా.. ? అంటే సోషల్ మీడియాలో నిజమే అని మాట్లాడుకుంటున్నారు. అంతలా ఏం జరిగింది.. ? పవన్ మాట ఎవరు కాదన్నారు.. ? అని అంటే.. ఇంకెవరు నందమూరి బాలకృష్ణ పవన్ కే ఎదురుతిరుగుతున్నాడు అని అంటున్నారు. ఏ విషయంలో అంటే.. పవన్ ఎంతో ఆలోచించి, చంద్రబాబును వద్ద కూడా సలహా తీసుకొని మరీ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫిల్మ్, టెలివిజన్ & థియేటర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (APFDC) ఛైర్మన్‌గా ప్రముఖ తెలుగు నిర్మాత ఏ.ఎం.రత్నం పేరును డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రతిపాదించిన విషయం తెల్సిందే.
హరిహర వీరమల్లు ప్రెస్ మీట్ లో పవన్ మాట్లాడుతూ.. ” ఏ.ఎం.రత్నంను APFDC చైర్మన్‌గా నేను ప్రతిపాదించాను. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కూడా ఈ విషయం చెప్పాను. ఆయన నా నిర్మాత అని మాత్రమే కాదు, అందరి హీరోలతో సినిమాలు చేసిన వ్యక్తి, పాన్-ఇండియా స్థాయిలో పరిచయాలు ఉన్నాయి” అని చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా ఈ పదవి ఏపీలో సినిమా ఇండస్ట్రీ అభివృద్ధికి కీలకమైనది, మరియు రత్నం అనుభవం ఆధారంగా ఈ ప్రతిపాదన వచ్చిందని కూడా ఆయన చెప్పుకొచ్చారు.
ఇక కూటమిలో పవన్ మాటకు తిరుగులేదు. ఆయన ఆలోచించే నిర్ణయం తీసుకుంటాడని చంద్రబాబు నమ్మకం. అందుకే ఏఎం రత్నం ఎంపిక లాంఛనమే అని అనుకున్నారు. అంతా బావుంది అనుకొనేలోపు పెద్ద ట్విస్ట్ వచ్చింది. అదేంటంటే.. APFDC చైర్మన్ గా నందమూరి బాలకృష్ణ మరో వ్యక్తిని ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. అతను అయితే.. ఇంకా బావుంటుందని, అతను కూడా చాలా సమర్థుడు కావడంతో.. బాలయ్య ఆయన పేరును ప్రతిపాదించాడని సమాచారం.
ఇక దీంతో ఈ విషయంలో పవన్ వర్సెస్ బాలయ్య గా మారిపోయింది. మొదటి నుంచి పవన్.. అధికారికంగా మీడియా ముందే తన ప్రతిపాదన పెడితే.. అన్ని తెలిసి కూడా బాలయ్య మరో వ్యక్తిని ఎలా ప్రతిపాదిస్తాడు. అంటే పవన్ మాటను బాలయ్య గౌరవించలేదా.. ? లేదా నా మాటనే నెగ్గించుకోవాలని చూస్తున్నాడా.. ? అనేది ప్రస్తుతం అభిమానులను తొలుస్తున్న ప్రశ్న. సరే బాలయ్య మాట నెగ్గితే .. పవన్ మాట పరిస్థితి ఏంటి.. ? మీడియా ముఖంగా ఏఎం రత్నం పేరు చెప్పి.. ఆయనకు లేనిపోని ఆశలు రేపి.. అందరూ ఆయనే APFDC చైర్మన్ అనుకున్న తరువాత వేరొకరిని ఆ పదవిలో కూర్చోపెడితే.. ఆయనకు గౌరవం ఉంటుందా.. పవన్ పరువు నిలుస్తుందా.. ? అని అభిమానులు ఆలోచిస్తున్నారు. మరి ఇందులో నిజమెంత అనేది తెలియాలంటే APFDC చైర్మన్ ఎవరు అనేది అధికారికంగా తెలిసేవరకు ఆగాల్సిందే.