E-Paper
Advertisement

టాక్సిక్ ప్లాప్.. చేతిలో మాత్రం భారీ ప్రాజెక్టులు! యష్ లెక్కేంటో?

టాక్సిక్ ప్లాప్.. చేతిలో మాత్రం భారీ ప్రాజెక్టులు! యష్ లెక్కేంటో?
Advertisement

Yash Next Movies:అసలు చూస్తామా లేదా అనుకున్న కన్నడ ఇండస్ట్రీకి ఏకంగా వెయ్యి కోట్ల వసూళ్ళని kgf2తో చూపించాడు యష్.ఇంకేం దెబ్బకి ఇమేజ్ ఆకాశాన్ని తాకడంతో ఏకంగా 400కోట్ల భారీ బడ్జెట్ తో టాక్సిక్ అంటూ ప్యాన్ ఇండియా మూవీకి తెరతీశాడు.

గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో, kvn బ్యానర్ పై వచ్చిన ఈ సినిమా అంచనాలు కూడా ఒక రేంజ్ లో పెరిగిపోయాయి కూడా.కానీ సినిమా ఊహించని విధంగా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది.ఎదో చూద్దాం అని వచ్చిన ఆడియన్స్ కి మరేదో చూపించాడు యష్.దీంతో సినిమా వచ్చిన పది రోజుల్లోపే బాక్సులు సర్దేసే పరిస్థితి.అయితే ఇంత లో ఫేజ్ లో కూడా యష్ కి వరుస సినిమాలు క్యూ కడుతుండటం ఇక్కడ గమనార్హం.

Advertisement

పీఎస్ మిత్రన్‌

ముఖ్యంగా వీటన్నింటిలో ప్రముఖంగా వినిపిస్తున్న పేరు పీఎస్ మిత్రన్‌. ‘ఇరుంబుతిరై’, ‘హీరో’, ‘సర్దార్’ వంటి సినిమాలతో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న ఈ కోలీవుడ్ డైరెక్టర్ యష్ తో జోడీ కట్టబోతున్నాడని, పైగా యష్ కోసం ఓ భారీ యాక్షన్ అడ్వెంచర్ కథను సిద్ధం చేశారనే టాక్ ఇపుడు ఫిలిమ్ సర్కిల్స్ లో వినిపిస్తుంది.

Advertisement

ఈ సినిమా ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో జరగనుందని, ఇందులో సర్వైవల్ ఎలిమెంట్స్, యాక్షన్‌ ఒక రేంజ్ లో ఉంటాయన్న టాక్ వినిపిస్తుంది.అయితే తాజాగా సూర్యతో వచ్చిన సర్దార్ 2 మాత్రం ఆశించిన స్థాయిలో వసూల్లని రాబట్టలేకపోతుంది.మరి ఈ పరిస్థితుల్లో వినిపిస్తున్నట్టుగా మిత్రన్ తో సినిమా నిజంగానే ఉంటుందా లేక రూమర్ గానే మిగిలిపోతుందా చూడాలి.

హేమంత్ రావు

ఇక ఇదే లిస్టు లో వినిపిస్తున్న మరో పేరు హేమంత్ రావు ..ఎవరనుకుంటున్నారా …కన్నడలో ‘సప్త సాగరదాచే ఎల్లో’ వంటి ఎమోషనల్ హిట్ తీసింది ఈయనే. వీరిద్దరి కాంబినేషన్‌లో ఓ పీరియడ్ డ్రామా రావచ్చనే ప్రచారం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.సరికొత్త టైమ్ బ్యాక్ డ్రాప్ లో రానున్న ఈ సినిమా యష్ కి సెట్ అయితే మాత్రం ఆడియన్స్ కి మరో యష్ కనిపించినట్టే.

దిల్ రాజు ప్రొడ్యూసర్ గా 

ఇక ఈ లిస్టు లో డైరెక్టర్ కాకుండా క్రేజీగా టాలీవుడ్ ప్రొడ్యూసర్ దిల్ రాజు పేరు వినిపిస్తుండటం ఇక్కడ గమనార్హం.పైగా యష్ టాక్సిక్ సినిమాని తెలుగులో భారీ రేటు పెట్టి తీసుకుంది దిల్ రాజే .మరి చక్కర్లు కొడుతున్నట్టుగా దిల్ రాజు యష్ తో చేయబోయే సినిమాకి దర్శకుడు ఎవరో ,అప్ డేట్స్ ఎప్పుడు బయటపెడతారో చూడాలి.

ఆదిత్య ధర్

ఇక యష్ జోడీ కడతాడని వినిపిస్తున్న మరో పేరు ఆదిత్య ధర్. బాలీవుడ్‌లో ‘ఉరి: ది సర్జికల్ స్ట్రైక్’తో సాలిడ్ హిట్ కొట్టి దురంధర్ సిరీస్ తో ఇండియన్ బాక్సాఫీస్ ని గడగడలాడించిన ఆదిత్య ధర్ తన తర్వాతి సినిమాని యష్ తో చేసే అవకాశం ఉందని వినిపిస్తుంది.

మోహిత్ సూరి

ఇక వీరు సరిపోరన్నట్టు గ్యాంగ్‌స్టర్ బ్యాక్‌డ్రాప్‌లో మోహిత్ సూరి కూడా ఒక సినిమాని యష్ తో దర్శకత్వం చేస్తానంటూ రెడీ అవుతున్నాడట .పైగా దీనికి రామ్ గోపాల్ వర్మ స్టోరీ అందించబోతున్నాడని వినిపిస్తుంది.

ALSO READ:సీరియల్‌లో నటించేది కొన్ని గంటలే.. కానీ రెమ్యునరేషన్ మాత్రం వేలల్లో!

చూడాలి మరి ప్రస్తుతం నితీష్ తివారీ దర్శకత్వంలో రామాయణం సినిమాలో నటిస్తున్న యష్ తార్వాటి సినిమాగా వీటిలో దేనికి ఓటు వేస్తాడో !

Tags

Related News

అఖిల్ నెక్స్ట్ మూవీస్ లిస్ట్ ఇదేనా? ఒక్కోటి ఒక్కో రేంజ్!

ఆ తమిళ డైరెక్టర్ తో సినిమా చేయటం డ్రీమ్..నాని కల నెరవేరేనా?

ప్యారడైజ్ విషయంలో కీర్తి సురేష్ సీరియస్.. అసలు మ్యాటర్ చెప్పిన నాని!

పిల్లలు పుట్టాక మీ భార్యలను వదిలేస్తారా? మాధవీలత ఘాటు వ్యాఖ్యలు

సంక్రాంతి రేసులోనే ‘కాకా’ మేకర్స్ క్లారిటీ.. ‘విశ్వంభర’ వెనక్కి తగ్గాల్సిందేనా!

బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన ‘గబ్బర్ సింగ్’ రమేష్.. ఇప్పుడు ఎలా ఉన్నారంటే?

40ల్లోనూ తగ్గని అందం.. అనసూయ గ్లామర్ లుక్స్ వైరల్!

Big Stories

Advertisement
×