Telugu Serial Actors Remuneration:సినిమా హీరోహీరోయిన్లకు ఏ రేంజ్ క్రేజ్ ఉందో, ఇప్పుడు మన టీవీ సీరియల్ నటీనటులకు కూడా అంతే స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతోంది. సాయంత్రం కాగానే వరుస సీరియల్స్ తో ఫ్యామిలీ ఆడియన్స్ ని ఫుల్ గా ఎంటర్ టైన్ చేస్తుంటారు మరి.
మరింతకీ వీళ్లు రోజూ కెమెరా ముందు కనిపించేది కొద్దిసేపే అయినా, అసలు రోజుకు ఎంత పారితోషికం తీసుకుంటారు? నెలకు ఎంత సంపాదిస్తారు? అనే క్యూరియాసిటీ ఆడియన్స్ లో ఉండటం సహజం.
వంటలక్క విషయానికి వస్తే
ఇక ప్రస్తుతం బుల్లితెరని ఏలుతున్న వంటలక్క విషయానికి వస్తే ఈవిడ నటించిన ‘కార్తీక దీపం’ సీరియల్ ఇచ్చిన ఇంపాక్ట్ అంతా ఇంతా కాదు. అందులో వంటలక్క పాత్రలో ప్రేమి విశ్వనాథ్ తెచ్చుకున్న పాపులారిటీ దాదాపు ఒక స్టార్ హీరోయిన్ కి సమానమైన క్రేజ్ అంటే ఆశ్చర్యం లేదు. ఆమెతో పాటు డాక్టర్ బాబుగా నటించిన నిరుపమ్ పరిటాలకి కూడా ఆడియన్స్ లో మంచి ఇమేజే సొంతం చేసుకున్నాడు.
ఆడియన్స్ లో సెపరేట్ ఫ్యాన్ బేస్
ఇక నవ్య స్వామి, ప్రియాంక జైన్, శోభా శెట్టి లాంటి వాళ్లు సీరియల్స్‌తో పాటు వివిధ రియాలిటీ షోల ద్వారా సాలిడ్ గుర్తింపుని తెచ్చుకున్నవాళ్ళే .ముఖ్యంగా శోభా శెట్టి విలన్ పాత్రలు చేసినప్పటికీ, తన నటనతో ఆడియన్స్ లో సెపరేట్ ఫ్యాన్ బేస్ ని సొంతం చేసుకోవడం విశేషం.
సీనియర్స్ కూడా ఇపుడు వరుస సీరియల్స్ లో
ఇక కేవలం కొత్తవాళ్లే కాకుండా, ఒకప్పుడు వెండితెరపై హీరోయిన్లుగా కనిపించిన కస్తూరి శంకర్, రాశి, సుహాసిని లాంటి సీనియర్స్ కూడా ఇపుడు వరుస సీరియల్స్ లో అలరిస్తున్న వారే. సినిమాల్లో వీరికున్న అనుభవం ఇక్కడ ప్లస్ అని చెప్పాలి.
ఇక సమీరా షరీఫ్ నటిగా మాత్రమే కాకుండా సీరియల్స్ నిర్మాతగానూ తనదైన ముద్ర వేసేందుకు ప్రయత్నిస్తుంది. అలాగే మానస్ నాగులపల్లి, అమర్‌దీప్ చౌదరి లాంటి యంగ్ హీరోలకు కూడా ఇప్పుడు బుల్లితెరపై మంచి డిమాండ్ ఉన్న వాళ్ళే.ముఖ్యంగా బిగ్ బాస్ వంటి ఎంటర్ టైనింగ్ షో లలో వీళ్ళు కనిపించడంతో వీళ్ల ఫాలోయింగ్ మరింత రెట్టింపైందనే చెప్పాలి.
దాదాపు రూ.4 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు
అయితే ఈ బుల్లితెర స్టార్స్ రోజుకు ఎంత సంపాదిస్తున్నారనే విషయానికి వస్తే బుల్లి తెరపై వాళ్ళు నటించే సీరియల్ కి ఉన్న trp ఆధారంగా,ఆడియన్స్ లో వారికి ఉన్న క్రేజ్ రోజుకి దాదాపు 40వేల రూ.30 వేలు లేదా అంతకంటే ఎక్కువ మొత్తంలోనే పారితోషికం చెల్లిస్తుంటారని సోషల్ మీడియాలో వినిపిస్తూ ఉంటుంది.
అంటే ఒక నెలలో 20 నుండి ఉదాహరణకు ఒక నటుడికి రోజుకు రూ.20 వేల పారితోషికం ఉందనుకుంటే, నెలలో 20 నుంచి 25 రోజులు షూటింగ్ చేస్తే దాదాపు రూ.4 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు ముడుతుందన్న మాట.పైగా బయట జరిగే ఈవెంట్స్ ,షోస్,లలో వచ్చే ఆధాయం బోనస్ అనే చెప్పాలి.
అంటే బయటకు చూసేవాళ్లకు రోజూ కొద్దిసేపే పని చేస్తున్నట్టు అనిపించినా నెల చివర్లో వారికి వచ్చే అమౌండ్ సాలిడ్ గా ఉంటుందన్న మాట.అయితే ఇది అఫీషియల్ గా కాదు ..కేవలం సోషల్ మీడియా లో వైరల్ అవుతున్న వార్తగానే చూడాలి.
గంటల్లోనే వేలల్లో
మొత్తానికి ప్రేమి విశ్వనాథ్, నిరుపమ్, నవ్య స్వామి, ప్రియాంక జైన్, శోభా శెట్టి, కస్తూరి, రాశి, సుహాసిని, సమీరా షరీఫ్, మానస్, అమర్‌దీప్ లాంటి ఎంతోమంది నటీనటులు తమ తమ క్రేజ్ తో గంటల్లోనే వేలల్లోనే సంపాదిస్తున్నారన్న మాట !
ALSO READ:యాంకర్‌గా ఉదయభాను కెరీర్ అలా మొదలైందా? సడన్‌గా గుడ్‌బై ఎందుకు చెప్పింది?