E-Paper
Advertisement

పల్లెటూర్లో టీనేజర్ల సీక్రెట్ లవ్.. ఇంట్లో తెలిసిపోవడంతో ఊహించని ట్విస్ట్.. తెలుగు మూవీనే

పల్లెటూర్లో టీనేజర్ల సీక్రెట్ లవ్.. ఇంట్లో తెలిసిపోవడంతో ఊహించని ట్విస్ట్.. తెలుగు మూవీనే
Advertisement

Telugu Teen Love Drama: టీన్‌ ఏజ్‌లో వచ్చే ఆకర్షణను ప్రేమగా భావిస్తే ఏం జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సరైన అవగాహన లేకుండా తీసుకునే ఒక్క నిర్ణయం ఇద్దరి జీవితాలనే కాదు… రెండు కుటుంబాల భవిష్యత్తును కూడా మార్చేస్తుంది. పిల్లల పెంపకంలో తల్లిదండ్రులు చేసే చిన్న పొరపాట్లు ఎంత పెద్ద సమస్యలకు దారి తీస్తాయి అనే పాయింట్ తో పాటు టీనేజ్ ప్రేమ, కుటుంబ భావోద్వేగాలు, బాధ్యతల చుట్టూ తిరిగే కథే ‘హుషార్ పిట్టలు’ (Hushar Pittalu). మరి ఈ టీనేజ్ లవ్ డ్రామాను ఏ ఓటీటీలో చూడవచ్చు ? అనేది తెలుసుకుందాం పదండి.

కథలోకి వెళ్తే…

ఒక పల్లెటూరిలో పదో తరగతి పూర్తి చేసిన రవి ఇంటర్మీడియట్‌లోకి అడుగు పెడతాడు. ఇదే ఊరిలో గీత కార్మికుడిగా జీవించే గోవర్ధన్ తన కూతురు చిట్టిని ఎంతో గారాబంగా పెంచుతాడు. చిన్నప్పటి నుంచి పెద్దల పర్యవేక్షణలో పెరిగిన చిట్టికి టీనేజ్ వయసులోకి వచ్చేసరికి రవిపై ఆకర్షణ మొదలవుతుంది. ఆ ఆకర్షణ ఎప్పుడు ప్రేమగా మారిందో వాళ్లకే తెలియదు. వయసుకు తగ్గ అవగాహన లేకపోవడం, చుట్టూ ఉన్న పరిస్థితులను సరిగ్గా అర్థం చేసుకోలేకపోవడం వల్ల ఇద్దరూ రహస్యంగా కలుసుకోవడం మొదలు పెడతారు.

Advertisement

మొదట సరదాగా మొదలైన వ్యవహారం క్రమంగా తీవ్రమైన నిర్ణయాలకు దారి తీస్తుంది. కుటుంబ సభ్యులకు తెలియకుండా తమ ప్రపంచంలో తామే మునిగిపోయిన ఈ ఇద్దరికీ… తాము చేస్తున్న పనికి భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయనే ఆలోచన ఉండదు. కానీ ఒక దశలో వీరి రహస్య సంబంధం బయట పడుతుంది. అప్పటికే పరిస్థితి చేయి దాటిపోతుంది. చిట్టి గర్భవతి అని తెలిసిన క్షణం రెండు కుటుంబాలపై ఒక్కసారిగా పిడుగు పడినట్టవుతుంది. తమ పిల్లల విషయంలో అంతా బాగానే ఉందనుకున్న తల్లిదండ్రులకు అసలు విషయం తెలిసిన తర్వాత ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఏర్పడుతుంది.

ఇక్కడి నుంచి కథ కేవలం రవి, చిట్టి ప్రేమకథగా ఉండదు. పిల్లలకు స్వేచ్ఛ ఇవ్వడం, వారితో మాట్లాడటం, వాళ్లకు సరైన అవగాహన కల్పించడం ఎంత ముఖ్యమో తెలిసేలా చేస్తుంది మూవీ. ఇంట్లో పెద్దలు మాట్లాడే మాటలు, పిల్లల ముందు చేసే పనులు కూడా వాళ్ల ఆలోచనలపై ప్రభావం చూపుతాయనే అంశాన్ని కూడా ఇందులో చూపించారు. తాము చేసిన తప్పు తీవ్రతను అర్థం చేసుకున్న రవి, చిట్టి తర్వాత ఏ నిర్ణయం తీసుకున్నారు ? తమ పిల్లల జీవితాల్లో జరిగిన ఈ పరిణామాన్ని తల్లిదండ్రులు ఎలా ఎదుర్కొన్నారు ? ఈ సమస్య నుంచి ఆ కుటుంబాలు ఎలా బయట పడ్డాయి ? చివరికి ఈ టీనేజ్ జంటకు ఎదురైన పరిస్థితి ఏంటి ? క్లైమాక్స్‌లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే ‘హుషార్ పిట్టలు’ను పూర్తిగా చూడాల్సిందే.

ప్రైమ్ వీడియోలో తెలుగులో ఉందా ?

Advertisement

‘హుషార్ పిట్టలు’ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video)లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇది ఒరిజినల్ తెలుగు సినిమా కావడంతో తెలుగు ఆడియోలోనే చూడొచ్చు. వాసవి గణేషన్ (Vasavi Ganesan), అన్ష్ (Ansh), గోవర్ధన్ రెడ్డి, రమేష్ నకిరేకంటి కీలక పాత్రల్లో నటించారు. బిక్షు యాదవ్ (Bikshu Yadav) దర్శకత్వం వహించగా, చరణ్ అర్జున్ (Charan Arjun) సంగీతం అందించారు. టీనేజ్‌లో తీసుకునే నిర్ణయాలు, కుటుంబ బాధ్యతలు, తల్లిదండ్రుల పెంపకం వంటి అంశాలపై ఆలోచింపజేసే కథ ఇది. డోంట్ మిస్.

Read Also: లాటరీలో వందల కోట్లు.. ఉద్యోగానికి రాజీనామా చేయకుండా ఆఫీస్‌‌లో అరాచకం, తెలుగులోనూ ఉంది

Related News

డ్యూటీలో ప్రాణాలు పణంగా పెట్టే స్పై ఏజెంట్లు.. ట్విస్టులతో మైండ్ బ్లాక్ చేసే థ్రిల్లర్

ఈజిప్ట్ ఎడారిలో విగతజీవిగా చిన్నారి.. మమ్మీగా ఇంట్లోకి ఎంట్రీ.. దాన్ని ముట్టుకుంటే పోతారు!

లాంగ్ డిస్టెన్స్ లవ్ స్టోరీ.. ప్రేమికులు మిస్ అవ్వకుండా చూడాల్సిన రొమాంటిక్ డ్రామా

పచ్చని సంసారంలో నిప్పులు పోసే కేర్‌టేకర్.. డార్క్ సీక్రెట్స్ తో దడ పుట్టించే థ్రిల్లర్

గ్యాంగ్‌స్టర్లకు చుక్కలు చూపించే అండర్‌కవర్ టీమ్.. హై-వోల్టేజ్ యాక్షన్-కామెడీ డ్రామా సిరీస్

కన్న తల్లిదండ్రులని చంపేసే లేడీ సైకో.. ఒళ్ళు గగుర్పొడిచే రియల్ స్టోరీ తెలుగులో!

మిత్రుడి మరణం.. ప్రైవేట్ ఇన్వెస్టిగేటర్‌ ఎంట్రీతో మతిపోగొట్టే ట్విస్ట్

Big Stories

Advertisement
×