E-Paper
Advertisement

సీజేఐ సూర్యకాంత్‌పై వివాదాస్పద పోస్ట్.. కేరళ కాంగ్రెస్‌కు సుప్రీంకోర్టు నోటీసులు!

సీజేఐ సూర్యకాంత్‌పై వివాదాస్పద పోస్ట్.. కేరళ కాంగ్రెస్‌కు సుప్రీంకోర్టు నోటీసులు!
Advertisement

Supreme Court: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్‌ ను లక్ష్యంగా చేసుకుని సామాజిక మాధ్యమాలలో వివాదాస్పద పోస్ట్ పెట్టినందుకు కేరళ కాంగ్రెస్ కమిటీ ఆఫీస్ బేరర్లందరికీ అత్యున్నత న్యాయస్థానం కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది. అక్టోబర్ 12న కేరళ కాంగ్రెస్ అధికారిక ఎక్స్ ఖాతా నుంచి సీజేఐను విమర్శిస్తూ పోస్ట్ పెట్టడం తీవ్ర కలకలం రేపింది.

ఆ పోస్ట్ లో ‘డియర్ సూర్యకాంత్.. లా అండ్ ఆర్డర్ మీ పరిధి కాకపోతే ఇప్పుడే రాజీనామా చేయండి. దీన్ని హ్యాండిల్ చేయగల మీ స్థానంలోకి తేవటానికి మరొకరిని మేం వెతుక్కుంటాం’ అంటూ కేరళ కాంగ్రెస్ ఎక్స్ ఖాతాలో రాసుకొచ్చారు. తీవ్ర విమర్శల తర్వాత ఆ పోస్టును డిలీట్ చేశారు.

Advertisement

దీనిపై సుప్రీం కోర్టు న్యాయమూర్తులు జస్టిస్ అరవింద్ కుమార్, జస్టిస్ విపుల్ ఎం పంచోలితో కూడిన ధర్మాసనం తీవ్రంగా స్పందించింది. న్యాయవ్యవస్థ స్వతంత్రతను రాజకీయ సౌలభ్యంగా భావించలేమని, రాజ్యాంగమే అత్యున్నతమైనదని స్పష్టం చేసింది. అయితే ఈ పోస్టును ఆఫీస్ బేరర్ల అనుమతి లేకుండా పార్టీ కార్యకర్త విజయ్ తోట్టథిల్ చేశాడని కాంగ్రెస్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. అతడ్ని తొలగించడమే కాకుండా కేరళం ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు సన్నీ జోసెఫ్ బేషరతు క్షమాపణలు కోరినట్టు కోర్టుకు తెలిపారు.

Also Read: కర్ణాటకలో E20 పెట్రోల్ కల్తీ.. 20 శాతానికి బదులు 31% ఇథనాల్.. ఆధారాలతో బయటపెట్టిన మంత్రి!

Advertisement

అయితే ఈ క్షమాపణలు మనస్ఫూర్తిగా ఉన్నాయా లేదా అన్నది పరిశీలిస్తామని ధర్మాసనం పేర్కొంది. ఈ క్రమంలో కేసు పరిశీలకులుగా సీనియర్ న్యాయవాదులు అరవింద్ దాతర్, సిద్ధార్థ్ అగర్వాల్‌ లను ‘అమికిస్ క్యూరీ’గా నియమించింది. ఈ కేసులో అటార్నీ జనరల్ ఆర్. వెంకటరమణి సాయాన్ని కూడా ధర్మాసనం కోరింది. తదుపరి విచారణను డిసెంబర్ 15కి వాయిదా వేసింది.

Also Read: భూమికి మరో చంద్రుడు.. రహస్యంగా చక్కర్లు కొడుతూ, ఎట్టకేలకు దొరికేశాడు!

Tags

Related News

‘పేదలు కాలుష్యం చేయరు.. ధనికులే అసలు కారణం’.. ఢిల్లీ పొల్యూషన్‌పై సుప్రీంకోర్టు సంచలనం!

సోనియా గాంధీ ఓటు హక్కు కేసులో బిగ్ ట్విస్ట్.. ఢిల్లీ కోర్టు కీలక ఉత్తర్వులు!

26/11 తరహా దాడికి స్కెచ్.. స్కూబా డైవర్లుగా లష్కరే ఉగ్రవాదులకు ట్రైనింగ్!

కర్మభూమి ఎక్స్‌ప్రెస్‌లో భారీ అగ్నిప్రమాదం.. 4 బోగీల్లో ఎగిసిపడిన మంటలు!

ఇది భారత్ లేకుంటే బంగ్లాదేశా? బాబోయ్.. ఈ రష్ ఏంటి? రైల్వేశాఖ ఏం చేస్తోంది?

ఒకే కుటుంబంలో ఏడుగురి హత్య.. బెంగళూరులో షాకింగ్ ఘటన, ఏడేళ్ల బాలుడితోపాటు..

ఇండియన్ బ్యాంక్‌లో 1,500 జాబ్స్.. డిగ్రీ ఉంటే చాలు..వెంటనే అప్లై చేయండి

Big Stories

Advertisement
×