palak tivari:పాలక్ తివారి.. బాలీవుడ్ యంగ్ బ్యూటీగా క్రేజ్ కొట్టేసిన ఈ ముద్దుగుమ్మ తనదైన అందంతో సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. ఎప్పటికప్పుడు సరికొత్త ఫ్యాషన్ లుక్స్ తో ఫ్యాన్స్ ని ఫిదా చేసే ఈ అమ్మడు తాజాగా షేర్ చేసిన ఫోటోలను చూస్తుంటే నిజంగానే పెయింటింగ్ చూస్తున్నామా అంటూ కామెంట్ వదులుతున్నారు నెటిజన్లు.
ఇక ట్రెడిషనల్ కాస్ట్యూమ్స్ లో ఒంటినిండా జువెలరీ తో పాలక్ ఇచ్చిన ఫోజులు ఆడియన్స్ ని మె స్మరైజ్ చేస్తున్నాయి. ఇక ఈ ఫోటోలని షేర్ చేస్తూ ఫెల్ట్ లైక్ పెయింటింగ్ అంటూ క్యాప్షన్ పెట్టడం ఇక విశేషం .ఈ ఫోటోలో ముఖ్యంగా గ్రీన్ కలర్ షేడ్స్ తో ఉన్న ట్రెడిషనల్ డ్రెస్ కి మ్యాచింగ్ గా జువెలరీ ధరించిన ఈ ముద్దుగుమ్మ రాజకుమారిలా కనిపిస్తుంది అంటే ఆశ్చర్యం లేదు .
ముఖ్యంగా వదిలేసిన హెయిర్ స్టైల్, క్యూట్ లుక్స్ తో ఇచ్చిన ఫోజులు ఫోటోలకి మరింత అందాన్ని తీసుకొచ్చాయని చెప్పాలి .సాధారణంగా సెలబ్రిటీల ఫోటోషూట్స్ అంటే భారీ సెట్స్, రకరకాల లైటింగ్స్ ,డిఫరెన్స్ కాస్ట్యూమ్స్ ఉంటాయి అన్న సంగతి తెలిసిందే .కానీ ఈ ఫోటోలో మాత్రం ఒక పాత కాలపు రాజభంలో కూర్చున్న యువరాణి లా కనిపిస్తుంది పాలక్ .మొత్తానికి గ్లామర్ గా కనిపించాలంటే చేయాల్సిన హడావిడి చేయాల్సిన అవసరం లేని సింపుల్ గా కూడా కనిపించవచ్చని ప్రూవ్ చేసింది .
ఇక పాలక్ కెరీర్ విషయానికి వస్తే ప్రముఖ టెలివిజన్ స్టార్ శ్వేతా తివారి కుమార్తెగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ తల్లి క్రేజ్ ని నమ్ముకోకుండా తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకోవాలని ప్రయతించడం విశేషం.
2021లో హార్డీ సంధుతో కలిసి చేసిన ‘బిజ్లీ బిజ్లీ’ మ్యూజిక్ వీడియోతో ఒక్కసారిగా నేషనల్ వైడ్ గా పాపులర్ అయింది ఈ భామ . ఈ పాటలో పలక్ వేసిన స్టెప్పులు, ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ అప్పట్లో యూత్‌ను విపరీతంగా ఆకట్టుకున్నాయి కూడా. ఆ తర్వాత ‘మంగ్తా హై క్యా’ మ్యూజిక్ వీడియోలోనూ కనిపించి అదరగొట్టింది..
2023లో సల్మాన్ ఖాన్ నటించిన ‘కిసీ కా భాయ్ కిసీ కీ జాన్’ సినిమాతో బాలీవుడ్లో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఈ స్టార్ కిడ్ ఆ తర్వాత 2025లో ‘ది భూత్నీ’ సినిమాలో అనన్య పాత్రలో కనిపించి మెప్పించింది.
సంజయ్ దత్, మౌనీ రాయ్ వంటి ప్రముఖ నటులతో కలిసి పనిచేసే అవకాశం ఈ సినిమాతో దక్కించుకోవడం విశేషం.ఇక అదే ఏడాది ‘రోమియో ఎస్3’ చిత్రంలోనూ నటించి అలరించింది కూడా.. ఇక 2026లో ‘లుక్కే’ వెబ్ సిరీస్‌తో పాటు ‘రోసీ: ది సాఫ్రన్ చాప్టర్’ వంటి ప్రాజెక్టులతో లైమ్ లైట్లో ఉంటుంది ఈ భామ.ఒక వైపు సినిమాలో మరోవైపు ఫ్యాషన్ ఫోటో షూట్ తో బిజీగా ఉన్న ముద్దుగుమ్మ ప్రస్తుతం పెట్టిన ఈ ఫోటోతో సోషల్ మీడియాలో రచ్చ చేస్తుంది.
also read:గాజులు గలగల దివ్య రీల్ చూసి ఊరుకోలేకపోయా.. అసలు విషయం చెప్పిన కళ్యాణి అమ్మ!