E-Paper
Advertisement

చదువు మధ్యలోనే ఆపేసి రోజుకు రూ.100 కూలీ పని చేసిన యువతి.. కట్ చేస్తే రూ.2 లక్ష కోట్ల బిజినెస్‌కు అధిపతి

చదువు మధ్యలోనే ఆపేసి రోజుకు రూ.100 కూలీ పని చేసిన యువతి.. కట్ చేస్తే రూ.2 లక్ష కోట్ల బిజినెస్‌కు అధిపతి
Advertisement

Woman entrepreneur success story| జీవితంలో కష్టాలు ఎదురైనప్పుడు చాలామంది తమ కలలను వదులుకుంటారు. కానీ కొందరు మాత్రం పట్టుదలతో అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తారు. అలాంటి మహిళే చైనాకు చెందిన జౌ కున్‌ఫే. చిన్నతనంలోనే చదువుకు స్వస్తి చెప్పి ఫ్యాక్టరీలో పనిచేసిన ఆమె రోజుకు కేవలం రూ.100 మాత్రమే సంపాదించేవారు. కానీ నేడు వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యానికి అధిపతిగా ఎదిగారు. యాపిల్ ఐఫోన్లకు గ్లాస్ స్క్రీన్లు సరఫరా చేసే కంపెనీ స్థాపించి చైనాలోనే అత్యంత ధనవంతురాలిగా నిలిచారు.

చైనాలోనే అత్యంత ధనవంతురాలిగా జౌ కున్‌ఫే

ది ఇండిపెండెంట్ మీడియా కథనం ప్రకారం.. జౌ కున్‌ఫే 2026లో చైనాలో అత్యంత ధనవంతురాలిగా నిలిచారు. అక్టోబర్ 28న విడుదలైన హురున్ రిచెస్ట్ ఉమెన్ ఇన్ చైనా జాబితాలో ఆమె మొదటి స్థానాన్ని దక్కించుకున్నారు. ఆమె మొత్తం సంపద 127 బిలియన్ యువాన్లుగా ఉంది. భారత కరెన్సీలో ఇది సుమారు రూ.1.80 లక్షల కోట్లు. గత ఏడాదితో పోలిస్తే ఆమె సంపద 15 శాతం పెరిగింది.
హాన్సో ఫార్మాస్యూటికల్ వ్యవస్థాపకురాలు ఝాంగ్ హుయిజువాన్‌ను వెనక్కి నెట్టి ఆమె ఈ స్థానాన్ని సంపాదించారు. ఝాంగ్ సంపద సుమారు రూ.1.76 లక్షల కోట్లుగా అంచనా వేశారు. గతంలో 2015లో కూడా జౌ ఈ ఘనత సాధించారు.

టీనేజ్‌లోనే చదువు ఆపేసి ఫ్యాక్టరీలో ఉద్యోగం

Advertisement

1970లో చైనాలోని హునాన్ ప్రావిన్స్‌లో జౌ కున్‌ఫే జన్మించారు. చిన్న వయసులోనే చదువు మధ్యలో ఆపేసి మెరుగైన అవకాశాల కోసం ఆమె షెన్‌జెన్‌ దేశాలకు వెళ్లారు. అక్కడ ఓ వాచ్ గ్లాస్ తయారీ ఫ్యాక్టరీలో పనిచేయడం ప్రారంభించారు. రోజుకు సుమారు 1.20 డాలర్లు మాత్రమే సంపాదించేవారు. అంటే భారత కరెన్సీలో ఇది దాదాపు రూ.114. అయితే, ఆర్థిక ఇబ్బందులు ఆమెను వెనక్కి తగ్గించలేదు. గ్లాస్ తయారీ, ఉత్పత్తి విధానాల గురించి ఆసక్తిగా నేర్చుకున్నారు. తన నైపుణ్యాలను కూడా మెరుగుపరుచుకున్నారు. కేవలం 23 ఏళ్ల వయసులోనే సొంతంగా వ్యాపారం ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు. ఓ చిన్న గ్లాస్ ప్రాసెసింగ్ వర్క్‌షాప్‌ను ఏర్పాటు చేసి, తయారీ రంగంలో కొత్త విషయాలు నేర్చుకున్నారు.

యాపిల్ ఐఫోన్ డీల్‌తో మారిపోయిన అదృష్టం

తర్వాత జౌ తన మిత్రులతో కలిసి లెన్స్ టెక్నాలజీ కంపెనీ స్థాపించారు. ఈ సంస్థ స్మార్ట్‌ఫోన్‌లకు అవసరమైన గ్లాస్ స్క్రీన్ల తయారీలో ప్రముఖ కంపెనీగా ఎదిగింది. 2007లో యాపిల్ తొలి ఐఫోన్ల కోసం గ్లాస్ కవర్లను సరఫరా చేసే అవకాశం లభించింది. ఈ ఒప్పందం కంపెనీకి పెద్ద విజయాన్ని అందించింది. యాపిల్ నుంచి పెరిగిన ఆర్డర్లతో లెన్స్ టెక్నాలజీ వ్యాపారం వేగంగా విస్తరించింది. అంతర్జాతీయ స్మార్ట్‌ఫోన్ తయారీ రంగంలో కీలక సరఫరాదారుగా మారింది. దీంతో జౌ సంపద కూడా భారీగా పెరిగింది.

Advertisement

Also Read: చాణక్య నీతి.. దానధర్మాలు చేసే ముందు ఈ 7 విషయాలు గుర్తుంచుకోండి

చైనాలో సంపన్న మహిళల్లో స్వయం సంపాదిత వ్యాపారవేత్తలే ఎక్కువ

హురున్ నివేదిక ప్రకారం.. చైనాలోని అత్యంత ధనవంతులైన 50 మంది మహిళల్లో 65 శాతం మంది సొంతంగా సంపదను సంపాదించారు. వీరందరి కలిపి సంపద 1.93 ట్రిలియన్ యువాన్లకు చేరింది. భారత కరెన్సీలో ఇది సుమారు రూ.27.45 లక్షల కోట్లు. హురున్ సంస్థ.. 1999 నుంచి చైనాలో అత్యంత ధనవంతులైన మహిళల జాబితాను విడుదల చేస్తోంది. కుటుంబ సంపదతో కాకుండా వ్యక్తిగతంగా సంపాదించిన సంపద ఆధారంగా ఈ జాబితాను రూపొందిస్తుంది.

Also Read: భగవద్గీత.. సృష్టిలో కారణం లేకుండా ఏదీ జరగదు.. మరి ఇంత అన్యాయం ఎందుకు?

ఒకప్పుడు ఫ్యాక్టరీలో సాధారణ ఉద్యోగిగా పనిచేసిన జౌ కున్‌ఫే ప్రయాణం ఎంతోమందికి స్ఫూర్తినిస్తోంది. పట్టుదల, కష్టపడి పనిచేసే తత్వం, కొత్త విషయాలు నేర్చుకోవాలనే ఆసక్తి ఉంటే జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకోవచ్చని ఆమె నిరూపించారు.

Related News

దీపావళి వేళ సిఎంఆర్ జ్యువెలరీ ఆఫర్లు.. బంగారు ఆభరణాలపై భారీగా డిస్కౌంట్లు!

సామాన్యులకు గుడ్ న్యూస్.. దిగొస్తున్న బంగారం ధరలు.. త్వరలోనే రూ.లక్ష దిగువకు పసిడి?

నోటీస్ ఇవ్వకుండా ఉద్యోగం నుంచి తొలగిస్తే.. కంపెనీపై కోర్టులో కేసు వేయవచ్చా?

ఒకే చోట 500+ ప్రాజెక్ట్‌లు, స్పాట్ లోనే బ్యాంక్ లోన్లు.. హైటెక్స్‌లో నరెడ్కో ప్రాపర్టీ షో మిస్ కావద్దు

రూ.10 వేల జీతం తీసుకునే ఉద్యోగి.. కట్ చేస్తే ఖాతాలో రూ.10 వేల కోట్లు.. చివరికి ఏమైందంటే!

పెన్షనర్లు ఇక లైన్‌లో గంటలకొద్ది నిలబడాల్సిన పనిలేదు.. లైఫ్ సర్టిఫికెట్ ఇంటి నుంచే సమర్పించండి

తల్లిదండ్రులకు గుడ్ న్యూస్.. ఎల్‌ఐసీ నుంచి 3 సూపర్ స్కీమ్స్.. పిల్లల భవిష్యత్తుకు కొండంత భరోసా!

Big Stories

Advertisement
×