Ashish Nehra: ఆశిష్ నెహ్ర.. భారత క్రికెట్ లో మరిచిపోలేని పేరు. టీమిండియా ఫాస్ట్ బౌలర్ గా ఎంతో ప్రఖ్యాతి పొందిన క్రికెటర్. క్రికెటర్ గా కంటే గుజరాత్ టైటాన్స్ హెడ్ కోచ్ ఐపీఎల్ 2022 టైటిల్ గెలిచిన తర్వాతే ఎక్కువ పాపులారిటీ తెచ్చుకున్నాడు. ఈ లెఫ్ట్ ఆర్మ్ పేసర్ ఆశిష్ నెహ్ర 2011 వన్డే వరల్డ్ కప్ గెలిచిన జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. 2003 లో జరిగిన వరల్డ్ కప్ లో ఇంగ్లాండ్ పై సంచలన ప్రదర్శన చేసి ఆరు వికెట్లు పడగొట్టాడు.
Also Read: IND VS ENG 2ND ODI: నేడే రెండో వన్డే..కోహ్లీ ఎంట్రీ…ఆ ముగ్గురు ప్లేయర్లపై వేటు ?
భారత్ తరపున 17 టెస్టులు, 120 వన్డేలు, 27 టి-20 లు ఆడిన ఆశీష్ నెహ్ర.. టెస్టుల్లో 44, వన్డేల్లో 157, టి-20 ల్లో 34 వికెట్లు పడగొట్టాడు. ఢిల్లీకి చెందిన ఈ పేస్ బౌలర్ 1999లో శ్రీలంకతో జరిగిన టెస్ట్ మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్ లోకి అరంగేట్రం చేశాడు. 2001 లో జింబాబ్వే తో జరిగిన మ్యాచ్ లో వన్డేల్లోకి అరంగేట్రం చేశాడు. ఇక ఆశిష్ నెహ్ర ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ లో గుజరాత్ కోచ్ గా 2022 లో బాధ్యతలు చేపట్టిన తొలి ఏడాదే ఆ జట్టు కప్పు సాధించింది.
2022లో గుజరాత్ ఐపీఎల్ లో కొత్త టీమ్ కూడా. ఇప్పటివరకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ లో కప్ గెలిచిన టీమ్ కి హెడ్ కోచ్ గా ఉన్న భారత క్రికెటర్ కూడా ఆశిష్ నెహ్రనే. ఇతడికి చిన్నప్పటినుండి క్రికెట్ అంటే విపరీతమైన పిచ్చి. తన తల్లి సహధ్యాయి, స్నేహితుడు వీరేంద్ర సెహ్వాగ్ తో కలిసి ఫిరోజ్ షా కోట్ల మైదానానికి స్కూటర్ పై వచ్చి క్రికెట్ ఆడేవాడు. ఆశిష్ నెహ్ర మంచి ప్లేయర్ మాత్రమే కాకుండా.. మంచి మనసున్న మనిషి కూడా. అయితే తాజాగా నెహ్ర మంచి మనసు గురించి ఓ ఆసక్తికర సంఘటన బయటకి వచ్చింది.
ఓ రోజు కోచ్ తారక్ సిన్హ ప్రాక్టీస్ సెషన్ కి కాస్త ఆలస్యంగా వచ్చాడు. దీంతో ఆలస్యం ఎందుకు అయ్యిందని ఆశిష్ నెహ్ర అతడిని ప్రశ్నించాడు. దీంతో.. ” అద్దె ఇంట్లో ఉండే వాళ్ళ కష్టాలు నీకేం తెలుస్తాయి..? నాకు మా యజమాని ఇల్లు ఖాళీ చేయాలని నోటీసులు పంపించాడు” అంటూ దిగులుగా చెప్పాడట కోచ్ తారక్ సిన్హా. ఇక ఆ మరుసటి రోజు ఆశిష్ నెహ్ర ప్రాక్టీస్ సెషన్ కి లేటుగా వచ్చాడట. దీంతో నీకెందుకు లేట్ అయ్యిందని కోచ్ తారక్ సిన్హా.. నెహ్రని ప్రశ్నించారు.
Also Read: SA20 Final: సన్ రైజర్స్ కు షాక్…SA20 టోర్నీ విజేతగా MI కేప్‌టౌన్
దీంతో “ఈ విషయం తర్వాత తెలుసుకోవచ్చు.. ఇదిగోండి మీ కొత్త ఇంటి తాళం” అని కొత్త ఇంటి తాళాలు తారక్ సిన్హాకి ఇచ్చాడట నెహ్ర. ఈ విషయాన్ని విజయ్ లోకనాథ్ అనే రచయిత “driven-the Virat Kohli story” అనే పుస్తకంలో రాసుకొచ్చాడు. ఈ విషయం తెలిసిన భారత క్రీడాభిమానులు ఆశిష్ నెహ్రా పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇక 1969లో ఢిల్లీలో సొన్నెట్ క్రికెట్ క్లబ్ నీ ప్రారంభించిన తారక్ సిన్హా.. ఎంతోమంది సత్తా ఉన్న క్రికెటర్లను భారత జట్టులోకి పంపించాడు. అతడి వద్ద శిక్షణ పొందిన వారిలో అశిష్ నెహ్ర, రిషబ్ పంత్, ఆకాష్ చోప్రా, శిఖర్ ధావన్ వంటి కీలక ఆటగాళ్లు ఉన్నారు.