Fine On Uber Cabs : ఉబర్ క్యాబ్ సంస్థపై ముంబై కన్జ్యూమర్ కోర్ట్ రూ.20వేల జరిమానాను విధించింది. 2018లో వినియోగదారుడు అందించిన ఫిర్యాదుతో ముంబై కన్జ్యూమర్ కోర్టు ఈ తీర్పు ఇచ్చింది. 2018లో కవితా శర్మ అనే న్యాయవాది అర్జెంటుగా చెన్నైకి విమానంలో వెళ్లాల్సి వచ్చింది. అప్పుడే క్యాబ్ బుక్ చేసుకుంటే 17 నిమిషాలు ఆలస్యం చేశాడు డ్రైవర్. త్వరగా పికప చేసుకోవాలని ముందే చెప్పినా.. సీఎన్‌జీ స్టేషన్‌లో కొద్ది సేపు ఆపి మాట్టాడుకుంటూ 20 నిమిషాల తరువాత వచ్చాడు. క్యాబ్ ఎక్కి ఎయిర్‌పోర్ట్ వెళ్లే సరికి ఆ న్యాయవాది ఎక్కాల్సిన చెన్నై విమానం వెళ్లిపోయింది. అదే కాకుండా బుక్ చేసుకున్నప్పుడు చూపించిన రేటు రూ.563 కంటే అధికంగా రూ. 703ను చూపించింది.
ఈ విషయాన్ని న్యాయవాది ఉబర్ దృష్టికి తీసుకువెళ్లింది. “మేము కేవలం వినియోగదారులకు, డ్రైవర్లకు మధ్యవర్థులము మాత్రమే” అని ఉబర్ వివరణ ఇచ్చింది. అదనంగా చార్జ్ చేసిన అమౌంట్‌ను కూడా తిరిగి ఇచ్చింది. ఉబర్‌కు లా నోటీసులు పంపినా సరిగా స్పందించకపోవడంతో.. ముంబై కన్జ్యూమర్ కోర్టు ఈ కేసును పరిశీలించి ఉబర్ సంస్థపై రూ.20వేల జరిమానాను విధించింది.