Big Stories

KTR Tweet : టీఆర్ఎస్ పీచేముడ్!.. ఎమ్మెల్యేల ట్రాప్ పై కేటీఆర్ ట్వీట్..

KTR Tweet : నలుగురు ఎమ్మెల్యేలు. ముగ్గురు మధ్యవర్తులు. ఒక ఫాంహౌజ్. వందల కోట్ల డీల్. పక్కాగా వీడియో సాక్షాలు. పోలీసు దాడులు. బీజేపీని టార్గెట్ చేసే ఇంత మంచి అవకాశాన్ని టీఆర్ఎస్ ఎందుకు వదులుకుంటోంది? ఓవైపు కమలనాథులు దూకుడు మీదుంటే.. గులాబీ నేతలు ఎందుకు పీచేముడ్ అంటున్నారు. బీజేపీ బిగ్ లీడర్లు వరుసగా ప్రెస్ మీట్లు పెడుతుంటే.. కారు పార్టీ నాయకులు ఎందుకు ముఖం చాటేశారు? యాదాద్రి ఆలయంలో ప్రమాణం చేద్దామన్న బండి సంజయ్ సవాల్ కు కేసీఆర్ సిద్ధమా? సుప్రీంకోర్టు జడ్జితో గానీ, సీబీఐ విచారణ గానీ జరిపించాలన్న కిషన్ రెడ్డి డిమాండ్ ను సర్కారు స్వీకరిస్తుందా? ఇలా అనేక ప్రశ్నలు.

- Advertisement -

ఎమ్మెల్యేల ట్రాప్ ఎపిసోడ్ లో బీజేపీ ఇరుక్కున్నట్టే ఇరికి.. అంతలోనే రివర్స్ అటాక్ తో ఇష్యూని తమకు అనుకూలంగా మార్చుకున్నట్టు కనిపిస్తోంది. ఇంత మంచి ఛాన్స్ దొరికితే.. ఎందుకోగానీ కారు పార్టీ నేతలు సైలెంట్ మోడ్ లోకి వెళ్లిపోయారు. సీఎం కేసీఆరే స్వయంగా మీడియా ముందుకు వస్తారంటూ ప్రచారం జరిగింది. కానీ, ఆయన రాలేదు. కనీసం ఆ నలుగురు ఎమ్మెల్యేలు సైతం అసలేం జరిగిందో వివరాలు బయటపెట్టలేదు. జరిగిన ఘటనపై ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అక్కడక్కడా గల్లీ లీడర్లు బీజేపీకి వ్యతిరేకంగా ఆందోళనలు చేశారంతే.

- Advertisement -

ఇక, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం ఈ విషయంపై మౌనంగా ఉండటమే కాకుండా.. పార్టీ నాయకులు సైతం ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దని చెప్పడం ఆశ్చర్యంగా ఉందంటున్నారు. ఇదే ఛాన్స్ అన్నట్టు.. బీజేపీని కుమ్మేయాల్సిన గులాబీదళం.. ఇలా మౌనవ్రతం పాటించాలంటూ పైనుంచి ఆదేశాలు రావడం అనుమానాస్పదంగా మారుతోంది. టీఆర్ఎస్ ఎందుకు వెనుకంజ వేస్తోంది? బీజేపీ ఎదురుదాడితో ఇష్యూ తమకే బూమరాంగ్ అవుతుందని అనుకుంటోందా? లేక, లోతుగా విచారిస్తే సంచలన విషయాలేమైనా తెలిసాయా? అనే డౌట్. కేటీఆర్ చేసిన ట్వీటే ఈ అనుమానాలకు కారణం.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News