BigTV English

Ali Appointed as AP Govt : ఆలీకి కీలక పదవి.. సీఎం జగన్ బంపర్ ఆఫర్

Ali Appointed as AP Govt : ఆలీకి కీలక పదవి.. సీఎం జగన్ బంపర్ ఆఫర్

Ali Appointed as AP Govt : ఎట్టికేలకు సినీ నటుడు ఆలీ నిరీక్షణ ఫలించింది. ఏపీ సీఎం వైఎస్ జగన్ ఆలీకి కీలక బాధ్యతలు అప్పగించారు. ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారు పదవిని కట్టబెట్టారు. చాలా కాలంగా ఆలీకి ఏపీ ప్రభుత్వంలో కీలక పదవి దక్కుతుందనే ప్రచారం సాగింది. 2019 ఎన్నికల సమయంలో ఆలీ వైఎస్ఆర్ సీపీలో చేరారు. ఎన్నికల్లోనే సీటు ఇస్తారని అందరూ భావించారు. రాజమండ్రి నుంచి ఎంపీ అభ్యర్థిగా బరిలో నిలుస్తారని ప్రచారం సాగింది. కానీ అలీని జగన్ పోటీకి దించలేదు. ముఖ్యమంత్రిగా జగన్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రభుత్వంలో నామినేటెడ్ పదవి ఇస్తారని ప్రచారం సాగింది. ఆ తర్వాత ఎమ్మెల్సీ ఇస్తారని వార్తలు వినిపించాయి. అలీని రాజ్యసభకు పంపుతారనే ప్రచారం కూడా కొన్నాళ్లు నడిచింది. కానీ ఎలాంటి పదవి దక్కలేదు. మరో ఏడాదిన్నరలో ఎన్నికలు ఉన్నందున ఇక ఆలీకి ఎలాంటి పదవి దక్కదేమో అన్న సందేహం నెలకొంది. ఇదే సమయంలో కొద్ది రోజుల క్రితం ఆలీ తన సతీమణితో కలిసి సీఎం నివాసానికి వెళ్లి కలిశారు. ఆ సమయంలో త్వరలోనే గుడ్ న్యూస్ వింటారని అలీకి సీఎం జగన్ చెప్పారు.


తాను సీఎం జగన్ తో కలిసిన సమయంలో ఎలాంటి పదవి కావాలని కోరలేదని అలీ చెప్పారు. ఏ బాధ్యత అప్పగించినా సిద్దమేనని స్పష్టం చేశారు. ఇప్పుడు ఆలీకి ప్రభుత్వ సలహాదారు పదవి అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు సీఎం వైఎస్ జగన్. 2019 ఎన్నికల్లో జగన్ గెలుపు కోసం అలీ ప్రచారం చేశారు. ఆలీకి సినిమా పరిశ్రమకు సంబంధించిన పదవి కేటాయిస్తారని అందరూ భావించారు. కానీ అనూహ్యంగా సలహాదారు పదవి ఇచ్చారు సీఎం వైఎస్ జగన్.

జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కు సినీ పరిశ్రమలోని అత్యంత సన్నిహితుల్లో అలీ ఒకరుగా ఉన్నారు. అయితే గత ఎన్నికల సమయంలో రాజమండ్రి ప్రచారంలో అలీపై పవన్ చేసిన వ్యాఖ్యలతో ఇద్దరి మధ్య దూరం పెరిగింది. ఆ సమయంలో పవన్ కల్యాణ్ పై ఆలీ ఘాటుగా స్పందించారు కూడా. అయితే వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేళ్లు దాటినా పదవి రాకపోవటంతో ఆలీ జనసేనలో చేరుతారనే ప్రచారం సాగింది. ఇప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైస్ఆర్ సీపీ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని రాజకీయ అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలోనే ఎన్నికల వేళ కీలకమైన మీడియా సలహాదారు పదవిని ఆలీకి ఇచ్చారు సీఎం జగన్. రెండేళ్లపాటు ఆయన ఆ పదవిలో కొనసాగనున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆలీ వైఎస్ఆర్ సీపీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్ధిగా బరిలో నిలుస్తారని పార్టీలో జోరుగా ప్రచారం సాగుతోంది.


Related News

AP Heavy Rains: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. ఏపీకి అతి భారీ వర్ష సూచన.. రేపు ఈ జిల్లాల్లో

YS Jagan: మీది రెడ్ బుక్ అయితే.. మాది డిజిటిల్ బుక్, కథ వేరే ఉంటది.. జగన్ సంచలన వ్యాఖ్యలు

Yellow Shirt: అసలైన పసుపు సైనికుడు.. కూతురు పెళ్లిలో కూడా పసుపు చొక్కానే

Roja Hot Comments: శుక్రవారం వస్తే జంప్.. జగన్‌పై రోజా సెటైర్లు?

Digital Book: డిజిటల్ బుక్‌తో వైసీపీ వార్నింగ్.. రెడ్ బుక్ విజృంభించే టైమ్ వచ్చిందా?

Mother Killed Son: కళ్లలో కారం, చీరతో ఉరి.. ఎకరం భూమి కోసం కొడుకును చంపిన తల్లి

Jagan: ప్రతిపక్ష హోదా వల్ల లాభం ఏంటి? ఎమ్మెల్యేలకు ప్రశ్నించే హక్కు ఉండదా? జగన్ లాజిక్ ఏంటి?

Tirumala News: భక్తులకు నేరుగా శ్రీవారి దర్శనం, సాయంత్రం తిరుమలకు సీఎం చంద్రబాబు

Big Stories

×