BigTV English

Terrorists Killed: జమ్మూలో ఎన్‌కౌంటర్.. ముగ్గురు ఉగ్రవాదులు హతం

Terrorists Killed: జమ్మూలో ఎన్‌కౌంటర్.. ముగ్గురు ఉగ్రవాదులు హతం

Terrorists Killed: జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదుల కోసం ముమ్మర వేట కొనసాగుతోంది. పుల్వామా జిల్లాలోని థ్రాల్‌ ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కినట్లు నిఘా వర్గాల నుంచి సమాచారం రావడంతో భద్రతా బలగాలు తనిఖీలు చేపట్టాయి. ఈ క్రమంలోనే నాదిర్‌ గ్రామంలో గాలింపు చేస్తుండగా.. ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. దీంతో భద్రతా సిబ్బంది ఎదురుకాల్పులు చేపట్టారు. ఈ కాల్పుల్లో జైషే మమ్మద్‌ ఉగ్రసంస్థకు చెందిన ముగ్గురు టెర్రరిస్ట్‌లు హతమయ్యారు.


థ్రాల్‌ ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న పక్కా నిఘా వర్గాల నుంచి సమాచారం రావడంతో భద్రతా బలగాలు తనిఖీలు చేపట్టాయి. ఈ క్రమంలో నదిర్‌ గ్రామంలో గాలింపు చేస్తుండగా.. ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. దీంతో భద్రతా సిబ్బంది ఎదురుకాల్పులకు దిగారు. ఈ ఎన్‌కౌంటర్‌లో జైషే మహ్మద్‌ ఉగ్రముఠాకు చెందిన ఆసిఫ్‌ అహ్మద్‌ షేక్‌, అమిర్‌ నజీర్‌ వనీ, యవర్‌ అహ్మద్‌ భట్‌ హతయ్యారు. ఇందులో ఆసిఫ్ అహ్మద్ షేక్..పహల్గాం ఉగ్రదాడిలో పాల్గొన్నట్లు అధికారులు గుర్తించారు.

ఇప్పటికే మే 13వ తేదీన ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. షోపియాన్‌ జిల్లాలో ఉగ్రవాదులు, భద్రతా దళాల మధ్య ఎన్‌కౌంటర్ జరిగింది. లష్కరే తోయిబా టాప్ కమాండర్ షాహిద్ కుట్టే, అద్నాన్ షఫీ, సహా ముగ్గురు ఉగ్రవాదులను బలగాలు మట్టుబెట్టాయి. మూడో ఉగ్రవాదిని పుల్వామాకు చెందిన అహ్సాన్‌ ఉల్‌ షేక్‌గా గుర్తించారు. ఇక ఉగ్రవాదుల నుంచి పెద్ద మొత్తంలో ఆయుధాలు, మందుగుండును బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఇందులో ఏకే 47 రైఫిల్స్‌, మ్యాగజైన్స్‌, గ్రెనేడ్స్‌ ఉన్నాయి.


Also Read: యుద్ధం తీరు మారిందా.. ఇండియా పాక్ యుద్ధంలో బయటపడ్డ షాకింగ్ నిజాలు

మరోవైపు పహల్గామ్‌ ఉగ్రవాద దాడి తర్వాత నిఘా సంస్థలు కీలక విషయాలను వెల్లడించాయి. జమ్మూలో 14 మంది స్థానిక ఉగ్రవాదుల జాబితాను విడుదల చేశాయి. వీరంతా యాక్టీవ్‌గా ఉన్నట్లు నివేదించాయి. 14 మందిలో ఆరుగురిని మట్టుబెట్టడంతో…మిగిలిన 8 మంది ఉగ్రవాదుల కోసం తీవ్ర గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. అయితే జమ్మూలో పనిచేస్తున్న ఉగ్రవాదులకు పాకిస్థాన్‌ నుంచి మద్దతు అందుతుందని గుర్తించారు. ఇక్కడి ఉగ్రవాదులు ..హిజ్బుల్ ముజాహిదీన్, లష్కరే తయిబా, జైష్-ఎ-మొహమ్మద్‌ ఉగ్రసంస్థల నుంచి సహకారం అందుతుందని నిఘా వర్గాలు తేల్చాయి. ఈ క్రమంలో టెర్రరిస్టుల కోసం భద్రతా సిబ్బంది తీవ్రంగా గాలిస్తున్నారు. ఉగ్రదాడికి కారకులుగా భావిస్తోన్న ఉగ్రవాదుల ఫొటోలతో కూడిన పోస్టర్లను కూడా ఏర్పాటు చేశారు.

Related News

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Gold mining news: ఆ జిల్లాలో అంతా బంగారమే.. తవ్వితే చాలు వచ్చేస్తోంది.. ఎంత అదృష్టమో!

Raksha Bandhan 2025: రక్షా బంధన్ స్పెషల్.. మహిళలకు బంపరాఫర్, ఉచిత బస్సు ప్రయాణం

Rahul Gandhi: ఒక సింగిల్ బెడ్ రూం ఇంట్లో 80 మంది ఓటర్లు ఉన్నారట…

Jammu Kashmir: లోయలో పడిన ఆర్మీ వాహనం.. ఇద్దరు జవాన్లు మృతి, 12 మందికి గాయాలు..

Cloudburst: ఉత్తరాఖండ్‌లో ప్రళయం.. పదే పదే ఎందుకీ దుస్థితి.. కారణం ఇదేనా!

Big Stories

×