India Pakistan War: ఒకప్పుడు జరిగిన యుద్ధం వేరు. మారిన కాలమాన పరిస్థితుల నడుమ ఇప్పుడు జరుగుతోన్న యుద్ధం వేరు. వచ్చే రోజుల్లో మారబోయే యుద్ధ పరిణామ క్రమాలు వేరు. ప్రస్తుతం భారత్ పాక్ మధ్య జరిగిన యుద్ధం జరిగిన తీరు తెన్నులేంటి? ఆ విధానాలు ఎలాంటివి? కనిపించే ఆయుధాలు.. కనిపించని శతృవుతో జరిగిన ఈ కొత్త రకం యుద్ధ యుగం తాలకూ లక్షణాలు ఎలాంటివి? వాటి పర్యావసనాలు ఎలా కనిపించాయి? ఇప్పుడు చూద్దాం.
నాటి యుద్ధానికి నేటి యుద్ధానికి తేడా స్పష్టం
వరల్డ్ వార్ 1, 2 జరిగిన తీరు వేరు. ఆ తర్వాత జరిగిన భారత్ పాక్ యుద్ధాలు వేరు. వరల్డ్ వార్ 2 తర్వాత భారత్ పాక్ మధ్య జరిగిన యుద్ధమే అతి పెద్ద సాయుధ యుద్ధం. ఆ తర్వాత ఎన్నో యుద్ధాలు జరిగాయి. ఆ మాటకొస్తే భారత్ పాక్ మధ్య జరిగిన చివరి యుద్ధం కార్గిల్ యుద్ధం కాగా.. ఈ వార్‌లో పాక్ వేలాదిగా తన శ్రేణులను కోల్పోయింది. అప్పుడు కనిపించిన యుద్ధ సన్నివేశానికి.. ప్రస్తుత యుద్ధ సన్నివేశానికి తేడా స్పష్టం. అప్పుడు లేనివి ఇప్పుడు వచ్చిన ఆయుధాలేమిటో చూస్తే.. మనకా విషయం క్లియర్ కట్‌గా తెలుస్తుంది.
S400, టర్కిష్ డ్రోన్లు, చైనా PL 15 E ..
భారత్ పాక్ సరిహద్దుల వెంబడి మొహరించిన ఎస్ 400, పాక్ మన ఉపరితలాన్ని టార్గెట్ చేసిన టర్కిష్ డ్రోన్లు, చైనా PL 15 E వంటి ఎయిర్ టు ఎయిర్ క్షిపణులు.. నాటికీ నేటికీ తేడా చెప్పే ఆయుధ శ్రేణులు. మోడ్రన్ వార్ ఫేర్ కి సంబంధించిన ప్రధానాంశాలు. భారత్ పాక్ మధ్య జరిగిన ఈ నాలుగు రోజుల యుద్ధం.. ఎన్నో విప్లవాత్మక యుద్ధ పరిణామ క్రమాలను మనకు తెలియ చేస్తుంది. భౌతిక సరిహద్దులు దాటకుండానే శతృ స్థావరాలను టార్గెట్ చేస్తూ ప్రయోగించిన ఆయుధాలు సరికొత్త యుద్ధానికి తెరలేపాయి.
గన్ షూటింగ్‌లో కీలకంగా మారిన వైనం
కేవలం వీడియో షూటింగ్ పర్పస్ కోసం తయారైన డ్రోన్ వ్యవస్థ.. నేడు గన్ షూట్ కోసమూ ఉపయోగపడ్డం చూస్తున్నాం. తుపాకులను మోగించడం మాత్రమే కాక.. వాటిని నిలుచున్న చోట నుంచి ప్రయోగించడం సరికొత్త యుద్ధ పరిణామ క్రమం. దీన్ని తిప్పి కొట్టడానికి రష్యా నుంచి కొనుగోలు చేసిన.. ఎస్ 400 భారత అమ్ముల పొదిలో దాగిన బ్రహ్మాస్త్రం.
భారత్ పాక్ అణ్వాయుధ వినియోగ ప్రభావం..
ఒకప్పుడు అంటే 1999లో భారత్ పాక్ మధ్య జరిగిన వార్ డిబేట్ లో ప్రధానాంశం.. అణ్వాయుధం. అప్పట్లో ఈ అంశం ప్రపంచాన్ని నివ్వెర పరిచింది. కొన్ని కొన్ని రిపోర్టులను అనుసరించి చెబితే భారత్ పాక్ అనే ఈ రెండు అణ్వాయుధ దేశాలు ఒకరిపై మరొకరు అణ్వాయుధాలను వాడితే జరిగే జన నష్టం రెండు బిలియన్లుగా లెక్కించిందీ ప్రపంచం. అప్పట్లో అదే అతి పెద్ద యుద్ధం తాలూకూ చర్చ. అంతే కాదు మన దగ్గర హైడ్రోజన్ బాంబు కూడా ఉందన్న మాట మరో రకమైన చర్చ. ఈ ఆయుధాలు వాటి ప్రభావాలే ఆనాటి చర్చ. ఆ మాటకొస్తే.. ఇటీవలి కాలంలో భారత్ సింధూ జలాల ఒప్పందం రద్దు చేస్తామనగానే.. పాకిస్థాన్ మంత్రి నుంచి వినిపించిన కామెంట్ మేం అణ్వాయుధం వాడుతామని.. అయితే మా దగ్గర కూడా సరిగ్గా అలాంటి ఆయుధాలే ఉన్నాయని మనం కూడా కౌంటర్ అటాక్ చేయడం కనిపించింది.
టర్కిష్ సాయుధ డ్రోన్లు ఓ యుద్ధ చర్చనీయాంశం
అయితే ఇప్పుడు జరిగిన యుద్ధంలో అణ్వాయుధం అన్నది పెద్ద విషయమే కాదు. అది కనుమరుగయ్యి.. కొత్త కొత్త ఆయుధాలు చర్చలోకి వచ్చాయి. 900 కిలోమీటర్ల సరిహద్ధులోని 36 భారత నైసర్గిక లక్ష్యాలను టార్గెట్ చేసిన పాక్ ప్రయోగించిన టర్కిష్ సాయుధ డ్రోన్లు ప్రస్తుతం ఓ యుద్ధ చర్చనీయాంశం. వీటి తయారీ నుంచి పనితీరు వరకూ భారత్ లో జోరుగా చర్చ సాగింది. వీటితో పాటు చైనా మేడ్ పీఎల్ 15లకు సంబంధించిన డిస్కషన్ కూడా జరిగింది. వీటిని.. మన జేఎఫ్ 17 ఫైటర్ల పై ప్రయోగించింది పాక్.
ఎస్ 400 వంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్..
శతకోటి దరిద్రాలకు అనంత కోటి ఉపాయాలన్నట్టు భారత్ కూడా సరికొత్త వార్ ఫేర్ కి తెరలేపింది. తనదైన సొంత ఆయుధ సామర్ధ్యం ప్రయోగించింది. ఎస్ 400 వంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ తో పాటు ఆకాష్ సర్ఫేస్ టు స్కై మిస్సైళ్లను ప్రయోగించి ప్రపంచాన్ని అబ్బురపరిచింది భారత్. యాంటీ డ్రోన్ టెక్నాలజీ పాకిస్థాన్ వైమానిక దాడులను తిప్పి కొట్టింది ఇండియన్ ఆర్మీ.
రాఫెల్ జైట్ ఫైటర్లు, స్కాల్ప్ క్రూయిజ్ క్షిపణులు..
భారత్ దాడి సామర్ధ్యంలో.. రాఫెల్ జైట్ ఫైటర్లు, స్కాల్ప్ క్రూయిజ్ క్షిపణులు, హామర్ స్మార్ట్ ఆయుధాలతో పాటు. సెన్సార్ ఎక్వీప్డ్ కామికేజ్ డ్రోన్లు.. పాక్ టార్గెటన్లను గొప్పగా చేధించగలిగాయి. ఇవి మోడ్రన్ వార్ ఫేర్ కి కేరాఫ్ గా నిలిచాయి.
పాక్ 8 సైనిక స్థావరాలను టార్గెట్ చేసిన భారత్
మే 9, 10వ తేదీల్లో జరిగిన భారత వైమానిక దళ దాడి.. పాకిస్థాన్ లోని 8 సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నాయి. వారి వైమానిక స్థావరాలు, రాడార్ యూనిట్లూ, ఆయుధ గోడౌన్లను లక్ష్యంగా చేసుకున్నాయి. ఇవన్నీ భారత్ కూర్చున్న చోట కదలకుండా చేసిన దాడులే. ఇలాంటి ఎన్నో అధునాతన ఆయుధ దాడులు.. సరి కొత్త యుద్ధ సరళికి ప్రతీకగా నిలుస్తున్నాయి.
కూల్చివేతతో పాటు సమర్ధవంతంగా ఉగ్రవాదుల ఏరివేత
ఆపరేషన్ సిందూర్ ద్వారా భారత్ సరిహద్దు ఉగ్రవాదం విషయంలో తమ ప్రతిస్పందన ఎలాంటిదో స్పష్టం చేసింది. ప్రస్తుతం మనకున్న అధునాతన ఆయుధ సంపత్తి ద్వారా పాకిస్థాన్ లోతు పాతుల్లో ఉన్న ఉగ్రవాద శిబిరాల కూల్చివేత తోపాటు కొందరు ఉగ్రవాదులను ఏరివేత కూడా చేయగలిగాము. ఇవన్నీ కొత్త ఆయుధాలు, సరికొత్త సాంకేతిక సహాయాల కారణంగా సాధ్యమైనవే.
మన ఆయుధ సదుపాయం పాక్ కో పీడకల- రిటైర్డ్ ఎయిర్ మార్షల్
ప్రస్తుతం మన దగ్గరున్న ఆయుధ సదుపాయం.. పాకిస్థాన్ కో పీడకలతో సమానమని అంటారు వ్యూహాత్మక వ్యవహారాల నిపుణులు రిటైర్డ్ ఎయిర్ మార్షల్- అనిల్ చోప్రా. మన సైనిక సామర్ధ్యాన్ని పెంచుకోవడం మాత్రమే కాకుండా.. భవిష్యత్తును గుర్తుంచుకుని సరికొత్త ఆయుధ సాంకేతికతను కూడా సమకూర్చుకోగలిగాం. వీటిలో రాఫెల్, ఎస్ ఫోర్ హండ్రెడ్ ఆయుధ శ్రేణులు అత్యంత కీలకమైనవి. ఈ రెండు వెపన్ డీల్స్ విలువ సుమారు లక్ష కోట్ల మేర ఉంటుంది. ఒక్క రాఫెల్ డీల్ వాల్యూ 65 వేల కోట్ల మేర ఉండగా.. ఎస్ 400 35 వేల కోట్ల వరకూ ఉంటుంది.
యుద్ధ వాస్తవాలను తప్పుదారి పట్టించే ప్లాన్
భారత్ పాక్ యుద్ధంలో మనం చూసింది చాలా చాలా తక్కువ. వచ్చే రోజుల్లో జరిగే యుద్ధాలు ఊహలకందవు. ఏఐ టెక్నాలజీ యుద్ధాల్లో వాడకం ఇప్పటికే ఒక స్థాయిలో జరుగుతోంది. ఇక సైబర్ అటాక్స్ దినెక్స్ట్ లెవల్. హార్డ్ కోర్ వార్స్ ఇకపై జరిగే అవకాశాలు తక్కువ కాగా.. స్మార్ట్ ఏఐ టెక్నాలజీతో కూడుకున్న యుద్ధాలు జరిగే ఛాన్సులే ఎక్కువ. ఇందులో సైబర్ అటాక్స్ సపరేట్ చాప్టర్.
యుద్ధ వాస్తవాలను తప్పుదారి పట్టించే ప్లాన్.
యుద్ధ వాస్తవాలను తప్పుదారి పట్టించేలా పాక్ ప్లాన్
సరికొత్త సాంకేతికత సాయంతో ఫ్యూచర్లో మాయా యుద్ధాలుభారత్ పాక్ తాజా యుద్ధంలో డైరెక్ట్ వార్‌తో పాటు డిజిటల్ వార్ కూడా జరిగింది. దీని ప్రధాన ఉద్దేశమేంటంటే.. పాత వీడియోలతో ప్రస్తుతం జరుగుతున్న అంశాలతో సరిపోల్చి.. యుద్ధంలో జరుగుతున్న వాస్తవాలను తప్పు దారి పట్టించడం. భారతీయుల్లో ఆందోళన రేకెత్తించడం. ఇందులో డీప్‌ఫేక్ వీడియోలు కూడా ఉన్నాయి. మన విదేశాంగ జైశంకర్ క్షమాపణలు చెబుతున్న ఏఐ వీడియోలు తయారు చేసి వదిలింది పాక్. ఇందుకు కౌంటర్ గా.. పాక్ DG ISPR చౌదరి.. తమ రెండు ఫైటర్ జెట్లు కూలిపోవడం నిజమేనని ఒప్పుకున్న సింథటిక్ వీడియో రిలీజైంది. పాక్ చేసిన ప్రతి వీడియోని భారత్ తన ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో సాయంతో.. ఫ్యాక్ట్ చెక్ చేసి తిప్పి కొట్టింది.
ఫ్యూచర్లో ఏ ఆయుధమూ కనిపించని యుద్ధం
ఇదే కొత్త పద్ధతి అనుకుంటే.. వచ్చే రోజుల్లో ఏఐ టెక్నాలజీ యుద్ధంలో తీసుకురాబోయే మార్పుల గురించి ఊహించడానికే భయమేస్తుంది. ప్రస్తుత యుద్ధంలో శతృవు కనిపించకున్నా ఆయుధం కనిపించేది. వచ్చే రోజుల్లో ఆయుధమూ కనిపించక పోవచ్చు.. కానీ నష్టం మాత్రం చాలా చాలా తీవ్రతరం కావచ్చు. అందుకే అంగబలంగా పిలిచే సైనిక సామర్ధ్యాన్ని తగ్గిస్తూ అమెరికా, బ్రిటన్ వంటి యురోపియన్ దేశాలు ఈ దిశగా తమ అడుగులు వేస్తున్నాయి.
స్ట్రాటజిక్ సపోర్ట్ ఫోర్సెస్.. చైనా కొత్త వ్యవస్థ
ఫ్యూచర్ వార్ ఎలా ఉండొచ్చని ఒక అంచనాకు వస్తే.. ప్రస్తుతం అమెరికా, చైనాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులొక సంఘర్షగా మారితే.. అదెలా ఉండొచ్చు? అని పరిశీలిస్తే.. స్ట్రాటజిక్ సపోర్ట్ ఫోర్సెస్ గా పిలిచే ఒక సరికొత్త వ్యవస్థను తయారు చేసుకుంది చైనీస్ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ. అది స్పేస్ వార్ ఫేర్, సైబర్ సామర్ద్యాలతో పని చేస్తుంది. అదెలాగంటే.. ఇకపై జరిగే యుద్ధాల్లో ప్రధానంగా జరిగేవి సైబర్ దాడులే. అంటే కమ్యూనికేషన్స్, శాటిలైట్స్ వ్యవస్థలను ధ్వంసం చేయడం.. ప్రత్యర్ధికి అందుతోన్న సాంకేతిక సహాయాన్ని అందకుండా చేయడం వంటివి ప్రముఖంగా జరుగుతాయి. అంతే కాదు సముద్రంలోని డాటా కేబుల్స్ కట్ చేయడం కూడా ఇందులో భాగమే. దీని ద్వారా.. ఫోన్లు పని చేయవు. పెట్రల్ పంపుల్లో ఇంధన నిల్వలు అడుగంటుతాయి. ఇక ఆహార పంపిణీ వ్యవస్థ చిన్నాభిన్నమై పోతుంది.
మోడీ సిక్స్ డీ వార్ లో ఇవి కూడా భాగమే
మోడీ సైతం తన సిక్స్‌డీ వార్‌లో భాగంగా సరిగ్గా ఇలాంటిదే ప్లాన్ చేశారు. పాక్ మీద సైబర్ దాడి చేయాలనుకున్నారు. అక్కడి బ్యాంకింగ్ వ్యవస్థను చెదరగొట్టడం, వారి నిఘా వ్యవస్థను కంట్రోల్లోకి తెచ్చుకోవడం వంటి సైబర్ దాడులు చేయాలని నిర్ణయించారు. అయితే మన దగ్గర ప్రస్తుతం ఉన్న ఆయుధాల వినియోగం సరిపోతుందన్న కోణంలో ఈ యాంగిల్లో సైబర్ వార్ ని దూరం పెట్టినట్టు తెలుస్తోంది.
కమాండర్స్ డెసిషన్ మేకింగ్ రెస్పాన్స్ లో స్పీడ్
భవిష్యత్ యుద్ధాల్లో ఏఐ అత్యంత కీలకంగా మారే అవకాశం కనిపిస్తోంది. ఇది కమాండర్ల డెసిషన్ మేకింగ్ రెస్పాన్స్ స్పీడప్ చేస్తుందని అంటారు మోడ్రన్ వార్ ఫేర్ ఎక్స్ పర్ట్స్. ఏఐ ద్వారా సైనికాధికారులు సమాచారాన్ని మరింత వేగంగా ప్రాసెస్ చేయగలుగుతారు. యూఎస్, యూకేలకు ప్రస్తుతం ఏఐ సాయం అధికంగా అవసరమేర్పడుతోంది. కారణమేంటంటే.. ప్రపంచంలోనే అతి పెద్ధ జనాభా కలిగిన దేశాల్లో రెండో స్థానంలో ఉంది చైనా. ఈ దేశానికి సైనిక సంపత్తి ఆపారం. అలాంటి చైనాను తట్టుకుని నిలవాలంటే.. అంతకన్నా మించిన టెక్నాలజీ అవసరం. అంటే వారి హార్డ్ కోర్ ఆర్మీని స్మార్ట్ గా ఢీ కొట్టాలన్నమాట. అందులో భాగంగా యూఎస్ ఏఐ టెక్నాలజీ ఇన్ వార్ ఫేర్ అనే కొత్త విధానం ఫాలో అవుతోంది. తమ వద్ద పెద్ద స్థాయిలో సైన్యం లేకున్నా భారీ సైన్యంగల శతృ సైన్యాలను ఢీకొట్టాలన్నది అసలైన ఆలోచనగా తెలుస్తోంది.
ఎలక్ట్రానిక్ వార్ ఫేర్ లో భారీగా పెరుగుతోన్న పెట్టుబడులు
వచ్చే రోజుల్లో జరిగే యుద్ధాలు.. కంటికి కనిపించకపోవచ్చుగానీ, వాటి పర్యావసానాలు మాత్రం స్పష్టంగా తెలిసే అవకాశముంది. అందుకే ఎలక్ట్రానిక్ వార్ ఫేర్ లో పెట్టుబడులు భారీగా పెడుతున్నాయి. ఈ విధానం ద్వారా శాటిలైట్లను జామ్ చేయడం, కమ్యూనికేషన్ వ్యవస్థను స్తంభింప చేయడం వంటివి జరుగుతాయి. ఫ్యూచర్లో సైన్యాన్ని అడ్డుకోవడం ఒక్కటే యుద్ధం కాదు. టోటల్ దేశాలకు దేశాలు టార్గెట్ అవుతాయి. దీన్నే సబ్-థ్రెషోల్డ్ వార్‌ఫేర్ అని కూడా పిలుస్తారు.
సైన్యంలో మనుషుల బదులు రోబోలను తెచ్చే ప్లాన్
భౌతిక ఆయుధాలు డైరెక్ట్ అటాక్స్ మాత్రమే చేస్తాయి. అదే సైబర్ అటాక్స్ చేయడం వల్ల.. జరగాల్సిన నష్టం.. జరుగుతుంది. ఈ దిశగా మోడ్రన్ వార్ ఫేర్ రూపు దిద్దుకుంటోంది. ఇప్పటికే సైన్యంలోకి మనుషుల బదులు రోబోలను తెచ్చే దిశగా థింక్ చేస్తున్నారు. రోబోటిక్ సోల్జర్స్ తయారీ ఊపందుకుంది. ఇక్కడ మన హైదరాబాద్‌లో జరిగిన ఒక ఎక్స్ పోలో.. చిన్న చిన్న పిల్లలు రోబో హ్యాండ్స్ ని యుద్ధ సహాయం కోసం తయారు చేశారంటే ఫ్యూచర్ జనరేషన్ ఎంత యాక్టివ్ గా ఉందో తెలుసుకోవచ్చు.
రష్యా.. సొంత శాటిలైట్స్ ని పేల్చి టెస్టుల నిర్వహణ
భారత్ పాక్ మధ్య జరిగిందే మోడ్రన్ వార్ ఫేర్ అనుకుంటే రష్యా చైనా.. దగ్గరున్న రక్షణ రంగ వ్యవస్థల గురించి తెలుసుకుంటే మతిపోతుంది. ఈ దేశాల దగ్గర ప్రస్తుతం హైపర్ సోనిక్ మిస్సైల్ రంగం అభివృద్ధి చెందింది. ధ్వనివేగానికన్నా 5 నుంచి 27 రెట్ల వేగంతో ప్రయాణించగల చార్జ్ డ్ మిస్సైల్స్ ఉన్నాయి. ఇవి అణుక్షిపణులను కూడా అత్యంత వేగంగా మోసుకెళ్లగలవు. రష్యా అయితే.. తన సొంత శాటిలైట్ నే పేల్చి వేసేలాంటి టెస్టులు నిర్వహించింది.
సైన్యాన్ని తగ్గించి సాంకేతిక పరిజ్ఞానంపై పెట్టుబడులు
ఒక వేళ చైనాగానీ తైవాన్ని ఆక్రమించుకోవాలని చూస్తే, దాన్ని ఆపడానికి అమెరికా ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాలి. కారణం అంత అడ్వాన్స్డ్ మోడ్రన్ టెక్నాలజీని సిద్ధం చేసి ఉంచింది చైనా. కారణం ఆ దేశ ఆలోచనా పరిధి వేరు. అఖండ భారత్ లా డ్రాగన్ దేశం కూడా అఖండ చైనా ప్లాన్ చేస్తోంది. అది సాధ్యం కావాలంటే.. ఇలాంటి అధునాతన సాంకేతిక పరిజ్ఞానం అవసరమన్న ఆలోచనలో ఉంది చైనా. ఉత్తర కొరియా కూడా ఏమంత తక్కువగా లేదు. 700 కిలోమీటర్ల మేర లక్ష్యాలను చేధించగలిగే.. హైపర్ సోనిక్ మిస్సైళ్లను తయారు చేసి ఉంచింది. భారత్ కూడా తన డీఆర్డీవో ద్వారా ఈ దిశగా తన ప్రయత్నాలు చేసింది. రష్యా చైనాలతో పోటీ పడుతోంది.