Muslims Multiple Marriages| దేశంలో గత కొంతకాలంగా యూనిఫాం సివిల్ కోడ్ (ఉమ్మడి పౌరస్మృతి)పై చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఒక రాష్ట్ర హై కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. యూనిఫాం సివిల్ కోడ్ విషయంలో కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా ముస్లింలకు ఉన్న ప్రత్యేక షరియా చట్టాన్ని రద్దు చేయాలనే యోచనలో ఉంది. ఈ క్రమంలో అలహాబాద్ హై కోర్టు ముస్లింలు బహుభార్యలు కలిగి ఉండడానికి వారి మత గ్రంథం ఖురాన్ సహేతుకంగా షరతులతో కూడిన కారణాలు వివరించిందని.. కానీ కొంత మంది ఈ సౌలభ్యాన్ని తమ స్వార్థ ప్రయోజనాల కోసం దుర్వినియోగం చేస్తున్నారని కోర్టు అభిప్రాయపడింది.
అలహాబాద్ హై కోర్టులో జస్టిస్ అరుణ్ కుమార్ సింగ్ దేశ్వాల్ ఒక పిటీషన్ విచారణ సమయంలో ఈ వ్యాఖ్యలు చేశారు. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని మోరాదాబాద్ నగరంలోని హై కోర్ట్ బెంచ్ లో ఫుర్కాన్ అనే యువకుడు తనకు వ్యతిరేకంగా తన భార్య వేసిన కేసు కొట్టివేయాలని పిటీషన్ లో కోరాడు. ఫుర్కాన్ రెండవ భార్య అతనిపై చీటింగ్, రేప్ కేసు పెట్టింది. ఆమె 2020లో తన భర్త ఫుర్కాన్‌కు వ్యతిరేకంగా కేసు ఫైల్ చేసింది. మొదటి భార్య ఉన్నా.. తనకు ఆ విషయం చెప్పకుండా మోసపూరితంగా తనను వివాహం చేసుకున్నాడని.. ఆ తరువాత తనపై అత్యాచారం చేశాడని ఆమె వాదించింది. మొరాదాబాద్ పోలీసులు ఈ కేసులో ముగ్గురిని అదుపులోకి తీసుకొని విచారణ చేసింది.
పోలీసులు తనను వేధిస్తున్నారని.. తన భార్య తనపై ఆరోపణలు చేసిందని పేర్కొంటూ ఫుర్కాన్ హై కోర్టులో పిటీషన్ వేశాడు. అయితే ఫుర్కాన్ తరపున లాయర్ వాదిస్తూ.. తన క్లైంటు ఫుర్కాన్ ని ఇష్టపూర్వకంగానే అతని రెండో భార్య వివాహం చేసుకుందని.. ఇప్పుడు అతనిపై రేప్ కేసు పెట్టడం నిరాధారమైనదని చెప్పాడు. “ఇప్పుడు ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 494 ప్రకారం.. ఫుర్కాన్ పై చర్యలు చేపట్టాలంటే అతని రెండో వివాహం చెల్లదని తీర్పు ఇవ్వాలి. మరి ఈ కేసులో అది కుదురుతుందా?” అని వాదించాడు.
Also Read: రాత్రి నిద్రపట్టడం లేదా? కమ్మని నిద్ర కోసం ఈ చిట్కాలు పాటించండి
ఇరు వైపులా వాదనలు విన్న జస్టిస్ దేస్వాల్.. యూనిఫామ్ సివిల్ కోడ్ ని పరిశీలించాక.. ఫుర్కాన్, అతని రెండు భార్యలు ముస్లింలని చెప్పారు. ముస్లింలకు ఖురాన్ ప్రకారం.. నాలుగు పెళ్లిళ్లు చేసుకునే అనుమతి ఉందని అన్నారు. దీనికి ఖరాన్ లో చారిత్ర కారణాలు వివరించబడ్డాయని.. భారత దేశంలో కూడా ముస్లింల వివాహాలు, విడాకులు విషయంలో షరియా చట్టం, 1937 అమలులో ఉందని అన్నారు. అందుకే 18 పేజీల తీర్పు వెలువరిస్తూ.. ఫుర్కాన్ , అతని ఇద్దర ముస్లింలు కాబట్టి అతని రెండు వివాహాలు చెల్లుబాటు అవుతాయని వ్యాఖ్యానించారు. కేసులో తదుపరి విచారణ మే 26కు వాయిదా వేశారు.