BigTV English

India Covid Update: కరోనా కోరలు.. కేరళలో మరో ముగ్గురు మృతి.. 24 గంటల్లో ఎన్నికేసులంటే ?

India Covid Update: కరోనా కోరలు.. కేరళలో మరో ముగ్గురు మృతి.. 24 గంటల్లో ఎన్నికేసులంటే ?
India Covid Update

India Covid Update(Telugu news live today):

కరోనా మహమ్మారి మళ్ళీ కోరలు చాస్తుంది. ప్రపంచం మొత్తాన్ని ఉలిక్కిపడేలా చేసినా ఈ పెనుభూతం.. ప్రభావం పూర్తిగా తగ్గిపోయిందని సంతోషిస్తున్న వేళ ఇప్పుడు కొత్త వేరియంట్ మళ్లీ గుబులు రేపుతోంది. కొత్త వేరియంట్ కారణంగా దేశంలో కరోనా మళ్ళీ విజృంభిస్తోంది. ఒక్కరోజు వ్యవధిలోనే ప్రపంచ వ్యాప్తంగా వేల మంది కొవిడ్ బారిన పడుతున్నారు.


మన దేశంలో కూడా గడిచిన 24 గంటల్లో 341 కొత్త కేసులు నమోదు కావడం భయాందోళన కలిగిస్తుంది. కాగా కేరళలో కోవిడ్-19 కారణంగా ముగ్గురు మృతి చెందడం ప్రజల్ని కలవరానికి గురి చేస్తుంది. అలానే గత 24 గంటల్లో రాష్ట్రాల వారీగా నమోదైన కేసులను గమనిస్తే.. కేరళలో 292..తమిళనాడు 13.. మహారాష్ట్ర 11.. కర్ణాటక 9.. పుదుచ్చేరిలో 4.. ఢిల్లీ, గుజరాత్ లలో చెరో 3.. పంజాబ్, గోవా లలో చెరో 1 కేసు నమోదైంది.

అయితే కొత్త వేరియంట్‌కు సంబంధించి తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ కీలక ప్రకటన చేసింది. ఈ వేరియంట్‌ గురించి పెద్దగా భయపడాల్సిన అవసరం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. జేఎన్‌1 వేరియంట్ ప్రజల ఆరోగ్యంపై పెద్దగా ప్రభావం చూపదని.. దీనిని ‘వేరియంట్‌ ఆఫ్‌ ఇంట్రెస్ట్‌’గా వర్గీకరించారు. అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లు జేఎన్‌1తో పాటు ఇతర వేరియంట్ల నుంచి కూడా రక్షణ కల్పిస్తాయని డబ్ల్యూహెచ్‌ఓ పేర్కొంది.


ఇక తెలంగాణలో సైతం నాలుగు కేసులు నమోదు అయ్యాయి. ఈ క్రమంలోనే రాష్ట్రంలో అవసరమైన ప్రణాళికను సీఎం రేవంత్ సర్కారు సిద్ధం చేస్తుంది. కోవిడ్‌ టెస్ట్‌ల సంఖ్యను పెంచి.. మెడికల్‌ కిట్లు, మందులను ఆస్పత్రుల్లో అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకుంటున్నారు.

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×